K Narayana
-
షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు!: సీపీఐ నారాయణ
హైదరాబాద్, సాక్షి: రాజకీయాల్లో జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్ దివంగత మాజీ సీఎం డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని, అయితే ఆయనకు ఆ గుర్తింపు ఊరికే రాలేదని అన్నారు సీపీఐ నారాయణ. సోమవారం (జులై 8న) వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్న నారాయణ.. వైఎస్సార్ రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీలోనూ వైఎస్సార్‌ను చాలామంది ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆ ఇబ్బందులు కొనసాగాయి. సొంత పార్టీ, బయటి పార్టీల నుంచి రాజశేఖర్‌రెడ్డి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, ఆ కష్టాలు ఎదుర్కొని నిలపడ్డారు కాబట్టే ‘జెమ్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్’ అయ్యారు’’ అని నారాయణ అన్నారు. ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్న వైఎస్సార్ తనయ షర్మిలపైనా నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిలమ్మకి ఇంకా అన్ని కష్టాలు రాలేదు. ఒకవేళ షర్మిలకు ఏమైనా కష్టాలు వస్తే.. అవి ఆమె సొంత పార్టీ నుండే వస్తాయి. కాబట్టి ‘షర్మిలమ్మా.. జాగ్రత్తగా ఉండు..’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: విభజన సమస్యల చర్చల్లో రహస్యమెందుకు? -
బీజేపీ విధానాలపై పోరాటాలు తీవ్రతరం
సాక్షి, అమరావతి: దేశంలో బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్ అనుకూల నయా ఉదారవాద ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలపై పోరాటాలను తీవ్రతరం చేయాలని సీపీఐ 24వ జాతీయ మహాసభలు తీర్మానం చేశాయి. విజయవాడలో జరుగుతున్న మహాసభల వివరాలను ఆ పార్టీ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, అమర్జిత్కౌర్, అతుల్‌కుమార్ అంజాన్, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు మీడియా సమావేశంలో వెల్లడించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం వచ్చాక సంస్కరణల అజెండా అమల్లో వేగం పెరిగిందని, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ప్రభావం ప్రజల్లో తీవ్రమైన అసమనతలకు దారితీసిందని చెప్పారు. ఫలితంగా కొద్ది మంది చేతుల్లోకే సంపద కేంద్రీకరణకు దారితీసిందన్నారు. కార్పొరేట్లకు రాయితీలు పెంచుతున్నారని, అదే సమయంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేదరికం పెచ్చుమీరి ఆకలి చావులు పెరిగాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మహాసభ తీర్మానించినట్టు వివరించారు. అలాగే మూడేళ్ల బిడ్డకు తల్లీ, తండ్రి ఎవరో చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని, తెలుగు ప్రజలు ఎక్కడకి వెళ్లినా మీ రాజధాని ఏది అంటే చెప్పలేక పోతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ తీర్మానం చేసినట్టు చెప్పారు. యువతరానికే నాయకత్వ పగ్గాలివ్వాలి: పార్టీ నిర్మాణంపై ప్రతినిధులు పార్టీని సంస్థాగతంగా చక్కదిద్దుకోకుండా ఉద్యమ పథంలో రాణించలేమని సీపీఐ జాతీయ మహాసభల్లో పలువురు ప్రతినిధులు తెగేసి చెప్పారు. విజయవాడలోని గురుదాస్ దాస్‌గుప్త నగర్లో జరుగుతున్న మహాసభల్లో ‘పార్టీ నిర్మాణం’పై ఆదివారం వాడివేడీ చర్చ జరిగింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు చర్చలో తమ అభిప్రాయాలను స్పష్టం చేశారు. పార్టీలో వృద్ధ నేతల అనుభవాన్ని ఉపయోగించుకుంటూ యువతరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కోరారు. కమ్యూనిజం అజేయం: 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధుల ఉద్ఘాటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించిన కమ్యూనిజానికి తిరుగులేదని, పీడిత, తాడిత జనం కోసం పోరాడే కమ్యూనిజం అజేయంగా నిలుస్తుందని 17 దేశాలకు చెందిన 31 మంది ప్రతినిధులు తమ సందేశాన్ని విన్పించారు. మతతత్వ శక్తులను తిప్పికొడదామని, ఆంక్షలు పెడుతున్న అమెరికాకు తగిన గుణపాఠం చెబుతామని, పెట్టుబడిదారీ విధానాలపై రాజీలేని పోరును కొనసాగించాలని వివిధ దేశాల ప్రతినిధులు స్పష్టం చేశారు. -
అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా విజయవాడలో అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరు తో నిర్వహించే జాతీయ సదస్సుకు సీఎం కేసీఆర్‌తోపాటు తమిళనాడు, కేరళ, బిహార్ ముఖ్యమంత్రులు స్టాలిన్, పినరయి విజయన్, నితీశ్ కుమార్‌నూ ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. వచ్చే నెల 14–18 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ తరువాత తొలిసారిగా సీపీఐ నూతన రాష్ట్ర సమితి సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో, విధానాల్లో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో విజయవాడలో నిర్వహించనున్న మహాసభలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య జాతీయస్థాయిలో ఐక్యత బలపడేందుకు ఈ మహాసభ ద్వారా ప్రయత్నం జరగనుందని తెలిపారు. సీపీఐ జాతీయ మహాసభకు 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉద్యమాల విషయంలో మొహమాటం లేదు: కూనంనేని ప్రజా సమస్యలపై ఉద్యమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి మొహమాటం లేకుండా పోరాడతామని కూనంనేని సాంబశివరావు చెప్పారు. రాష్ట్రంలో మతతత్వ బీజేపీని నిలువరించేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతునిచ్చామని, అదే సమయంలో ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. దేవరకొండ నియోజకవర్గంలో మహిళల శిరోముండనం ఘటనను వదిలిపెట్టబోమని, సాంఘిక దురాచారాలు, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. -
మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది!
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని రుషికొండపై పర్యాటక శాఖ చేపట్టిన రిసార్ట్ పునరుద్ధరణ పనులపై హైకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతుండగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను హైకోర్టు ప్రశ్నించింది. ఈ దశలో అక్కడికి వెళ్లాలంటే పునరుద్ధరణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అనుమతి తీసుకోవడం సముచితంగా ఉంటుందని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పించాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖ పోలీస్ కమిషనర్, పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రుషికొండ రిసార్ట్ ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనుల పరిశీలన నిమిత్తం తాను అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ఈ సందర్భంగా అడ్డంకులు సృష్టించకుండా అధికార యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ కె.నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రాయ్ బుధవారం విచారణ జరిపారు. నారాయణ తరఫు న్యాయవాది జువ్వాది శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. రిసార్ట్ పనులు నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్నాయా? లేదా అన్న అంశంపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఓ రాజకీయ పార్టీ నేతగా పిటిషనర్‌పై ఉందన్నారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్న ప్రాంతం నిషిద్ధ ప్రదేశం కాదన్నారు. పర్యాటక శాఖ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పనులు జరుగుతున్న ప్రాంతం కాంట్రాక్టర్ నియంత్రణలో ఉందన్నారు. ప్రజాభద్రత దృష్ట్యా కాంట్రాక్టర్ ఆ ప్రాంతానికి ఎవరినీ అనుమతించడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రస్తుత దశలో అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముందని నారాయణను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు. -
దండం పెడుతున్నా, వదిలేయండి.. చిరు ఫ్యాన్స్‌కు క్షమాపణలు
మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు సీపీఐ నారాయణ. తాను వాడిన పదాలను భాషాదోషంగా పరిగణిస్తున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. విజయవాడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'చిరంజీవి గురించి చేసిన కామెంట్ భాషాదోషంగా గమనించాను. దీనివల్ల చిరంజీవి అభిమానులతో పాటు కొందరికి బాధ, ఆవేశం కలిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పార్టీలు లేవు. దాని ప్రకారం నేను మాట్లాడింది వాస్తవమే. అయితే రాజకీయ భాషకు మించి చిరంజీవి గురించి మాట్లాడినదాన్ని భాషాదోషంగా పరిగణించాలి. మీకు దండం పెడుతున్నా, దాన్ని వదిలిపెట్టండి' అని కోరారు. కాగా ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా చిరును పిలవడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవి స్టేజీపై స్థానం తగదంటూ చిల్లర బేరగాడు అంటూ తిట్టిపోశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. చదవండి: గుడ్‌న్యూస్, ఇకమీదట అన్ని సినిమాలకు ఒకటే టికెట్ రేట్! చైసామ్ మా అపార్ట్మెంట్లో ఉండేవారు, అసలు గొడవపడేవారు కాదు -
కోరల్లేని పాములు కేసీఆర్, మోదీ
సాక్షి, కోదాడ అర్బన్, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కోరల్లేని పాముల్లా బుసలు కొడుతున్నారని, కాటు మాత్రం వేసుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యంగ్యంగా అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ దేశాన్ని ఇప్పటివరకు పాలించిన 14 మంది ప్రధానులు ప్రభుత్వరంగ సంస్థలను తీసుకొస్తే, ఒక్క మోదీనే 24 ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. మోదీ దత్తపుత్రుడైన ఆదానీ సంస్థ నుంచి బొగ్గును రాష్ట్రాలన్నీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా, మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి, స్టేషన్‌కు తరలించిన రేంజ్ ఆఫీసర్ రత్నాకర్ రావును వెంటనే ప్రభుత్వం సస్పెండ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ మహిళలపై అటవీ, పోలీస్ శాఖల దాడులను తీవ్రంగా ఖండించారు. -
సీపీఐ నారాయణకు సతీ వియోగం
సాక్షి, అమరావతి/నగరి: సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సతీమణి వసుమతిదేవి (65) ఆకస్మిక మృతి చెందారు. గురువారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రావడంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వసుమతిదేవి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి. 1976లో తిరుపతి మహిళా వర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న సమయంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో విద్యార్థి, యువజన విభాగాలకు నాయకత్వం వహిస్తున్న నారాయణతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 1986లో వర్కింగ్ ఉమెన్స్ ఆర్గనైజేషన్‌లో చిత్తూరు జిల్లా శాఖకు నాయకత్వం వహించారు. నారాయణతో వివాహం తర్వాత ఆయన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా, ఆమె కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సహకరించారు. ఆమె మృతి వార్తతో నగరి నియోజకవర్గంలోని స్వగ్రామం ఐనంబాకంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు వసుమతి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగిస్తారు. ఆమె మృతి పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) జాతీయ కార్యదర్శి అనీరాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి రామానాయుడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్ తదితరులు నారాయణను ఫోన్లో పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. గవర్నర్, సీఎం సంతాపం వసుమతిదేవి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకురాలిగా ఏఐఎస్ఎఫ్లో పనిచేసిన వసుమతి బ్యాంక్ ఉద్యోగిగా సేవలు అందించి స్వచ్చంద పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ మీడియా రంగంలోనూ వసుమతి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని గవర్నర్ తెలిపారు. ► సీపీఐ నాయకుడు కె.నారాయణ సతీమణి వసుమతి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ► వేరొక ప్రకటనలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. -
మత తత్వాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ
తిరుపతి కల్చరల్: లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేస్తూ మత ఛాందసవాదాన్ని బీజేపీ రెచ్చగొడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకునేందుకు కమ్యూనిస్టులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 17వ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో మంగళవారం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో ‘భారతదేశ చరిత్ర, సంస్కృతి–వక్రీకరణ’ అంశంపై సదస్సు నిర్వహించారు. నారాయణ మాట్లాడుతూ.. గొప్ప సంస్కృతి కలిగిన భారతదేశ చరిత్రను వక్రీకరించే కుట్ర జరుగుతున్నదన్నారు. హిందూ తత్వాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం, మైనారిటీ, బౌద్ధులు, క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు పీఎల్ నరసింహులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ శక్తులు హిందూ తత్వాన్ని భుజానికి ఎత్తుకుని ముస్లింలకు వ్యతిరేకంగా చరిత్రను మార్చివేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. సదస్సులో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
చెప్పులు, వస్త్రాలపై జీఎస్టీ పెంచడం సిగ్గుచేటు
తిరుపతి కల్చరల్: వస్త్రాలు, చెప్పులపై ఉన్న జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచడం సిగ్గు చేటని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రూ.వెయ్యిలోపు కాటన్ దుస్తులు కొనేవారికి 12 శాతం జీఎస్టీ విధించడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చే ప్రతి జీవో వెనుక కార్పొరేట్లకు లాభం చేకూర్చే విధానాలు దాగి ఉన్నాయని విమర్శించారు. కొట్టుకొచ్చిన డబ్బుతో కమ్యూనిస్టులు బిల్డింగ్లు కడుతున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించడం దుర్మార్గమన్నారు. చీప్ లిక్కర్ రూ.50కే అందిస్తామన్న సోము వీర్రాజు చరిత్రలో సారాయి వీర్రాజుగా మిగిలిపోతారన్నారు. విజయవాడలో పోయిన పరువును గుంటూరు జిన్నా టవర్ వద్ద వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.కమ్యూనిస్టులను విమర్శించే అర్హతవీర్రాజుకు లేదన్నారు. సోము వీర్రాజుతో పాటు మరో బీజేపీ ముఖ్య నేత కల్కి ఆశ్రమానికి ఫోన్ చేసి రూ.3 కోట్లు డిమాండ్ చేయలేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లధనం వెలికి తీసుకొస్తాం అనే పేరుతో రెండు లక్షల కోట్లు బీజేపీ నేతలు కొల్లగొట్టారన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, తద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని చెప్పారు. సీపీఐ, సీపీఎం పునరేకీకరణకు సీపీఐ కట్టుబడి ఉందన్నారు. -
జైభీమ్: నాటి పోరాటం గుర్తొచ్చింది!
