హైదరాబాద్, సాక్షి: రాజకీయాల్లో జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ దివంగత మాజీ సీఎం డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, అయితే ఆయనకు ఆ గుర్తింపు ఊరికే రాలేదని అన్నారు సీపీఐ నారాయణ. సోమవారం (జులై 8న) వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్న నారాయణ.. వైఎస్సార్ రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్ పార్టీలోనూ వైఎస్సార్‌ను చాలామంది ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ ఇబ్బందులు కొనసాగాయి. సొంత పార్టీ, బయటి పార్టీల నుంచి రాజశేఖర్‌రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కష్టాలు ఎదుర్కొని నిలపడ్డారు కాబట్టే ‘జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్’ అయ్యారు’’ అని నారాయణ అన్నారు.
ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్సార్ తనయ షర్మిలపైనా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మకి ఇంకా అన్ని కష్టాలు రాలేదు. ఒకవేళ షర్మిలకు ఏమైనా కష్టాలు వస్తే.. అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయి. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు?
Comments
Please login to add a commentAdd a comment