‘జైభీమ్’ సినిమా చూశాను... నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్‌లు లేవు. యువ లాయర్ల బాధ్యతను, సందేశాత్మక సంకేతాలను ‘జై భీమ్’ సినిమా సమాజానికి పంపింది. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఉపసంహరించు కోవాలన్న పోలీసు బాస్... నీ భర్త ఎటు రాడు... కనీసం పరిహారం తీసుకొని కోర్టు కేసు వెనక్కు తీసుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు చెంపపెట్టులా ఉంటుంది. నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు 37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది. నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ ఇల్లులేక ప్లాట్‌ఫారంపై పడుకునే అభాగ్యురాలు. ఒక రోజు రాత్రి బీట్ కానిస్టేబుల్స్ తమ లాఠీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు. లక్ష్మి పరుగెత్తుతుండగా పోలీసులు కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది. విషయం తెలియగానే మేమంతా ఘటనా స్థలానికి చేరుకున్నాం. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి నిరసన ప్రదర్శన ప్రారంభించాం. నిరసన 25 మందితోనే మొదలైనా, క్రమంగా వందలమంది జతకలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మరునాడు బంద్‌కు పిలుపునిచ్చాము. మేము బంద్ పిలుపు ఇచ్చిన రోజునే నాటి సీఎం ఎన్టీఆర్ తిరుమల పర్యటన ఉంది. ముందురోజు నడి రాత్రి కొందరు పోలీ సులు వచ్చి నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావు, ఎస్పీ ఆల్ఫ్రెడ్ నాతో మాట్లాడుతూ రేపటిబంద్ పిలుపును ఉపసంహరించుకోండి నగరంలో సీఎం పర్యటన ఉందన్నారు. నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. (చదవండి: వారి నిర్బంధంలో న్యాయముందా?) ఆ సమయంలో అధికారులు ఇద్దరూ నాతో.... చనిపోయిన లక్ష్మిది ఈ ప్రాంతం కాదు, ఆమె కోసం మీరు పోరాటం చేస్తే మీకూ, మీపార్టీకి వచ్చే లాభం ఏమిటి, మీపై కేసులు పడటం తప్ప అని వ్యాఖ్యానించారు. ‘మా ఉద్యమం వలన సామాన్యులు కూడా చైతన్యంతో, ధైర్యంగా నివసించగలరు. అధికారులు బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం’ అనేశాను. మరునాడు బంద్ జరిగింది. మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్ జైలులో వారంపాటు నిర్బంధించారు.. కానీ మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్, రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడటానికి ఊతం ఇచ్చింది. ‘జై భీమ్’ సినిమా చూస్తుంటే 37 ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమా రీళ్లలాగా నాకళ్ల ముందు కదులుతున్నాయి. (చదవండి: ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం) - డాక్టర్ కె. నారాయణ వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యదర్శి -
పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే మోదీని నిలదీయాలి
ఆలకూరపాడు(టంగుటూరు): బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని కలిసి నడుస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంతో పోరాడాలని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ సూచించారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుటుంబసభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్కే, కుమారుడు మున్నా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్రుడైన పవన్ చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కుపై మోదీని నిలదీయాలన్నారు. కర్మాగారం కాపాడుకునేందుకు దీక్ష చేపడతానని ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.అలాగే ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రెండోసారి జరిగిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పారు. శాసించే స్థాయి పదవిలో ఆయన ఉండి కూడా విశాఖ ఉక్కుపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. -
కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు
హఫీజ్‌పేట్ (హైదరాబాద్): తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డిలు అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్ ఫౌండేషన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్.సుగుణ రచించిన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబు, దొరల పాలనకు వ్యతిరేకంగా పేద, కార్మిక, కర్షక, కళాకారులు ఏకమై మహత్తరమైన పోరాటం చేశారన్నారు. ఆనా టి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లో ఈ సాయుధ పోరాటం జరిగిందన్నారు. అయి తే అప్పటి పోరాటంతో ఎలాంటి సంబంధంలేని బీజేపీ, దానిని కేవలం హిందూ, ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణలో వేల ఎకరాల భూమిని దొరల నుంచి లాక్కుని పేద ప్రజలకు ఇచ్చిన చరిత్ర ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప రస్పరం సహకరించుకుంటూ.. పేదలపై భారం మోపే లా పాలన కొనసాగస్తున్నాయన్నారు. కేం ద్రం.. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతుంటే.. టీఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని విమర్శించారు. సీఆర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అనారోగ్య కారణంగా సభకు హాజరు కానందున ఆయన సందేశాన్ని యూ ట్యూబ్ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాçష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, రఘుపాల్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులదేనని, మతోన్మాద బీజేపీ నాయకులకు దానిపై మాట్లాడే హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయుధ పోరాట యోధుడు మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద 74వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉత్సవాలు సీపీఐ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సభకు సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ అధ్యక్షత వహించగా నేతలు మఖ్డూమ్ మొహియుద్దీన్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరించి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ సాయుధ పోరాట సమయంలో అసలు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా జయప్రదం చేయాలని ప్రజలను నారాయణ కోరారు. చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ భూస్వామ్య వ్యవస్థకు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతరేకంగా రైతాంగ సాయుధ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిందని, ఈ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని అన్నారు. అనంతరం ఎర్ర జెండాలతో తెలంగాణ సాయుధ పోరాట యోధులను స్మరించుకుంటూ మఖ్దూమ్ మొహియుద్దీన్ విగ్రహం వద్ద నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. -
బిగ్‌బాస్ షోను నిషేధించాలి: సీపీఐ నారాయణ
బిగ్‌బాస్ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిగ్‌బాస్ షో వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. ఇలాంటి షోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఈ అనైతిక షోను వేల కోట్ల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహించారు. బూతులు, కొట్లాటలతో సాగే బిగ్‌బాస్ షో అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని ఆపాలంటూ గతంలో కోర్టుకెక్కినప్పటికీ, అటు న్యాయవ్యవస్థ, ఇటు పోలీసులు తనకు ఏమాత్రం సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికిమాలిన షోను టీవీలో ప్రసారించేందుకు అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అసలు డ్రగ్స్ సూత్రధారులను పట్టుకోవాలి: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖులపై ఈడీ విచారణ మంచి పబ్లిసిటీతో రక్తి కట్టిస్తుందని, అసలు డ్రగ్స్ సూత్రధారులను పట్టుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేశసరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆగడాలను అరికట్టడం, డ్రగ్ మాఫియాను అణిచివేయడం, ఎన్నికల్లో నల్లధనాన్ని ఆపడమే ధ్యేయంగా ప్రధాని మోదీ నోట్లరద్దుని ప్రకటించారని మరి ఆ లక్ష్యం ఇప్పుడు నెరవేరిందా అని ప్రశ్నించారు. గతంలో డ్రగ్స్ వినియోగించిన వారిపై తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని, విచారించిన రిపోర్టు బుట్టదాఖలైందని మండిపడ్డారు. ఇప్పటి విచారణ కూడా కళాకారులను ఏడిపించేదిగా ఉంది తప్ప అసలు మాఫియాను పట్టుకునేదిగా కనపడటం లేదని విమర్శించారు. -
రఘురామను అడ్డుపెట్టుకొని ఆటలా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజును అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడించాలని చూస్తోందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జె.సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇటీవల ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను అర్థం చేసుకోవాలన్నారు. సీబీఐ బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని నారాయణ మండిపడ్డారు. పార్టీ సమితి సమావేశాలకు గుంటూరు జిల్లా నుంచి వస్తున్న సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. 11న సీపీఐ నేతలు టిడ్కో ఇళ్లను సందర్శించనున్నట్టు తెలిపారు. -
ఏపీ వివరణ ఆమోదయోగ్యమైనదే
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ వివాదంలో ఆంధ్రప్రదేశ్ ఇస్తోన్న వివరణ సరైనదే అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ. శనివారం దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఐదేళ్ల పాటు ఉన్న ఒప్పందం ముగిసింది. దాంతోనే ఈ ఇబ్బంది తలెత్తింది. మేము ఎన్ని కిలో మీటర్లు తిప్పితే మీరు అన్నే తిప్పాలి అంటూ తెలంగాణ, ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది. లక్ష 26 వేల కిలోమీటర్లు తిప్పుతున్న ఏపీ దానిని తగ్గించుకునేందు సైతం ముందుకు వచ్చింది. ప్రైవేటు ట్రావెల్స్ వల్ల ఏపీకి మూడు కోట్లు, తెలంగాణకు రెండు కోట్ల రూపాయల నస్టం వస్తుంది. ప్రైవేటు ట్రావెల్స్ తగ్గిస్తే ప్రజలకు ఉపయోగం అని ఏపీ ప్రభుత్వం ఆలోచన. ప్రైవేటు వారు బాగుపడిన ఫర్వాలేదు కానీ ఏపీకి లాభం రాకూడదన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం కక్ష పూరిత వైఖరిని అవలంబిస్తోంది. ఆర్టీసీ 400 రూపాయలు వసూలు చేస్తే.. ప్రైవేట్ ట్రావేల్స్ 1000 రూపాయలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికైనా ఇరువురు సీఎంలు చొరవ తీసికోవాలి’ అని కోరారు. (చదవండి: టీఎస్ఆర్టీసీ కోరినట్లే ప్రతిపాదనలు పంపాం) చంద్రబాబు తప్పు చేశాడు ‘విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీ మూర్తి గారు ప్రభుత్వ భూమిని కొంత ఆసుపత్రి కోసం తీసుకున్నామని ఎప్పుడో చెప్పారు. బీఆర్ఎస్ ప్రకారం ఫైన్ వేయవచ్చు.. చర్యలు తీసుకోవచ్చు కూల్చి వేయడం కరెక్ట్ కాదు. కట్టేటప్పుడు చూస్తూ ఉండి కట్టాక కూల్చేస్తున్నారు. విశాఖలో2వేల ఎకరాల ప్రభుత్వ భూమి అక్రమణలో ఉంది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏ మొహం పెట్టుకొని ఏపీలో బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తారు. మోదీ ఏపీకి ఇచ్చిన హామీలు నిరవేర్చలేదు. పోలవరం ప్రాజెక్ట్‌కు కావాల్సిన డబ్బులు కేంద్రమే ఇవ్వాలి. ఇది జాతీయ ప్రాజెక్ట్.. పోలవరం కడతా అని చంద్రబాబు తప్పు చేశాడు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సుమారు 5వేల కోట్ల రూపాయలు జీఎస్టీ బకాయిలు రావాలి. కేంద్ర మంత్రులు రాష్టానికి వచ్చి అబద్దాలు చెప్పి పోతున్నారు’ అంటూ మండి పడ్డారు. (చదవండి: గీతం వర్సిటీలో ఆక్రమణల తొలగింపు) మోదీ, ట్రంప్ నాటకరాయుళ్లు ‘ప్రపంచలోనే గొప్ప నాటకరాయుళ్లు, రాజకీయ కళాకారులు ట్రంప్, మోదీలు. తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు చనిపోతే.. బిహార్ ఎన్నికల్లో ఓట్లకోసం బిహార్ రెజ్మెంట్ అని మోదీ ప్రచారం చేస్తున్నారు. బిహార్ రెజ్మెంట్లో బిహారీలు ఒక్కరే ఉండరు. తెలంగాణ వాసిని బిహార్ వాసిగా చెపుతున్నారు. ఇది జాతి ద్రోహం కాదా. నైతికంగా ఇంత దిగజారిన ప్రధానిని మేము చూడలేదు. శవాల మీద పేలాలు వేరుకునే తంతుగా అబద్దాలతో ఓట్లు అడుగుతున్నారు. ఓట్ల కోసం దేశాన్ని తప్పు దోవపట్టించే ఇలాంటి ప్రధానిని మేము చూడలేదు’ అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రైతు వ్యతిరేకి చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రైతు వ్యతిరేకిగా మారారని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రంలో మోదీని, రాష్ట్రంలో వైఎస్సార్సీపీని వ్యతిరేకించాల్సిన చంద్రబాబు–బీజేపీకి అనుకూలంగా మారి, జాతీయ స్థాయిలో రైతు ఉద్యమానికి నాయకత్వం వహించే గొప్ప ఛాన్స్ పోగొట్టుకున్నారని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘చంద్రబాబు అన్ని విధాలా విఫలమయ్యారు. కేంద్రం అనేక ప్రజా వ్యతిరేక బిల్లుల్ని, చట్టాల్ని తెచ్చింది. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ వ్యతిరేకించలేదు’ అని తెలిపారు. -
పవన్‌తో పొత్తు పెట్టుకొని పెద్ద తప్పు చేశాం
సాక్షి, ద్వారకానగర్ (విశాఖ): గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని, అందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేసిందంటూ విశాఖలో మంగళవారం వామపక్షాలు ఆందోళన చేశాయి. నారాయణ మాట్లాడుతూ.. ఆనాడు తమతో పొత్తు పెట్టుకున్న పవన్.. నేడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నాడని విమర్శించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి వ్యక్తిత్వమే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. (చదవండి: నిజాలు దాచి.. నిందలు) -
బిగ్‌బాస్ అనైతిక షో: నారాయణ
టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ఈ షో వల్ల ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. "అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ షోను ప్రారంభించారు. అది చూస్తుంటే హిమాలయంలో ఉన్న సాంస్కృతిక సంఘాన్ని తీసుకువచ్చి ఈ మురికి కుంటలో పడేసినట్లు ఉంది. విజయ్ మాల్యా జీవించే భవనాలు ఎంత విలాసంగా ఉన్నాయో, అంతకు మించి బిగ్‌బాస్ హౌస్ ఉంది. యువతీ యువకుల్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. వందరోజుల పాటు ఇంట్లోనే పెడతారట. (బిగ్‌బాస్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్!) నాగార్జున ఓ యువకుడిని(అభిజిత్) పిలిపించి.. ముగ్గురు సినిమా హీరోయిన్ల ఫొటోలను చూపించి వారి గురించి చెప్పమంటాడు. అప్పుడా యువకుడు ఒకమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఒకమ్మాయితో డేటింగ్ చేస్తా, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. ఇదేనా యువతీయువకులకు మీరిచ్చే సందేశం. 100 రోజుల పాటు లోపలే ఉంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయడం ఘోరం. ఇలా అనైతిక చర్యలకు పాల్పడటాన్ని మేము ఖండిస్తున్నాం. కళామతల్లికి అన్యాయం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కోట్ల మంది ప్రజలను టీవీ ముందు కూర్చోబెడుతూ సాంస్కృతిక దోపిడీ జరుగుతోంది. ఇలాంటి అనైతిక షోలను ప్రజలు ఆదరించవద్దు" అని నారాయణ పిలుపునిచ్చారు. (బిగ్‌బాస్: ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ) -
లాక్డౌన్లో మద్యం అమ్మకాలా?
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ కొనసాగుతుండగా మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మద్యం అమ్మకాల పునరుద్ధరణను ప్రజావ్యతిరేక చర్యగా పేర్కొంది. లాక్డౌన్ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ డిమాండ్ చేశారు. ఆయన మీడియాలో మాట్లాడుతూ.. ‘కరోనావైరస్ ఇప్పటికీ ఉనికిలో ఉంది. లాక్డౌన్ ఇప్పటికీ అమలులో ఉండగా మద్యం దుకాణాలను మద్యం విక్రయించడానికి ఎలా అనుమతిస్తారు? మద్యం అమ్మకాలను అనుమతించడం ప్రజా వ్యతిరేక విధానం. లాక్డౌన్ ఎత్తివేసే వరకు దేశంలో మద్యం అమ్మకాలను నిషేధించాలి. లేకపోతే ఇది ప్రజలపై చెడు ప్రభావాన్ని చూపుతుంద’ని నారాయణ అన్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు తిరిగి ప్రారంభం కావడంతో వైన్ షాపుల ముందు మందుబాబులు పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో పలు పలు రాష్ట్రాలు మద్యం ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో వలస, అసంఘటిత కార్మికులు, పేదలు, కూలీలను కేంద్రం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు దేశవ్యాప్తంగా సోమవారం ఒకరోజు దీక్షను చేపట్టారు. లాక్డౌన్ బాధితులను ఆదుకునేందుకు రూ. 10 లక్షల కోట్ల విలువైన ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. (లాక్డౌన్ బాధిత వర్గాలను ఆదుకోండి) -
ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం చేయడానికే..
పాతమంచిర్యాల: దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధాని మోదీ పూజిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. మంచిర్యాలలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర నిర్మాణ మహాసభకు హాజరయ్యారు. ట్రంప్ దేశ పర్యటను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ట్రంప్ పర్యటనతో దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయని, తీవ్ర నిర్బంధకాండ మధ్య ట్రంప్ పర్యటన సాగుతోందని ఎద్దేవా చేశారు. -
ట్రంప్ పర్యటనను వ్యతిరేకిస్తున్నాం
పాత మంచిర్యాల: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు రెండో రోజు ఆదివారం జరిగాయి. ఆయన మాట్లాడుతూ.. అమెరికా రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆ భారాన్ని ఇతర దేశాలపై మోపడానికి ట్రంప్ భారత పర్యటనకు వస్తున్నారన్నారు. ట్రంప్ పర్యటన ఎలా ఉందంటే మీ ఇంటికొస్తే ఏమిస్తావు.. మా ఇంటికి ఏమి తెస్తావ్ అనేలా ఉందన్నారు. -
ఆర్థిక నేరగాళ్లకు అడ్డా బీజేపీ
సూళ్లూరుపేట: ఆర్థిక నేరగాళ్లకు బీజేపీ అడ్డాగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. ప్రజలసొమ్మును రుణాలుగా తీసుకుని ఆ నగదును తిరిగి బ్యాంకులకు ఎగ్గొట్టిన వారిని ఆ పార్టీలోకి చేర్చుకుంటూ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సూళ్లూరుపేటలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని, పరిపాలనను అస్తవ్యస్తం చేసి ప్రజలను తికమక పెడుతోందన్నారు. ఇప్పటికే అందరికీ ఆధార్ పేరుతో గుర్తింపు కార్డులున్నప్పటికీ ఇందులో మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ తుగ్లక్ పాలనను చేస్తున్నారని విమర్శించారు. 1971కు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం సోదరులకు పౌరసత్వం లేకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారన్నారు. కార్గిల్ వార్‌లో యుద్ధం చేసిన ఓ మాజీ ముస్లిం సైనికుడికి కూడా పౌరసత్వం లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. మనది సెక్యులరిజం దేశం అయినప్పటికీ హిందూమతం మాత్రమే ఉండాలన్నట్టుగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. జనవరి 8న దేశవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట ఉంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు రాజధాని విషయంలో ప్రజలను చీటింగ్ చేశారని విమర్శించారు. -
చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా
సాక్షి, అమరావతి: రాజధాని ప్రాంత రైతులకు అన్యాయం చేసింది చంద్రబాబేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. సీపీఐ 95వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం గుంటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజధానికి 33 వేల ఎకరాలు సమీకరించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రెండు, మూడు వేల ఎకరాల్లో రాజధాని కట్టుకుని ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేది కాదని అభిప్రాయపడ్డారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి రాజధానిని అభివృద్ధి చేయాలనుకోవడం సబబు కాదన్నారు. చంద్రబాబుకు అసలు తలకాయ ఉందా.. అని మండిపడ్డారు. కుక్కపని కుక్క చేయాలని.. గాడిద పని గాడిద చేయాలని, అలా చేయనందుకే చంద్రబాబు బొక్క బోర్లా పడ్డారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము కట్టుబడి ఉన్నామని.. అసెంబ్లీ, సచివాలయం ఒకేచోట ఉండాలన్నారు. మతప్రాతిపదికన దేశాన్ని చీలుస్తారా? బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికన దేశాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. అసెంబ్లీ, సచివాలయం ఉన్న రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలన్నారు. పార్టీ నేత జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది
సాక్షి, హైదరాబాద్: మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్ధూం భవన్లో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ సంస్థలైన ఆర్బీఐ, సీబీఐలాంటి సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఈశాన్య రాష్ట్రాలతో పాటు త్రిపుర, బెంగాల్లో ఉద్యమాలు ఎగిసిపడుతున్నాయన్నారు. ఈ నెల 19న పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తోందని మండిపడ్డారు. -
కేసీఆర్ రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో ఆయన మీడితో మాట్లాడుతూ, ఉమ్మడి ఏపీలో విజయవాడలో ప్రైవేట్ బస్సులకు అనుమతిపై కోర్టు స్టే ఇచ్చిన అరగంటకే అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎంకే ప్రజాస్వామ్యంపై గౌరవం లేకపోతే ఆయనపై ప్రజలకు గౌరవం ఉండదన్నారు. తక్షణమే ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, పార్టీ నాయకులు కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
‘నయా నిజాం కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేట్ చేస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్: నిజాం కాలంలో ఆవిర్భవించిన ఆర్టీసీని నయా నిజాం కేసీఆర్ ప్రైవేట్ పరం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ఆర్టీసీని కాపాడేందుకు ఎంఐఎం ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి బయటకు రావాలని సీపీఐ నారాయణ సూచించారు. శుక్రవారం మగ్దూం భవన్లో అత్యవసరంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నప్పటికీ.. ప్రభుత్వానికి ఎంఐఎం ఇప్పటికి కూడా మద్దతివ్వడంపై విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే చలో ట్యాంక్ బండ్లో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. హైకోర్టు ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్‌పై స్టే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రయివేట్ బస్సులు ప్రవేశ పెట్టేందుకు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ప్రయత్నిస్తే.. కోర్టు స్టే ఇవ్వడంతో ఆయన ఏకంగా సీఎం పదవికే రాజీనామా చేశారని గతాన్ని గుర్తు చేశారు. కోర్టులో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లకు అవమానం ఎదురైతే.. ప్రభుత్వానికి కూడా అది అవమానమే అని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, అధికారులకు అవమానం జరిగితే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు అవమానమని భావించి తక్షణమే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తీరు మార్చుకోకపోతే రావణాసురుడికి పట్టిన గతే పడుతుందని విమర్శించారు. హైకోర్టు 11న ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచేందుకు అవకాశం ఇచ్చిందని.. ఇప్పటికైనా వారిని చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు. రాష్ట్ర రెండో రాజధానిపై విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు.. సొంత పార్టీ వారు సంబంధం లేదంటే.. ఆయన మాత్రం తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం ఏమి బాలేదన్నారు. కేవలం ఆర్టీసీ సమస్యను పక్కదారి పట్టించేందుకే విద్యాసాగర్ రావు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నరని ధ్వజమెత్తారు. ఛలో ట్యాంక్‌బండ్ పిలుపు నేపథ్యంలో.. ముందస్తు అరెస్టులపై ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ తదితరులు హాజరయ్యారు. కేసీఆర్ చెప్పినట్లు చేయడం వల్లే.. కోర్టు బోనులో తలదించుకుంటున్నారు చట్టాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు చేయడం వల్లే.. నేడు ఐఏఎస్ అధికారులకు కోర్టు బోనులో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఇక్కడ సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదున్నరేళ్ల కేసీఆర్ ప్రభుత్వం పాలనలో కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసిందని అన్నారు. ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్‌పై కోర్టు స్టే ఇచ్చిందని, దీనిపై కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తక్షణమే ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలానే రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఏమాత్రం ప్రశాంతత లేదని.. ఉద్యమాలు అణచడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఛలో ట్యాంక్ బండ్‌ను విజయవంతం చేయాలని అందరిని కోరారు. -
ఆర్టీసీ సమ్మె : ‘50 వేల మందికి 360 మందే చేరారు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ దాటుకుని పరుగులు పెడుతోంది. బుధవారం అన్ని బస్ డిపోల ముందు నిరాహార దీక్షలు చేపట్టాలన్న ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపు మేరకు కార్మికులు, వామపక్ష నాయకులు కదం తొక్కారు. ముషీరాబాద్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సీఎం కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడకుండా.. చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. (చదవండి : ప్రైవేట్ బస్సులు నడిస్తే కార్మికుల శవాలపైనే..) ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టాడు. బెదిరించాడు. అయినా 50 వేల మంది కార్మికుల్లో కేవలం 360 మంది మాత్రమే విధుల్లో చేరారు. చేరిన వాళ్ళలో కూడా డ్రైవర్లు, కండక్టర్లు లేనేలేరు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్నివర్గాల ప్రజలు అండగా ఉన్నారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. చూస్తూ ఊరుకోలేక రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడ్డాయి. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే... కార్మికుల శవాలపైన మాత్రమే ప్రైవేట్ బస్సులు వెళ్ళాలి. ప్రైవేట్ బస్సులను నడిపితే ఎక్కడికక్కడ కార్మికులు అడ్డుకుంటారు. అవసరమైతే తగులబెడతారు. పక్క రాష్ట్రంలో ప్రభుత్వపరం చేసి చూపించారు. ఇక్కడెందుకు సాధ్యం కాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలి’అని అన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు సమ్మెను ఉధృతం చేయడంతో బస్ డిపోల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు పాట్లు తప్పడం లేదు. -
ప్రైవేట్ బస్సులు నడిస్తే కార్మికుల శవాలపైనే..
సాక్షి, హన్మకొండ: రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతునన ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్ బస్సులకు అనుమతిస్తే అవి కార్మికుల శవాలపై వెళ్లాల్సి ఉంటుం దని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారా యణ హెచ్చరించారు. ప్రైవేట్ బస్సులను నడపలేరని, అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులను హన్మకొండ డిపో, హన్మకొండ జిల్లా బస్ స్టేషన్ వద్ద సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి మంగళవారం కలిసి సం ఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రా వుకు సమ్మెపై అవగాహన లేకపోవడంతోనే కార్మికులే వచ్చి విధుల్లో చేరాలని మాట్లాడుతున్నారని చెప్పారు. పెళ్లి చూపులు లేకుండా, రెం డు కుటుంబాలు చర్చించుకోకుండా పెళ్లి ఎలా జరుగుతుందని వ్యాఖ్యానించారు. కార్మిక వివా దాల చట్టం ప్రకారం నోటీసు ఇచ్చిన తర్వాత కార్మిక శాఖ అధికారులు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. సీఎం కేసీఆర్ మందలించడంతో వారు వెనుకడుగు వేశారన్నారు. సమ్మెను ‘ఇల్లీగల్’ అని ప్రకటించడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని చెప్పారు. యాజమాన్యం చర్చలు జరపకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తే కేసు పెట్టాల్సి ఉం టుందని.. ఆర్టీసీకి ఎండీ లేనందున కేసు సీఎం పైనే పెట్టాల్సి వస్తుందన్నారు. సీఎం నిజాం నవాబులా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విచ్ఛిన్నానికి కుట్ర సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెను పోలీసులతో విచ్ఛిన్నం చేయాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. అయితే, పోలీసులు సీఎం కేసీఆర్ ఉచ్చులో పడొద్దని సూచించారు. బుధ వారం నుంచి ఒక్క బస్సు బయటకు రానివ్వద్దని, సీపీఐ కార్యకర్తలు బస్ డిపోల ముందు కూర్చోవాలని పిలుపునిచ్చారు. 31 శాతం కలిగి ఉన్న కేంద్రం ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని డిమాండ్ చేశారు. లేక పోతే బీజేపీకి పుట్టగతులుండవని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్‌రావు, జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా ఇన్చార్జి కార్యదర్శి జి.ప్రభాకర్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ కన్వీ నర్ గంభీర్ రెడ్డి, కోకన్వీనర్లు ఎం.శ్రీనివాస్, రాజయ్య, యాదయ్య, నాయకులు ఈఎస్. బా బు, ఎస్కేవై.పాషా, ఎస్ఆర్ కుమార్, జీ.ఆర్. స్వామి, ఎల్లయ్య, సజ్జన్ నాయక్ పాల్గొన్నారు. మిన్నంటిన నిరసనలు ఆర్టీసీ కార్మికుల సమ్మె యథాతథంగా కొనసాగుతోంది. కార్మికులు అదే పట్టుదలతో దూసుకుపోతున్నారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ విధించినా కార్మికుల్లో పట్టు సడలలేదు. మంగళవారం వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల వద్ద ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. హన్మకొండలోని వరంగల్–1, 2, హన్మకొండ డిపో వద్ద ధర్నాతో పాటు వంటావార్పు నిర్వహించారు. సీఎం కేసీఆర్ డెడ్‌లైన్‌ను కార్మికులు పెద్దగా పట్టించుకోలేదు. చర్చలకు పిలువకుండా వెన క్కి తగ్గేదిలేదని తమకు తాముగా విధుల్లో చేరేది లేదని భీష్మించుకూర్చున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో పాటు సీపీఐ, సీపీఎం నాయకులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆర్టీసీ జేఏసీ, కార్మిక సంఘాల నాయకులు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్, శోభన్‌బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఏం జరుగుతుందో? హన్మకొండ బస్‌స్టేషన్‌లో మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసుల పహారా ఆర్టీసీ డిపోల వద్ద ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి వరకు డెడ్ లైన్ విధించింది. దీంతో టీఎస్ ఆర్టీసీ డిపోల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్మికులు విధుల్లో చేరేందుకు వస్తే యూని యన్ నాయకులు అడ్డుకోకుండా ఈ బందోబస్తు ఏర్పాటుచేసినట్లు సమాచారం. ఇక కార్మికులు ఎవరైనా విధుల్లో చేరడానికి వస్తే సహచర కార్మికులు కాపుకాసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇలా రెండు వర్గాల మొహరించడంతో డిపోలో వద్ద ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. కాగా, విధుల్లో చేరిన వారికి వెంటనే డ్యూటీలు ఇవ్వకుండా ఈ నెల 7వ తేదీ తర్వాత రావాలని అధికారులు చెబుతున్నారని కార్మిక వర్గాలు వెల్లడించాయి. కేవలం కార్మికులు స్వ చ్ఛందంగా విధుల్లో చేరారని, సమ్మె ప్రభావం లేదని చెప్పడానికి ప్రభుత్వం వేసిన ఎత్తుగడలో ఇది భాగమేనని కార్మికవర్గాలు తెలిపాయి. కా గా, ఇప్పటి వరకు వరంగల్ రీజియన్‌లో 4,017 మంది ఉద్యోగులకుగాను 22 మంది రిపోర్టు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వినూత్న నిరసన సమ్మెలో భాగంగా మహిళా కార్మికులు వినూత్న నిరసన తెలిపారు. విధుల్లో చేరేందుకు సీఎం ఇచ్చిన డెడ్‌లైన్‌తో తమకు భయం లేదని.. ఉద్యోగాలు పోయినా చాయ్ అమ్ముకోనైనా బతుకుతామని చాటి చెబుతూ టీ అమ్మారు. హన్మకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు వంట వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు అంజనీదేవి, సుమతి చాయ్ అమ్మి నిరసన తెలిపారు. అదే సమయంలో వచ్చిన నాయకులు కె.నారాయణ, చాడా వెంకట్ రెడ్డి సైతం టీ తాగారు. -
ప్రైవేట్ బస్సులు నడిపితే తగులబెడతాం
హన్మకొండ: ‘నీ ఫాంహౌజ్, ఇల్లు అమ్ముకో.. అంతే తప్ప ఆర్టీసీ నీ సొంత ఆస్తి కాదు.. అందులో కేంద్ర వాటా ఉంది. 31 శాతం కేంద్రం వాటా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటే ఊరుకుంటారా.? అని సీఎం కేసీఆర్‌కు సీపీఐ నేత కె.నారాయణ హెచ్చరించారు. కార్మికులకు విధుల్లో చేరడానికి నిర్దేశించిన సమయం కార్మికులకు డెడ్ లైన్ కాదు,. అది సీఎం కేసీఆర్‌కేనని ఉద్ఘాటించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రైవేట్ బస్సులు నడపలేరని, నడిపితే తగుల బెడుతామని నారాయణ హెచ్చరించారు. మంగళవారం హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలసి నారాయణ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంలో ఇంటి కొడుకు కంటే ఇంటి అల్లుడి పెత్తనం ఎక్కువైందని నారాయణ దుయ్యబట్టారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌ని పువ్వాడ అజయ్ అని పిలవలేకపోతున్నామని, పువ్వాడ అంటే సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు గుర్తుకువస్తారని నారాయణ అన్నారు. అలాంటి వంశంలో పువ్వాడ అజయ్ చెడ పుట్టారని విమర్శించారు. -
‘మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదు’
సాక్షి, వరంగల్ : ఆర్టీసీలో కేంద్రం వాటా 31శాతం ఉందని, కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ఊరుకుంటుందా అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు మంగళవారం సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. బలిదానాలు లేని తెలంగాణ కోరుకుంటే కేసీఆర్ ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల చెంపపై కొడితే.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిషా.. కేసీఆర్ చెంపపై కొడతారని ఎద్దేవా చేశారు. మోడీ, అమిత్ షా.. కేసీఆర్ మెడలు వంచుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను తొలగించి ప్రేవేటుపరం చేసి బస్సులు నడిపితే తమ శవాలపై చక్రాలు వెళ్లాలన్నారు. ప్రభుత్వం ఎన్ని డెడ్లైన్లు పెట్టినా కార్మికులు పట్టుదలతో ఉండాలని సూచించారు. అలాగే టీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి ఆర్టీసీ కార్మికులపై అవాకులు, చవాకులు పలుకుతున్నారని మండిపడ్డారు. అసలైన తెలంగాణ వాదులైన ఈటెల రాజేందర్, కేటీఆర్, హరీశ్‌రావు కార్మికులపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదని నిలదీశారు. మంత్రి పదవి పోగానే ఎర్ర బస్సు ఎక్కక తప్పదని ప్రతి ఒక్కరూ గర్తుంచుకోవాలని సూచించారు. ఈ కుటుంబంలోనే పుట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన తండ్రి వారసత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చరిత్రలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నిలిచిపోతుందని, కార్మిక వర్గం విజయం సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం కానే కాదని, దేశ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులకు అన్ని సంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు. -
సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తోంది
గన్‌ఫౌండ్రీ: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌం డ్స్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకుని త్యాగాలు చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తుచేశారు. భూమి, భుక్తి, బానిస సంకెళ్ల విముక్తి కోసం నాడు నిజాం ప్రభుత్వంతో ఈ పోరాటం జరిగిందని, అయితే దీనిని ముస్లింలపై జరిగిన పోరాటంగా బీజేపీ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ పోరాటా నికి ముస్లింల మద్దతు ఉందన్న చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమం లో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం మఖ్దూం భవన్లో చాడ వెంకట్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
‘వాస్తవాలకతీతంగా ఎగ్జిట్ ఫలితాలు’
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలను ప్రతిబింబించేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు లేవని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంటే, ఏ అంశాల ఆధారంగా బీజేపీకి 300 సీట్లు దాటుతాయని చెబుతున్నారో అర్థం కావడం లేదన్నా రు. మంగళవారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగాలన్నా, అధికార పార్టీలోకి ఫిరాయింపులు నిలిచిపోవాలన్నా దామాషా పద్ధతి ఎన్నికల విధానాన్ని అనుసరిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు ఉంటాయన్నారు. -
రాహుల్‌కు గుండుకొట్టి పంపుతాం: నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ అజ్ఞానంతోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీచేస్తున్నారని, అక్కడ ఆయనకు గుండుకొట్టి పంపడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులను ఏకం చేయా ల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. -
ప్రభుత్వ డేటా ప్రైవేటు సంస్థలకు ఎలా చేరింది?
సాక్షి, అమరావతి: ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం చేస్తారా? అని వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈమేరకు సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, పి.మధు సోమవారం వేర్వేరు ప్రకటనలు చేశారు. గత నెల 28న ఒక్కరోజే 1.9 లక్షల ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు అందినట్లు ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటన దిగ్భ్రాంతి కలిగిస్తోందని, ఈ వ్యవహారం వెనుక ఎవరి హస్తం ఉందో కనిపెట్టాలని డిమాండ్ చేశారు. ఓటర్లు ఉన్నప్పటికీ వారికి తెలియకుండా ఆన్లైన్ పద్ధతిలో వేలాది సంఖ్యలో సామూహికంగా ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం కొంతమంది వ్యక్తులు ఫారం–7ను దరఖాస్తు చేస్తున్నారంటే ఎన్నికల కమిషన్ ఏమి చేస్తున్నట్టు? అని నిలదీశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని నిర్వహిస్తున్న ప్రధాన వెండర్‌ను ప్రశ్నిస్తే అసలు విషయం బయటికొస్తుందని పేర్కొన్నాయి. దర్యాప్తు చేసి నిందితులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వానికి వామపక్షాలు విజ్ఞప్తి చేశాయి. నకిలీ దరఖాస్తులతో ఓట్ల తొలగింపు ఎలా సాధ్యమో ఎన్నికల కమిషన్ వివరణ ఇవ్వాలని వామపక్ష నేతలు కోరారు. -
నయీం ఎన్కౌంటర్, అక్రమాలపై వ్యాజ్యాల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన ప్రత్యేక పరిస్థితులు ఏమున్నాయో పిటిషనర్లు వివరించలేకపోవడంతో ఈ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కి చెందిన మండవ శ్రీనివాస్ 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. నయీం అరాచకాలకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం వాటిని మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుందని తెలిపింది. -
కలుషిత రాజకీయాలు ప్రమాదకరం
హైదరాబాద్: నేటితరం రాజకీయ నాయకుల ప్రసంగాలు, విమర్శలు, వ్యవహార శైలితో రాజకీయాలు కలుషితమైపోయాయని, ఇది దేశానికి ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి గొప్ప నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని, ఒకరికి గౌరవం ఇచ్చి మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి అని కొని యాడారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి సంతాప సభను ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నారాయణతో పాటు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్న కేశవరావు, సభ్యురాలు డాక్టర్ రజనీ, సీపీఐ శేరిలింగంపల్లి కార్యదర్శి కె.శ్రీశైలంగౌడ్‌తో పాటు పలువురు శివరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ చట్ట సభకు ఎన్నికైన తొలితరం ప్రజా ప్రతినిధుల్లో ఒకరైన శివరామిరెడ్డి నిస్వార్థ సేవలం దించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. తాను మరణించే వరకు సీఆర్ ఫౌండేషన్‌కు, వృద్ధాశ్రమంలో ఉంటూ సేవలందించారన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ శివరామిరెడ్డి రైతాంగ సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. నేటితరం నాయకులందరికీ ఆదర్శ ప్రాయులని, ఉన్నత భావాలున్న గొప్ప వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించి పార్టీ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసుకోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ రా>ష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ శివరామిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల సాధనకు ఉద్య మాలు నిర్మించాల్సి ఉందన్నారు. సంతాప సభలో శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు, సీఆర్ ఫౌండేషన్, వృద్ధాశ్రమం సహచరులు పాల్గొన్నారు. -
భయంతోనే ఆలోక్‌వర్మ బదిలీ: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ కొనసాగితే రఫేల్ కుంభకోణం మొత్తం బయటపడుతుందనే ఆందోళనతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అగ్నిమాపక శాఖకు మార్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రధాని స్థాయిలోనే చట్టా ల ధిక్కరణ జరిగితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. సీబీఐపై ఇలాంటి ప్రత్యక్షచర్య 55 ఏళ్లలో ఎప్పు డూ జరగలేదన్నారు. ఆలోక్‌వర్మను సీబీఐ డైర్టెకర్‌గా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శాలు తట్టుకోలేక ప్రధాని నిరాశ, నిస్పృహలతో అత్యున్నతస్థాయి కమిటీ పేరుతో వర్మను ఫైర్ సర్వీస్‌కు బదిలీచేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని వెక్కిరించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మతపరంగా విభజిం చే కుట్ర చేస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. అస్సాం పౌరసత్వం బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. -
సిట్ చంద్రబాబు తొత్తు : సీపీఐ నారాయణ
సాక్షి, విశాఖపట్నం : సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం) బృందంపై తనకు నమ్మకం లేదని, సిట్ అనే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తొత్తులుగా మారిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్ చేసినా, లేక కలిసి పరామర్శించి.. హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కానీ అధికార పార్టీ నాయకులు కోడి కత్తి అని అవహేళన చేయటం విడ్డూరమన్నారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో ఎయిర్‌పోర్టు సిబ్బంది అత్యుత్సాహం చూపించారని మండిపడ్డారు. హత్యాయత్నం జరిగిన కొన్ని గంటలకే డీజీపీ రాజకీయ నాయకుల మాదిరిగా వ్యవహరించి విలేకరుల సమావేశం పెట్టడం హాస్యాస్పదమన్నారు. డిసెంబర్ 11 తరువాత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయి, ఫార్మ్‌హౌస్‌లో క్యాప్సికం అమ్ముకుంటాడని ఎద్దేవా చేశారు. -
‘ఓడిపోతున్నట్టు కేసీఆర్ అంగీకరించారు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఓడిపోతున్నట్టు అంగీకరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో పడుకుంటామని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. అలా అయితే ఫలితాల వరకూ ఎదురుచూడటం ఎందుకని, ఇప్పుడే రాజకీయాలకు సెలవు చెప్పి ఇంట్లోనే పడుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఆయన నోటి నుంచి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన రోజే ఆయన రాజకీయ జీవితం అయిపోయిందని నారాయణ పేర్కొన్నారు. మేడ్చల్ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో మహాకూటమి నేతలు వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సోనియా పర్యటనతో కేసీఆర్ భయాందోళనకు గురువుతున్నారని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదని, అలాంటి జనాలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని పేర్కొన్నారు. -
‘నేను చెవి కోసుకుంటా.. కేసీఆర్ మెడ నరుక్కుంటారా’?
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు దళితున్ని సీఎం చేస్తే చెవి కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సవాల్ విసిరారు. అలా చేయకపోతే కేసీఆర్ మెడ నరుక్కుంటారా అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఓడించేందుకు అన్ని రాజకీయ శక్తులు ఏకం కావాలని కోరారు. గడువుకు ముందే అసెంబ్లీని రద్దు చేయటం అంటే ప్రజలను అవమానించటమేనని అన్నారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరిపి అసెంబ్లీని రద్దు చేశామనటం ఎంతవరకు కరెక్టని, ఎన్నికల కమిషన్ కంటే ముందే ఎన్నికల ప్రక్రియ ప్రకటించటంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ దీనికి జవాబు చెప్పాలన్నారు. -
మోదీకి ఊడిగం చేస్తున్న కేసీఆర్: నారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ ఊడిగం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణపై మోదీకి ఎంత వ్యతిరేకత ఉందో ఇప్పటికీ కేసీఆర్‌కు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణపై ఇంతగా విషం చిమ్ముతున్నా టీఆర్ఎస్ నేతలు ఎందుకు బీజేపీకి పార్లమెంటులో మద్దతుగా వ్యవహరించారో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణకు ప్రత్యేకహోదా కావాలని హైదరాబాద్‌లో మాట్లాడుతున్న టీఆర్ఎస్ నేతలు, లోక్‌సభలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నయీం కేసుపై కేసీఆర్, విశాఖ భూములపై ఏపీ సీఎం చంద్రబాబు సిట్లు వేసినా ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నదని నారాయణ అన్నారు. మోదీ ముకేశ్ అంబానీతో వ్యవహరిస్తున్న తీరు ప్రధానమంత్రి హోదాను దిగజారుస్తున్నాయని నారాయణ చెప్పారు. కార్పొరేట్లతో బహిరంగంగా సమావేశం అవుతానని మోదీ చెప్పడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు ఓల్డ్‌సిటీకి ఎందుకు వెళ్లడంలేదని అడిగారు. మెట్రో ఆపడానికి కొన్ని సంస్థలు విదేశీసంస్థల నిధులు తీసుకుంటున్నాయని మెట్రో ఎండీ ఎన్.వి.ఎస్ రెడ్డి ఆరోపించడం తీవ్రంగా పరిగణించాలని నారాయణ కోరారు. జాతీయ బాధ్యతల నిర్వహణకోసం తాను ఢిల్లీకి కుటుంబంతో సహా మారుతున్నట్టుగా వెల్లడించారు. -
అవి కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలే
చెన్నై: తూత్తుకూడి ఘటన కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు(శుక్రవారం) తమిళనాడు బంద్‌కు వామపక్షాలు మద్ధతు ఉంటుందని వ్యాఖ్యానించారు.కేంద్రమే దీనికి బాధ్యత వహించాలని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పతనానికి కర్ణాటక తొలిమెట్టు అవుతుందన్నారు. గవర్నర్ల వ్యవస్థ పనికి మాలిందని అన్నారు. కేంద్రానికి, రాష్ట్రాల నడుమ గవర్నర్లు బ్రోకర్లుగా పనిచేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. టీటీడీ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వస్తోన్న ఆరోపణలు ఆయనే నిరూపించుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం, టీటీడీని కూడా తమ ఆధీనంలోనికి తీసుకునేలా కనపడుతోందని వ్యాఖ్యానించారు. -
బోటింగ్ రంగంలోనూ మాఫియా..
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జరుగుతున్న బోటు ప్రమాదాలు విచారకరం...వీటిని అరికట్టడంలో ప్రభుత్వం వైపల్యం చెందిందని...బోటింగ్ రంగంలో కూడా మాఫియా ఉందని సీపీఐ కేంద్ర కమిటీ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఈ ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి విచారణ జరిపించాలని, అంతేకాక బాధిత కుంటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు. ఈ సందర్భంగా నారాయణ బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న బోటు ప్రమదాలు, అత్యాచార సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచారాల పోటీ పెడితే ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో నిలుస్తుందన్నారు. అత్యాచారాల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం జీవోలు జారీ చేస్తుంది...కానీ జమ్ము కాశ్మీర్లో జరిగిన ‘కథువా అత్యాచార’ ఘటనలో స్వయంగా ఆ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రే నిందితుడుగా ఉన్నాడని తెలిపారు. బీజేపీ కర్ణాటకలో గెలిచిన తర్వాత ఇక తమకు దక్షిణాదిలో కూడా తిరుగులేదని భావిస్తుందని, కానీ కర్ణాటకలో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని విమర్శించారు. అంతేకాక కర్ణాటక గవర్నర్ ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయించకుండా వాయిదా వేయడం విచారకరమని, గవర్నర్లు పాలకపక్షానికి మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నరని అన్నారు. వెంటనే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని తెల్లగా మార్చుకోవడం కోసమే బీజేపీ నోట్ల రద్దును తీసుకువచ్చిందని, కేంద్రం ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడ్డానికి సీపీఐ పార్టీ సిద్దమవుతుందని తెలిపారు. ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్రం 75 శాతం విభజన హమీలను నెరవేర్చిందన్న కన్నా లక్ష్మీనారాయణ వాఖ్యలను ఖండిస్తూ, అధ్యక్షుడు కాకముందే ఇన్ని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, ఇక ఇప్పుడు అధ్యక్షడు అయ్యారు...ఇంకా ఎన్ని అబద్దాలు ప్రచారం చేస్తారో అని విమర్శించారు. కన్నా ప్రచారం చేసే అసత్యాలు చూసే బీజేపీ పార్టీ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటుందన్నారు. కాగా ప్రముఖ సీపీఐ నాయకుడు చండ్ర రాజేశ్వర్‌రావు భవన నిర్మాణానికి గాను అమరావతిలో 3 ఎకరాల భూమిని కేటాయించినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడుకు నారాయణ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
సదావర్తి భూములను పరిశీలించిన నారాయణ
చెన్నై: తమిళనాడులోని నావలూరు,తాళంబూరులోని సదావర్తి భూములను సీపీఐ నేత నారాయణ శుక్రవారం పరిశీలించారు. తిరుపోరూరు తహసీల్దారు వద్ద భూముల విలువను అడిగి తెలుసుకున్నారు. సదావర్తి భూములు ఎకరానికి 4 కోట్ల 67లక్షలు ధర పలుకుతాయని తహసీల్దారు ఆయనకు వివరించారు. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తమ పార్టీకి చెందిన వారికే తక్కువ ధరకు కట్టబెట్టే ప్రయత్నం చేసిందని నారాయణ ఆరోపించారు. ప్రభుత్వమే ఆ భూములను స్వాధీనం చేసుకుని తెలుగు వారి కోసం వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
పోరాడుదాం..సాధిద్దాం
► సీఎం గెడ్డం ఊడేలా దీక్షలు చేయాలి ► ముగ్గురు మూర్ఖులు వంతెనను అడ్డుకుంటున్నారు ► అవసరమైతే అమరావతికి పాదయాత్ర చేద్దాం ► దీక్షాధారులకు భరోసా ఇచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ► వాల్తేరు బలసలరేవు వంతెన దీక్షలకు మద్దతు రాజాం/సంతకవిటి: వాల్తేరు బలసలరేవు వంతెనను పోరాట మార్గం ద్వారానే సాధించుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు సాధారణంగా ఏ ప్రజా పోరాటాన్నీ పట్టించుకోరని, ఆయన గెడ్డం ఊడేలా దీక్షలు, పోరాటాలు చేస్తే మేల్కొంటారని అ న్నారు. ఆయన ఆదివారం సంతకవిటి మండలంలోని వా ల్తేరు గ్రామంలో బలసలరేవు వంతెన నిర్మాణం కోసం స్థానికులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతుగా శిబిరంలో కూర్చున్నారు. ముందుగా బలసలరేవు వద్దకు చేరుకుని వంతెన నిర్మించాల్సిన నాగావళి నదీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడుతూ పోరాటాలకు పురిటి గడ్డ శ్రీకాకుళం అని అన్నారు. గత 113 రోజులుగా వంతెన నిర్మాణం కోసం దీక్ష చేయడం హర్షించదగిన విషయమని అన్నారు. ఇంత పోరాట దీక్ష ఉన్న ఈ ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టడం పెద్ద పని కాదని, ఈ ప్రాంత ప్రజలంతా ఐక్యంగా వ్యవహరించి వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్న ముగ్గురు మూర్ఖులకు బుద్ధి చెప్పాలని వ్యాఖ్యానించారు. ఎందుకు అడ్డుకుంటున్నారు? వంతెన నిర్మాణానికి ఆవలి వైపున ఉన్న ఓ శాసన సభ్యుడు, వంతెన నిర్మించాలి్సన ప్రాంతానికి కూతవేటులో ఈ గ్రామం పక్కనే ఉన్న అధికార పార్టీకి చెందిన మాజీ స్పీకర్‌తో పాటు మరో నేత వంతెన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ముందుగా వీరు వంతెన నిర్మాణం ఎందుకు అడ్డుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రజలను కోరారు. అధికారంలో ఉన్న సమయంలో వంతెన నిర్మించకుంటే మరెప్పుడూ ఈ నిర్మాణాలు జరుగవని అన్నారు. వంతెన నిర్మాణాలను అడ్డుకుంటున్న ఈ ముగ్గురు నేతలను ఊళ్లోకి రానివ్వకుండా బుద్ధి చెప్పాలని, వీరు భయపడి చంద్రబాబునాయుడు వద్ద తమ గోడు వెళ్లబోసుకునేలా చేయాలని సూచించారు. అపరాధ రుసుం చాలు..! ప్రపంచం చెప్పుకునేలా అమరావతి నిర్మిస్తామని పేర్కొంటున్న చంద్రబాబు ఈ వంతెన నిర్మాణానికి ఎందుకు చొరవ చూపడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఒక ఇసుక మాఫియాను ఒక రోజు అడ్డుకుంటే ఆ వచ్చే అపరాధ రుసుంతో వంతెన కట్టేయవచ్చని అన్నారు. విశాఖపట్నంలో పెద్ద ఎత్తులో భూదందాలు జరుగుతున్నాయని, ఆ భూదందాలను ఒక్క రోజు ఆపితే ఎన్నో వంతెనలు కట్టేయవచ్చునని అన్నారు. వంతెన దీక్షకు దిగిన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వంతెన రిలే దీక్షలు ఆపరాదని కోరారు. అవసరమైతే అమరావతి వరకూ పాదయాత్ర చేద్దామని పిలుపునిచ్చారు. వంతెన కోసం మనం చావడం కాదని, ‘అధికారులు, పాలకులు చస్తారా.. వంతెన నిర్మిస్తారా’ అన్న రీతిలో దీక్షలు ఉండాలని పేర్కొన్నారు. వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతంలో రహదారి సౌలభ్యం ఉంటుందని, రహదారి బాగుంటే సంస్కృతిలో మార్పు వస్తుందని అన్నారు. అందరం ఒక్కటై.. ఈ సమావేశంలో మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు విమలకుమారి మాట్లాడుతూ అరెస్టులకైనా సిద్ధంగా ఉండి వంతెన నిర్మాణాన్ని సాధించాలని పిలుపునిచ్చారు. అమరావతిలో అందరం ఒక్కటిగా గొంతెత్తుదామని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ వంతెన నిర్మాణాన్ని పక్కనే ఉన్న అధికార పార్టీ నేత అడ్డుకుంటున్నారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇక్కడ వంతెనకు మట్టి పనికిరాదని చెప్పుకొస్తున్నారని, 1999లో ఎలా జీఓ విడుదల చేసి, నిధులు కేటాయించారని ప్రశ్నించారు. సీపీఐ జిల్లా నేత చాపర సుందరలాల్ మాట్లాడుతూ పలుమార్లు ర్యాలీలు, దీక్షలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. అప్పలఅగ్రహారం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి దవళ నర్సింహమూర్తి మాట్లాడుతూ గత 113 రోజులుగా వంతెన దీక్షలు చేపడుతుంటే అధికార పార్టీ నేతలకు పట్టకపోవడం శోచనీయమని అన్నారు. రాజాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు నెలరోజుల కిందట అసెంబ్లీలో ఈ సమస్యను ప్రస్తావిస్తే ఆ కోణంలో కూడా ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమస్యను విన్నవిస్తే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. అధికార పార్టీ దిగొచ్చే వరకూ వాల్తేరు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు ఈ పోరాటంలో వెనక్కు తగ్గకుండా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో వంతెన సాధన కమిటీ కన్వీనర్ గురుగుబెల్లి నారాయణస్వామి, కో కన్వీనర్ గుడ్ల అప్పారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గురుగుబెల్లి స్వామినాయుడు, వాల్తేరు, జీఎన్‌పురం, పనసపేట, జానకీపురం, శేషాద్రిపురం, అప్పలఅగ్రహారం, బూరాడపేట, కావలి తదితర గ్రామాలుకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. -
కేంద్రం నేరగాళ్ళను ఆదుకుంటోంది
రైతులను దేశద్రోహులుగా బావిస్తున్న మోదీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మదనపల్లె : దేశంలో ఆర్థిక నేరగాళ్ళను ఆదుకొంటూ, దేశానికి వెన్నెముక లాంటి రైతన్నలను కేంద్రం దేశ ద్రోహులుగా చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఆర్థిక, సాంఘిక సంక్షోభాన్ని సృష్టిస్తూ ఆర్థిక నేరగాళ్ళకు ప్రోత్సాహానివ్వడం విడ్డూరంగా వుందన్నారు. రూ.9 వేల కోట్లు ప్రభుత్వానికి ఎగ్గొట్టిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను కేంద్రం పట్టించుకోకపోవడమే నిదర్శనమన్నారు. కేవలం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తూ అమెరికన్ రంగ సంస్థలకు పెట్టుబడులు పెడుతూ సామాన్య ప్రజానీక సమస్యలను పట్టించుకోకపోవడం దారణమైన విషయమన్నారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వదేశీ సంస్థలను పూర్తిగా నీరుగారుస్తున్నాయన్నారు. ఆర్థిక నేరగాళ్ళను ముద్దుబిడ్డలుగా చూస్తున్న ప్రభుత్వాలకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అంతేకాకుండా కొన్ని పార్టీలను రెచ్చగొడుతూ మోదీ వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఎగుమతులు అధికంగా వున్న భారతదేశాన్ని అభివృద్ది పర్చడంలో నిర్లక్ష్యం చూపుతున్నారన్నారు. ఇటీవల గోవధ నిషేధంపై కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నిజంగా దేశంలో గో నిషేధం అమలు చేస్తే పశువులకు కూడా ఓల్డేజ్ హోంలు ఏమైనా పెడతారా..? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. గోవధ నిషేధం పేరుతో హందూత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం మోదీకి తగదన్నారు. ఈసమావేశంలో సీపీఐ ఏరియాకార్యదర్శి క్రిష్ణప్ప, పట్టణ కార్యదర్శి సాంబశివలు పాల్గొన్నారు. -
రైతులకు బేడీలు వేసినా ప్రశ్నించొద్దా?
► ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు– మూడేళ్ల పాలన’పై చర్చాగోష్టి ► ప్రభుత్వాన్ని నిలదీసిన వక్తలు సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేసినా ఎవరూ ప్రశ్నించకూడదా అని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు–మూడేళ్ల పాలన’ అంశంపై వాయిస్ ఫౌండేషన్ శనివారం చర్చాగోష్టిని నిర్వహించింది. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ గోష్టిలో టీజేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి, టీడీపీనేతలు ఎ.ఉమా మాధవరెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, కత్తి వెంకటస్వామి, విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, దరువు ఎల్లయ్య తదితరులు ప్రసంగించారు. అప్రజాస్వామికంగా పాలన: రామచందర్‌రావు రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుసున్నది. అప్పులతో ప్రజలపై శాశ్వతంగా పెనుభారాన్ని మోపుతున్నారు. సీఎం కేసీఆర్ పాలనావైఫల్యాల గురించి మాట్లాడితే కేంద్రంపై నెడుతున్నారు. ప్రజల గొంతు నొక్కొద్దు: దినేష్‌రెడ్డి ఉద్యమాలతో సాధించిన తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు ఇప్పుడెందుకు అదే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించడంలేదు? ఇందిరాపార్కువద్ద ధర్నాలు ప్రజల హక్కు. దానిని హైదరాబాద్ బయటకు పం పించాలనే నిర్ణయం ప్రజల గొంతును నొక్కడమే. కేసీఆర్ కుటుంబంకోసమేనా: దిలీప్‌కుమార్ రాష్ట్రం కేవలం కేసీఆర్ కుటుంబంకోసమే అన్నట్టుగా ఉంది. ప్రజాస్వామిక పరిపాలన, మంత్రులకు అధికారం, ప్రజా సమస్యల పరిష్కారం వంటివేమీ లేవు. ధనిక రాష్ట్రంలో అభివృద్ధి ఏమీలేకపోగా మూడేళ్లు కాకముందే అప్పులు రెట్టింపు చేశారు. రాష్ట్రాన్ని పోలీసురాజ్యంగా మార్చారు. ప్రజల గొంత నొక్కలేరు: ఉమామాధవరెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడం లేదు. ఒక్క ఎర్రవల్లిలో కడితే రాష్ట్రమంతా పూర్తిచేసినట్టా? ధర్నాచౌక్‌ను తీసేసి ప్రజల గొంతును నొక్కాల నుకుంటే సాధ్యంకాదు. రాచరిక పాలన వస్తదనుకోలేదు: అద్దంకి దయాకర్ తెలంగాణ వస్తే ప్రశ్నించే సత్తాను కోల్పోతామను కోలేదు. ఇలాంటి రాచరిక పాలన వస్తుందనుకో లేదు. సీఎం కేసీఆర్ పక్కన దొంగలను పెట్టుకుని రైతులకు బేడీలు వేస్తారా? ఆందోళనతోనే పరిష్కారం: రామయ్య ప్రజల ఆందోళనలు లేకుండా సమస్యలు పరి ష్కారం అవుతాయని నేను అనుకోవడంలేదు. నేను ఏ రాజకీయపార్టీకి చెందినవాడిని కాదు. ధర్నాచౌక్ విషయంలో ప్రభుత్వమే ప్రజాస్వామికంగా వ్యవ హరించాలి. ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలేదు: కోదండరాం వలసాంధ్రంపాలన పోయి తెలంగాణ పాలన వస్తే అభివృద్ధి జరుగుతుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయని అనుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో కుల మత వర్గ రహితంగా జరిగిన ఐక్య పోరాటాల స్ఫూర్తిగా నీళ్లు, నియామకాలు వస్తాయనుకున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ డిమాండ్లను గుర్తించడం లేదు. అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేసినా ఇతరులు ప్రశ్నించొద్దు అనే అప్రజాస్వామిక ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇంకా పదిసార్లు మా ఇంటి తలుపులు బద్దలు కొట్టినా ప్రజాస్వామిక నిర్మాణంలో ముందుంటా. రేవంత్‌ను చూస్తే కేసీఆర్ ప్యాంటు తడిసిపోతోంది: కె.నారాయణ తెలంగాణకు ముఖ్యమంత్రిగా పనికిమాలినవాడైన కె.చంద్రశేఖర్‌రావు కావడం ప్రజల దురదృష్టం. టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ మంత్రి వర్గంలో చేర్చుకున్న దివాళాకోరు. ముక్కు మూరెడు ఉన్నా, మనిషి బారెడున్నా సీఎం కేసీఆర్‌కు లోపల భయం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని చూస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకో ప్యాంటు తడుస్తున్నది. -
రెండు తెలుగు రాష్ట్రాల్లో డెకాయిట్ల పాలన
విజయవాడ : రెండు తెలుగు రాష్ట్రాలోనూ ప్రజలను దోచుకుతినే డెకాయిట్ల పాలన కొనసాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ విమర్శించారు. రైతుల నుంచి ఎండుమిర్చిని క్వింటా రూ.2500 చొప్పున కొంటున్న కార్పొరేట్ సంస్థలు తమ స్టోర్స్‌లో క్వింటాను రూ.34 వేలకు విక్రయిస్తున్నా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. దీన్ని డెకాయిట్ల పాలన కాకపోతే ఏమంటారని ప్రశ్నించారు. విజయవాడ నిమ్మతోట సెంటర్లో ఉన్న ఒక ప్రముఖ స్టోర్ (రిలయన్స్)ను శుక్రవారం సాయంత్రం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారాయణ పరిశీలించారు. స్టోర్‌లో విక్రయిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలను స్టోర్ యజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. నిత్యావసరవస్తువుల ధరల నియంత్రణలో రెండు తెలుగు రాష్ట్రాల పాలకులు ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. కొంత మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, మరికొంత మంది రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటలను తగులబెడుతున్నారని, ఈ నేపథ్యంలో వారి బాధ, కడుపు మంట గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని హితవుపలికారు. మిర్చి, పసుపు, కందులు, టమాటా సాగుచేసిన రైతుల పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయన్నారు. క్వింటా మిర్చిని రూ.5వేలకు కొనుగోలు చేస్తున్నామని తెలంగాణ మంత్రి హరీష్‌రావు గొప్పలు చెప్పుకుంటున్నారని, కార్పొరేట్ సంస్థల్లో క్వింటా మిర్చిని రూ.34 వేలకు విక్రయిస్తున్నారని, దీనిని చూసి సిగ్గు పడాలని హితవుచెప్పారు. క్వింటా మిర్చిని రూ.5 వేలకు కేంద్రం కొనుగోలు చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీసాలు మెలేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నా, క్వింటా మిర్చి ఉత్పత్తికి ఎంత వ్యయం అవుతుందో రైతు బిడ్డ అయిన ఆయనకు తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ, టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకు రైతుల గురించి మాట్లాడే హక్కులేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు ఐక్యంగా ఆందోళనలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
‘కేసీఆర్ ప్రజల హక్కులను కాలరాస్తున్నారు’
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజల కనీస హక్కులను సీఎం కేసీఆర్ కాలరాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిరసనలను నిషేధించారని తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీన టీజేఏసీ ఛైర్మన్ కోదండరాం తదితరులు ఇందిరాపార్కు వద్ద ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరుద్యోగ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందరినీ అరెస్టు చేసి ఆందోళనను భగ్నం చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో టీజేఏసీ కీలకభూమిక పోషించిందని వివరించారు. ఇందిరాపార్కు వద్ద వివిధ దశల్లో చేపట్టిన ఆందోళన కారణంగానే రాష్ట్ర సాధన సాధ్యమైందని, అనంతరం ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఇప్పుడు నిరసనలను సహించలేకపోతున్నారని చెప్పారు.రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించటానికి ముఖ్యమంత్రి ఎటువంటి చర్యలను తీసుకోలేదని, దీనిపై చేపట్టే ఆందోళనలను ఆయన అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం పాల్పడే అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని నారాయణ చెప్పారు. -
'మోదీవి కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు'
హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటూ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని సీపీఐ నేత డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. కార్పొరేట్ శక్తులు, బ్యూరోక్రాట్లు కలిసి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ వైపునకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం మగ్దూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని పోరాడాల్సి ఉందన్నారు. భారత్‌పై పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. అంతర్జాతీయ సమాజంలో పాక్‌ను ఏకాకిని చేసిన భారత ప్రభుత్వాన్ని ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిపుత్రులను ఆ భూముల నుంచి వెళ్లగొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. -
'నయీంను పెంచి పోషించింది ప్రభుత్వాలే'
నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయని, అవే నయీమ్ లాంటి వారిని పెంచి పోషించాయన్నారు. పోలీసులు, మంత్రులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నక్సలైట్లు, మాజీ నక్సలైట్లను చంపేందుకు నయీమ్‌కు ప్రభుత్వాలు డబ్బులిచ్చి ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. డీజీపీ స్థాయి అధికారులు, మంత్రులు నయీమ్‌తో సన్నిహితంగా ఉంటూ అనేక ఆస్తులు సంపాదించుకుని, సాంబశివుడి లాంటి వారిని చంపించారని దుయ్యబట్టారు. నయీమ్ కేసులో ఉన్న పెద్దలు బయటకి రావాలంటే సిట్ ద్వారా కాకుండా.. సీబీఐ ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీ మాట మార్చడం బాధకరమన్నారు. ఆనాడు ప్రత్యేక హోదాపై ఆశలు కల్పించి నేడు ఇలా మాట మార్చడంలో ఆంతర్యమేమిటో తెలపాలన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి నాలుకపై నరం లేదని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ పోటీ చేస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్ మాటలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తానని చెప్పడం స్వాగతిస్తున్నామని తెలిపారు. -
హోదా తేకుంటే బాబుకు గుండు కొట్టిస్తారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్య సాక్షి, అమరావతి: ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో తిరిగి వస్తే సన్మానం చేస్తామని, ఖాళీ చేతులతో వస్తే గుండు కొట్టించి ఊరేగించడానికి కూడా జనం వెనుకాడరని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలసి విజయవాడలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రెండేళ్లు గడిచినా విభజన హామీల్లో ఒక్కటీ అమలు చేయని బీజేపీ, హోదా సాధించలేని టీడీపీ ప్రస్తుతం ప్యాకేజీ అంటూ నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు బాబు, కేసీఆర్ తరచూ ఢిల్లీ వెళ్లి మోదీ చెవుల్లో గుసగుసలు చెప్పివస్తున్నారని, వీళ్లు వెళ్లినప్పుడు ప్రధాని చెవుల్లో దూది పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
'రాజకీయాలకు మచ్చ తెచ్చేలా చంద్రబాబు, కేసీఆర్ తీరు'
తిరుపతి: రాజకీయ రంగానికే మచ్చ తెచ్చేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. తిరుపతిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ పరిధిలో ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు ఎన్నెన్నో కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అందులో భాగంగానే ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను టోకుగా కొనుగోలు చేస్తూ, రాజకీయ విలువలకు పాతర వేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలను స్వార్థ ప్రయోజనాల కోసం కొనుగోలు చేయడం లేదని ఇద్దరు సీఎంలు నిరూపించగలరా? అని నారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో అసెంబ్లీల్లో ప్రతిపక్షం లేకుండా చేయొచ్చేమో గానీ.. ప్రజల మనసుల నుంచి మాత్రం ప్రతిపక్షాలను తీసేయలేరని అన్నారు. చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మహానాడులో చేసిన ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు అంశాల తీర్మానాలను అమలు చేయించుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనూ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలకులు ఏదో సాధించేసినట్లు రెండేళ్ల సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని సీపీఐ నేత నారాయణ అన్నారు. -
'ఇద్దరు సీఎంలు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారు'
తిరుపతి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని సీపీఐ నాయకుడు కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం తిరుపతిలో కె.నారాయణ మాట్లాడుతూ... తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శించారు. అవినీతి అక్రమార్కులను చెప్పులతో కాట్టాలని నారాయణ పేర్కొన్నారు. -
ఢిల్లీ నుంచి ప్రత్యేక హోదాతోనే రావాలి
చంద్రబాబుకు నారాయణ డిమాండ్ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ నుంచి రావాలని, లేనిపక్షంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు కె.నారాయణ డిమాండ్ చేశారు. సోమవారం మఖ్దూంభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ‘మంగళవారం ఢిల్లీకి వెళ్లి చేప పిల్లకు ఈత నేర్పినట్లుగా ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీకి చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజేంటేషన్ ఇస్తారట. మెడ పట్టుకుని గెంటితే చూరు పట్టుకుని వేలాడినట్లుగా, బీజేపీ వాళ్లు తలుపు చెక్కతో కొడితే తమలపాకుతో సమాధానమిచ్చినట్లుగా చంద్రబాబు తీరు ఉంది’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం జరుగుతున్న ప్రత్యక్ష పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. విభజన సందర్భంగా వాగ్దానం చేసిన రీతిగా ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ రావాల్సి ఉండగా ఇద్దరు సీఎంలు గట్టిగా దాన్ని డిమాండ్ చేయడం లేదన్నారు. కేంద్రానికి తెలంగాణ సీఎం కేసీఆర్ వినతిపత్రాలు ఇస్తున్నారు కానీ... అంతర్గతంగా టీఆర్ఎస్కు కేంద్ర కేబినేట్లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎంలిద్దరు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నీళ్లు, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై పరస్పర అవగాహనతో కూడిన లూటీ చేస్తున్నారన్నారు. రెండు రాష్ట్రాలు సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోకపోతే మహారాష్ట్ర, కర్ణాటక లాభపడతాయని, ఈ విషయంలో గవర్నర్ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. విభజన బిల్లు సందర్భంగా ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడేం చేస్తున్నారన్నారు. -
హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలి
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సాక్షి, న్యూఢిల్లీ: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన భూ లావాదేవీల రిజిస్ట్రేషన్లన్నీ సీజ్ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. భూదురాక్రమణపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు అండతోనే ఏపీలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతోందని ఆరోపించారు. రైతులు, దళితులను మభ్యపెట్టి వారి అసైన్డ్ భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. పెద్దల భూములు సీఆర్డీఏ పరిధిలోకి రాకుండా చాలా తెలివిగా వ్యవహరించారని విమర్శించారు. వాటిని తక్షణమే సీఆర్డీఏ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనిపై తమ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాడుతుందని ఆయన తెలిపారు. -
'హైదరాబాద్‌లో ఆంధ్ర ఓటర్లు కావాలి గానీ ...'
విజయవాడ : దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో నారాయణ మాట్లాడుతూ... కేంద్రం చేతుల్లో రాష్ట్ర గవర్నర్లు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఇదే విషయం మరోసారి స్పష్టమైందని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ కులంపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం దారుణమని నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఓటర్లు కావాలి గానీ... ఆంధ్ర విద్యార్థి చినిపోతే మాత్రం పట్టించుకోరా... అంటూ చంద్రబాబుపై నారాయణ నిప్పులు చెరిగారు. మంత్రి రావెల కిషోర్ బాబును పంపి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజధాని రైతులను చంద్రబాబు బ్లాక్మెయిల్ ధోరణిలో బెదిరిస్తున్నారని విమర్శించారు. రైతులను ఒప్పించి... రాజధాని నిర్మించుకోవాలని చంద్రబాబుకు సీపీఐ నారాయణ సూచించారు. -
'ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు వద్దన్నాడు'
గుంటూరు వెస్ట్ : ఏపీ అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఎటువంటి ప్రయోజనం లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ వ్యాఖ్యానించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శీతాకాల సమావేశాలలో ఒక్క ప్రజా సమస్యపై కూడా చర్చించక పోవడం దారుణమన్నారు. పార్లమెంట్, శాసనసభలలో ప్రజా సమస్యలపై చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా అనవసరమైన అంశాలపై కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్.కె రోజాపై ఏడాదిపాటు బహిష్కరణ వేటువేయడం తగదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ తవ్వకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండగా తవ్వకాలను వ్యతిరేకించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటికి అనుమతులు మంజూరు చేయడం ఆయన రెండు నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. ఢిల్లీ, బీహార్ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చక్రం వెనుకకు తిరుగుతున్నదని నారాయణ వ్యాఖ్యానించారు. -
పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. కర్నూలులో ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఎక్స్ట్రా ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు జిల్లాలను వెంటనే గుర్తించాలని నారాయణ ఈ సందర్భంగా చంద్రబాబు సర్కార్‌ను డిమాండ్ చేశారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన భూములను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం లాక్కోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా పవన్ కల్యాణ్ విజ్ఞప్తి వల్లే భూ సేకరణను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర మంత్రులు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
'గుదిబండలా మారిన గవర్నర్'
తిరుపతి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ గుదిబండలా మారారని సీపీఐ నాయకుడు కె. నారాయణ విమర్శించారు. గవర్నర్ ను మార్చడం కాదు, వ్యవస్థనే రద్దు చేయాలని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆర్థిక నేరాల నిందితుడు లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నిందితురాలని పేర్కొన్నారు. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో సమాధానం ఇస్తే.. ఉభయ సభలకు అవమానకరమన్నారు. సుష్మా స్వరాజ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి. -
'చంద్రబాబు చూపు రాక్షసచూపు'
పోలాకి: ప్రశాంతంగా వున్న శ్రీకాకుళం జిల్లాలో ఊళ్లులేపేసి ఉద్యోగాలు ఇస్తారా..? అంటూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలాకి మండలంలో జపాన్ కంపెనీ సుమితోమో సౌజన్యంతో రాష్ట్రప్రభుత్వం నిర్మించ తలపెట్టిన థర్మల్పవర్ప్లాంట్ ప్రతిపాదిత ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం ఆయన పర్యటించారు. చంద్రబాబు చూపు రాక్షసచూపనీ, శ్రీకాకుళం జిల్లాపై అది పడిందని విరుచుకుపడ్డారు. తోటాడ, సన్యాసిరాజుపేట, ఓదిపాడు, గవరంపేట తదితర గ్రామాల్లో పర్యటించి అక్కడిప్రజలతో మాట్లాడారు. గతంలో జరిగిన సోం పేట, కాకరాపల్లి వంటి ఘటనలు పునరావృతం కాకముందే ప్రభుత్వం ఇక్కడి థర్మల్ ప్రతిపాదన విరమించుకోవాలని సూచించారు. అనంతరం అక్కడ గొర్రెలకాపరితో కాసేపు మాట్లాడి సరదాగా గొర్రెలు కాపుకాశారు. ఆయన వెంట సీపీఐ నాయకులు చాపర సుందరలాల్, ఒడిశాకు చెందిన మాజీఎమ్మెల్యే నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆ జీవో ఎందుకు రద్దుచేయరు? సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో థర్మల్ పవర్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేస్తూ జీవో విడుదల చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ ప్రశ్నించారు. సోంపేట బీల ప్రాంతంలో థర్మల్ పవర్ప్రాజెక్టు ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పోలీసు తూటాలకు బలైపోయిన ముగ్గురు అమరవీరులకు నివాళులర్పిస్తూ మంగళవారం సోంపేట పట్టణంలో భారీ సభ నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలసి పాల్గొన్న నారాయణ మాట్లాడుతూ అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నా అనుమతులు రద్దు చేస్తూ జీవో జారీచేయకపోవడాన్ని తప్పుపట్టారు. ఉద్యమం ఎప్పటికైనా బలహీన పడదా, మరలా ఆ ప్రాంతంలో కర్మాగారాలు స్థాపించడానికి అవకాశం దొరకదా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం 1107 జీవో రద్దు చేయకుండా మరలా ఆనాటి కాల్పుల సంఘటనకు సంబంధించి 720 మంది పై కేసులు పెట్టడానికి సిద్ధం కావడం చూస్తుంటే పరిస్థితి ఎలాఉందో అర్థం అవుతోందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యద ర్శి పిరియా సాయిరాజ్ మాట్లాడుతూ 1107 జీవో రద్దు అయ్యేంతవరకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇచ్చాపురం ఎమ్మెల్యే బి.అశోక్ బాబు, కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి, కిసాన్ మోర్చారాష్ట్ర అధ్యక్షుడు పూడి తిరుపతిరావు, పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ కృష్ణమూర్తి, మడ్డు రాజారావు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
కేసులు పెట్టగానే.. బాబుకు సెక్షన్-8 గుర్తొచ్చిందా?
హైదరాబాద్ : ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో ఇరుక్కున్న చంద్రబాబు తన బాధను ప్రపంచం బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ విమర్శించారు. రాజకీయాల్లో కొనుగోళ్లు అనేది చంద్రబాబుతోనే మొదలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు తమకు అనుకూలంగా లేరని గవర్నర్‌ను టీడీపీ నాయకులు దుర్భాష లాడుతున్నారన్నారు. బాబుపై కేసుల వ్యవహారం రాగానే ఆర్టికల్-8 గుర్తుకు వచ్చిందని, హైదరాబాద్‌లో శాంతి, భద్రతలు క్షీణించాయని తాము అనుకోవడం లేదన్నారు. సెక్షన్-8ను ఓటుకు కోట్లు కేసుతో ముడిపెట్టడం.. అత్తమీసాలకు, భర్త మోకాలుకు ముడిపెట్టినట్లుందని ఎద్దేవాచేశారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో తెలంగాణ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఏపీ పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఏపీ, తెలంగాణల్లో రాజకీయవైషమ్యాలు ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగేలా చేస్తున్నాయన్నారు. రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందన్నారు. ఎన్నికల సంఘం ఉత్సవవిగ్రహంగా తయారైందని విమర్శించారు. ఫిరాయింపులపై స్పీకర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. స్పీకర్ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ సక్రమంగా ఉంటే ప్రస్తుత పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ రెండు రంగాలు కోల్డ్ స్టోరేజీలో ఉన్నాయన్నారు. బీజేపీ సీనియర్‌నేత అద్వానీ నోట ఎమర్జెన్సీ మాట వచ్చిందంటే, అత్యవసర పరిస్థితిని పెట్టి అయినా భూసేకరణ బిల్లుపై ఆమోదముద్ర వేయించుకుంటామన్నట్లుగా ఉందన్నారు. -
తిరుమల స్థానికుల్ని నమ్మించి మోసం చేశారు
- టీటీడీపై నారాయణ ధ్వజం పాత అన్నదానం - కాంప్లెక్స్‌ను వినియోగంలోకి తేవాలని డిమాండ్ సాక్షి, తిరుమల: ‘తిరుమల స్థానికులు శ్రీవారి ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యులు. పెరిగిన భక్తుల సౌకర్యాల కోసం మాస్టర్‌ప్లాన్‌కు సంపూర్ణంగా సహకరించారు. అలాంటి స్థానికులనే టీటీడీ నమ్మించి మోసం చేసింది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తిరుమలలోని దుకాణాలు పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ బాటలో నడిచే సీపీఐ కూడా భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఆనాడు టీటీడీకి మద్దతు తెలిపిందన్నారు. అందువల్ల స్థానికులకు పునరావాసం కింద బాలాజీనగర్ కట్టిం చి కేటాయించారన్నారు. అయితే, మరమ్మతు చేయిస్తామని ఖాళీ చేసిన బాలాజీనగర్ ఇళ్లను తిరిగి కేటాయించ కుండా టీటీడీ అధికారులు మోసం చేయడం దారుణమన్నారు. బాలాజీనగర్‌లో ఇళ్ల ల్లో ఉన్నవారందరూ స్థానికులేనని ఆయ న స్పష్టం చేశారు. 1985 ఏప్రిల్ 6వ తేది అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంభించిన అన్నదాన భవనాన్ని నిరుపయోగంగా వదిలివేయడం తగదన్నారు. సెక్యూరిటీ పేరుతో ఆ భవనాన్ని ఖాళీగా ఉంచడం వల్ల భక్తులు రాకపోవడంతో ఆ ప్రాంతంలో దుకాణదారుల వ్యాపారాలు భారీగా దెబ్బతిన్నాయన్నారు. తిరుమల స్థానికుల సమస్యలపై త్వరలోనే సీఎం, ఎండోమెంట్ మంత్రి, టీటీడీ ఈవోకు లేఖలు రాస్తానని, అవసరమైతే నేరుగా కలసి విన్నవిస్తామన్నా రు. పరిష్కారం చూపకపోతే సీపీఐ పోరాటం చేస్తుందని నారాయణ హెచ్చరించారు. ఆలయం వద్ద భక్తులతో, శ్రీ వారి సేవకులతో ముచ్చటించారు. సౌకర్యాలను అడిగితెలుసుకున్నారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్.వెంకయ్య, పట్టణ కార్యదర్శి ఏ.బాలరంగయ్య, ఏ.శ్రీనివాసులు, రామచంద్ర, రామకృష్ణ, గంగాధరం ఉన్నారు. -
అక్కడ మాటలు..ఇక్కడ దోపిడీ
రైతుల పొట్ట కొట్టి జేబులు నింపుకుంటున్నారు ప్రత్యేక హోదా, ఎన్నికల హామీలకు చెల్లుచీటీ కేంద్ర,రాష్ర్టప్రభుత్వాలపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం ద్వజం విద్యానగర్(గుంటూరు) : కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తూ దేశాన్ని ఉద్ధరిస్తున్నామని గొప్పగా చెప్పుకుంటుంటే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను లూఠీ చేస్తూ తమ జేబులు నింపుకుంటూ పాలన చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరులో గురువారం జరిగిన సీపీఐ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడుతూ దోపిడీ ప్రభుత్వాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రతి కమ్యూనిస్టు పోరాట జెండాలను పట్టాలన్నారు. వ్యవసాయ ఆధారిత దేశంలో రైతులను నట్టేట ముంచుతూ చట్టాలను రూపొందిస్తున్నారన్నారు. పాలకులు రైతుల పొట్టను కొట్టి పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ వేసి జేబులు నింపుకుంటున్నాయని ఆరోపించారు. నరేంద్రమోదీ ప్రజల డబ్బుతో జల్సా చేస్తూ ఎన్నికల హామీలను మరిచిపోయారని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లో నల్లధనాన్ని దేశానికి రప్పిస్తామని చెప్పినా, ఇప్పటికి రూ.10 కోట్లయినా రప్పించలేకపోయారని ఎద్దేవా చేశారు. పారిశ్రామికీకరణ పేరుతో పేదల భూములను లాక్కుంటున్నారేగాని ఒక్క భూస్వామి స్థలాన్ని తీసుకోలేదని పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ నేడు ఆ హోదాను ఇవ్వలేమని స్పష్టం చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో రుణమాఫీ, ఇంటికి ఓ ఉద్యోగం, డాక్రామాఫీ, నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలు చెప్పి ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు జల్లి విల్సన్, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, విజయవాడ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్, సీనియర్ నాయకులు జీవీ కృష్ణారావు, రాష్ట్ర సమితి సభ్యులు రాధాకృష్ణమూర్తి, కోట మాల్యాద్రి పాల్గొన్నారు. -
'నిస్సహాయ స్థితిలో చంద్రబాబు'
తిరుపతి: కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ అన్నారు. మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుపై తనదైన శైలిలో విసుర్లు విసిరారు. హరికథలో పిట్టకథలాగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతి నగరం అంతకూడా లేని సింగపూర్ కు ఏపీ సీఎం తరచూ వెళ్లడం దేనికి ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం తీరు చూస్తుంటే పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకొస్తోందన్నారు. ప్రజలకు పంగనామాలు పెట్టి పెద్ద పెద్ద భవనాల్లో పాలన చేస్తే ఉపయోగం ఏంటని నిలదీశారు. రుణమాఫీ అమలు చేసి చెట్టుకింద పరిపాలన చేసినా హర్షించే వాళ్లమని చెప్పారు. విజయమాల్య తరహాలో చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో చక్కుర్లు కొడుతున్నారని.. చివరకు ఆయనకు పట్టిన గతే పడుతుందేమో చెప్పలేమన్నారు. రాజధాని పేరుతో హంగామా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉందని నారాయణ అన్నారు. -
నల్లధనాన్ని బయటికి తీయండి
యర్రగొండపాలెం: రుణాలు తీసుకొని ఎగవేసిన పారిశ్రామికవేత్తల నుంచి, స్విస్ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనాన్ని బయటికి తీస్తే ఆ డబ్బుతో దేశంలో 3 వేల ప్రాజెక్టులు నిర్మించవచ్చని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. యర్రగొండపాలెంలో మంగళవారం నిర్వహించిన సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చారు. ముందుగా పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు ఉద్యమ సార థి పూల సుబ్బయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి విశేష కృషి చేసిన పూల సుబ్బయ్యను ఈ ప్రాంత ప్రజలు మరచిపోరన్నారు. ఈ ప్రాజెక్టు ఫైలును చూసిన అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య పేరుపెట్టి నిధులు కేటాయించారన్నారు. అటువంటి ప్రాజెక్టుకు డబ్బులు లేవనడం సరైంది కాదన్నారు. చైనా తరువాత ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో ప్రజల నుంచి లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పారిశ్రామికవేత్తలు రుణాలు తీసుకొని ఎగవేశారన్నారు. రూ.72 లక్షల కోట్లు స్విస్ బ్యాంకులో నల్లధనం మూలుగుతోందనిన్నారు. ఈ నల్లధనంతో ప్రాజెక్టులు నిర్మిస్తే 2 వేల కోట్ల ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు ఒబామా ఆర్థిక సలహాదారుడు భారతీయులే అన్న విషయాన్ని విస్మరిస్తున్నారన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా కష పడుతుంటారని, అటువంటి దేశంలో గృహాలు లేక అల్లాడుతున్నారన్నారు. పెద్దపారిశ్రామికవేత్తలు అక్రమంగా దాచుకున్న డబ్బును వెలికితీస్తే ప్రతి ఒక్క కుటుంబానికి 3 బెడ్ల ఇళ్లను కట్టించవచ్చన్నారు. ఎరుపెక్కిన యర్రగొండపాలెం: సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా పట్టణంలోని పుల్లలచెరువు బస్టాండ్ నుంచి వైఎస్ఆర్ సెంటర్, త్రిపురాంతకం సెంటర్, కొలుకుల రోడ్డు మీదుగా వేదిక వద్దకు ర్యాలీ నిర్వహించారు. రెడ్‌షర్‌ట వలంటీర్లు కదం తొక్కారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన కోలాటం, ప్రజానాట్యమండలి సభ్యులు పాడిన విప్లవగేయాలు, లెనిన్ వేషధారి ప్రదర్శించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమాల్లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి కె.అరుణ, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, ఎంఎల్ నారాయణ, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రానాయక్, కర్నూలు జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్య, రిటైర్డ్ స్పెషల్ అడిషనల్ కలెక్టర్ షంషీర్‌ఆహ్మద్, పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందిని, గిద్దలూరు మార్కెట్‌యార్డు మాజీ అధ్యక్షుడు టీ రామ్మోహనరావు, ఆర్డీ రామకృష్ణ, మార్కాపురం మునిసిపల్ మాజీ చైర్మన్ జక్కా ప్రకాష్, మాజీ వైస్ చైర్మన్ అందె నాసరయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కరవది సుబ్బారావు, నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, కేవీ కృష్ణగౌడ్, గురవయ్య పాల్గొన్నారు. -
స్వైన్‌ఫ్లూ నియంత్రణలో ప్రభుత్వం విఫలం: సీపీఐ నారాయణ
స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు నారాయణ ఆరోపించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని మంగళవారం సందర్శించిన ఆయన ఐసోలేషన్‌వార్డులో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ బాధితులను పరామర్శించారు. గాంధీ ఆసుపత్రి వార్డులో అందిస్తున్న వైద్యసేవలు, మందులు, ఇతర మౌలిక సదుపాయాలపై ఆస్పత్రి అధికారులతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూ వ్యాధిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం మరింత చొరవ తీసుకుని నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో సరిపడేంత సిబ్బంది, మౌళికసదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. -
కార్పొరేట్, కాషాయ శక్తుల నుంచి విద్యారంగాన్ని కాపాడాలి
‘విద్యా పోరాట యాత్ర’ సభలో వక్తలు హైదరాబాద్: ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, కాషాయీకరణ నుంచి విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహించాలని అన్నారు. విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో అఖిల భారత విద్యా పోరాట యాత్ర నిర్వహించారు. అనంతరం నిజాం కళాశాల గ్రౌండ్లో సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు కె. నారాయణ, సీపీఎం శాసన సభానేత సున్నం రాజయ్య, న్యూ డెమోక్రసీ నేత వెంకటరామయ్య, విద్యావేత్త చుక్కారామయ్య, విరసం నేత వరవరరావు, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి తదితరులు పాల్గొని ప్రసంగించారు. సీపీఐ నేత కె.నారాయణ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కార్పొరేట్ సంస్థలను బతికించడానికే దోహదపడుతుందని విమర్శించారు. ఈ పథకం లేకుంటే సగం కళాశాలలు మూతపడేవన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, 108 పథకాలతో విద్య, వైద్య రంగాలు నిర్వీర్యమయ్యాయని విరసం నేత వరవరరావు అన్నారు. కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాల్లో చొరబడుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక విద్యాసంస్థల అధిపతికి మంత్రి పదవి ఇవ్వడమే ఇందుకు ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు. విద్యాపరిరక్షణ కమిటీ జాతీయ అధ్యక్ష వర్గం సభ్యులు ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుండే మాట్లాడుతూ.. శాస్త్రీయ విద్యా విధానం కోసం తాము పోరాటం చేస్తుంటే మోదీ ప్రభుత్వం కాషాయీకరణను వేగవంతం చేస్తుందని విమర్శించారు. -
ఇది టూరిజం గవర్నమెంట్
ఒంగోలు టౌన్ : ‘రాష్ట్ర రాజధాని కోసం నాలుగు నుంచి ఐదువేల ఎకరాలుంటే సరిపోతుంది. అందుకు విరుద్ధంగా లక్ష ఎకరాలు కావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రాజధాని నిర్మాణం కోసం వివిధ దేశాల్లో చక్కర్లు కొడుతోంది. చివరకు ఇది టూరిజం గవర్నమెంట్‌గా మారిందని’ సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కే నారాయణ వ్యాఖ్యానించారు. మొదట్లో స్విట్జర్లాండ్ చుట్టూ తిరిగిన చంద్రబాబునాయుడు ప్రస్తుతం సింగపూర్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారన్నారు. సింగపూర్‌లో బహుళ అంతస్తులు ఉన్నాయని, వాటిలాగా నిర్మాణాలు చేపట్టాలంటే లక్ష ఎకరాలు అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆయన ఫైర్ అయ్యారు. సీపీఐ జిల్లా శాఖ నూతన భవనాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో పార్టీ శ్రేణులు, ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు. రాష్ట్ర రాజధాని కోసం విదేశాలకు వెళుతున్నారంటే పాలకుల దృష్టిలో భారతదేశం అంత పనికిమాలినదా అని ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి ఒంగోలులో నిర్మించిన సీపీఐ భవనాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలని చంద్రబాబుకు నారాయణ హితవు చెప్పారు. ఎన్నికల సమయంలో ఎవరైనా హామీలిస్తారని, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు ప్రయత్నిస్తారని, చంద్రబాబు తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా హామీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారన్నారు. ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో హామీల వర్షం కురిపిస్తున్నారని, ప్రకాశం జిల్లాను మాత్రం మొదటి నుండి చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చే హామీల్లో సగం నెరవేర్చినా ఇక సమస్యలు ఉండవని ఉప ముఖ్యమంత్రి నారాయణ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఉపన్యాసాల గారడీలతో ప్రజలను మోసగిస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతున్నా వాటి గురించి ప్రస్తావించడం లేదన్నారు. పారిశ్రామికవేత్తలు మూడులక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టినా, పదిలక్షల కోట్లు బొగ్గు కుంభకోణం జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వామపక్షపార్టీలు మినహా మిగిలినవన్నీ బూర్జువా విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. ఎర్ర జెండాలు ఏకమై పోరాడితే తప్ప సమాజానికి విముక్తి ఉండదన్నారు. సీఎం బ్లాక్‌కు రూ.25 కోట్లు అవసరమా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లోటు బడ్జెట్‌తో రాష్ట్రం దివాళా తీసిందని శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాత్కాలిక బ్లాక్‌కు రూ.25 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రశ్నించారు. రాష్ట్ర ఆదాయం రూ.52 వేల కోట్లు, ఖర్చులు రూ.62 వేల కోట్ల కింద చూపించి, రూ.10 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నా నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లక్షా 11 వేల 824 కోట్ల రూపాయలతో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలుంటే 14 విమానాశ్రయాలు, 14 పోర్టులు నిర్మిస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఇస్తున్న హామీలు అమలు చేయాలంటే 8 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయన్నారు. చంద్రబాబు మార్కెట్లో పూలుకొని ప్రజల చెవుల్లో పెడుతుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల చేతనే పూలుకొనిచ్చి వారి చెవుల్లోనే పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన బతుకమ్మ పండుగ కవితమ్మ పండుగగా మారిందన్నారు. ఈ పండుగకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చూపించి ప్రజల చెవుల్లో పూలు పెట్టిందన్నారు. రాష్ట్రంలోని 10 వామపక్ష పార్టీలతో కలిసి చంద్రబాబుపై యుద్ధం ప్రకటించనున్నట్లు రామకృష్ణ తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కే అరుణ అధ్యక్షతన నిర్వహించిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, కార్యదర్శివర్గసభ్యులు పీజే చంద్రశేఖరరావు, రావుల వెంకయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రవీంద్రనాధ్, సినీనటుడు మాదాల రవి, సినీ సంగీత దర్శకుల సంఘం కార్యదర్శి మద్దినేని రమేష్, సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్యతోపాటు వివిధ జిల్లాలకు చెందిన సీపీఐ కార్యదర్శులు పాల్గొన్నారు. అలరించిన వందేమాతరం పాటలు: సినీ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన గీతాలు అలరించాయి. ఎర్రజెండ ఎర్రజెండ ఎన్నియల్లో అంటూ ఆలపించిన గీతాలు హోరెత్తించాయి. ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన గీతాలు, సభకు ముందు నిర్వహించిన కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. జరుగుమల్లి మండలం వావిలేటిపాడుకు చెందిన కడియాల రంగయ్య లెనిన్ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలుత పార్టీ కార్యాలయం వద్ద జెండాను సీపీఐ రాష్ట్ర నాయకుడు నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నూతన భవనాన్ని నారాయణ, ప్రజాసంఘాల సముదాయాన్ని మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డి, నల్లూరి అంజయ్య హాలును రామకృష్ణ ప్రారంభించారు. -
'అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు'
హైదరాబాద్: లొంగిపోయిన నిజాం ప్రభువుకు ఇప్పటి తెలంగాణ పాలకులు వంగి దండాలు పెట్టడం అవమానకరమని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె. నారాయణ విమర్శించారు. తెలంగాణ విలీనదినోత్సవం నిర్వహణపై కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. నిజాంపై కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది ఒకే వర్గ స్వభావమని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం సాయుధ పోరాటాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వామపక్షాలు ఒకే వేదికపైకి రావాలని నారాయణ మరోసారి పిలుపునిచ్చారు. -
పాత పంథాలోనే కేసీఆర్: కె.నారాయణ
సాక్షి, హైదరాబాద్: కొత్తప్రభుత్వం.. కొత్తపంథా.. కొత్త విధానాలూ అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ పాత ప్రభుత్వాల పంథాలోనే సాగుతున్నారని, కొత్తదనం కొరవడిందని సీపీఐ నేత కె.నారాయణ ధ్వజమెత్తారు. కరెంట్‌తో రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిపై పోలీసుల లాఠీచార్జీలు, కేసులు అంటూ పాత ప్రభుత్వాల ఒరవడిలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నడుస్తోందన్నారు. మెదక్ రైతులపై లాఠీచార్జీకి కారణమైన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మఖ్దూంభవ న్లో పార్టీనేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ వితండవాదం వల్లే కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టులో కేసు పడిందని, ఇప్పటికైనా మధ్యంతర తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. 1956 తర్వాత తెలంగాణలో పుట్టినవారంతా స్థానికులే అంటూ సీఎం కాకముందు ప్రకటించిన కేసీఆర్ సీఎంఅయ్యాక మాటమార్చి రెండునాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. -
రెబెల్స్‌ను తప్పించండి
* టీపీసీసీ చీఫ్ పొన్నాలతో నారాయణ సాక్షి, హైదరాబాద్: పొత్తులో భాగంగా తమకు కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్ నేతలు నామినేషన్లు దాఖలు చేయడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అసహనం వ్యక్తం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ బి.ఫాం ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మల్రెడ్డి సహా రెబెల్ అభ్యర్థులంతా నామినేషన్లు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నారాయణ కోరారు. శుక్రవారం పొన్నాల నివాసానికి వచ్చిన ఆయన..ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు, పార్టీ నేతల పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. సీపీఐతో కాంగ్రెస్ పొత్తు ఇరుపార్టీలకు లాభిస్తుందని పొన్నాల అభిప్రాయపడ్డారు. హైకమాండ్ ఆదేశాల మేరకే మహేశ్వరం నియోజకవర్గంలో మల్‌రెడ్డికి బి.ఫాం ఇచ్చామన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ పని చేసినప్పటికీ మల్‌రెడ్డిని బరి నుంచి తప్పుకోవాలని ఆదేశించామన్నారు. తమకు కేటాయించింది ఏడు సీట్లే అయినప్పటికీ వాటిలోనూ కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేయడం సరికాదని నారాయణ అన్నారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఎమ్మెల్సీసహా నామినేటెడ్ పదవులు వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకుని పోటీ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. మల్రెడ్డి రంగారెడ్డి కూడా కచ్చితంగా నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందేనని చెప్పారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకొస్తే ప్రభుత్వంలో సీపీఐ భాగస్వామిగా ఉండాలా? వద్దా? అనేది పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయిస్తుందన్నారు. తమకు ఏడు సీట్లే ఇవ్వడం పట్ల అసంతృప్తి ఉన్న మాట వాస్తవమేనని, అయితే పొత్తు ఖరారైనందున సంతృప్తితో ఎన్నికల్లోకి వెళుతున్నామని నారాయణ చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేస్తే ఎన్నికలు ఏకపక్షంగా జరిగేవని, కేసీఆర్‌కు ఇన్ని తిప్పలు ఉండేవి కావని ఆయన వ్యాఖ్యానించారు. పొన్నాలతో కరీంనగర్ నేతల భేటీ ఈ నెల 16న కరీంనగర్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ వస్తున్న నేపథ్యంలో ఆ జిల్లా నేతలతో పొన్నాల శుక్రవారం సమావేశమయ్యారు. మాజీ మంత్రి డి.శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ సహా జిల్లాకు చెందిన పలువురు నాయకులు ఈ భేటీకి హాజరయ్యారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ కూడా చర్చలో పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తరువాత తొలిసారి సోనియాగాంధీ వస్తున్నందున భారీ ఎత్తున ప్రజలను సమీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. -
మాట తప్పుతారా?
* కాంగ్రెస్‌పై నారాయణ మండిపాటు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌తో సీపీఐ సీట్ల సర్దుబాటు పంచపాండవులు మంచపు కోళ్లను తలపించింది. తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలు కోరిన సీపీఐ.. ఆ సంఖ్యను 12కు కుదించుకుంది. చివరకు సంప్రదింపుల అనంతరం సీపీఐకి కాంగ్రెస్ 9 స్థానాలే ఇచ్చింది. కాంగ్రెస్ జాబితా విడుదలతో మిత్రపక్షానికి కాంగ్రెస్ మరో ఝలక్ ఇచ్చింది. ఆ పార్టీకి కేటాయించే సీట్ల జాబితాలో ఉన్న స్టేషన్‌ఘన్‌పూర్ స్థానానికి కాంగ్రెస్ సోమవారం అభ్యర్థిని ప్రకటించింది. దీంతో సీపీఐకి 8 స్థానాలే మిగిలాయి. వీటిలోనూ సీపీఐ కోరిన ఓ సీటును మార్చి మరొకటిచ్చింది. స్టేషన్‌ఘన్‌పూర్‌కు అభ్యర్థిని కూడా ప్రకటించుకున్న సీపీఐ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ తీరుతో అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమకు కేటాయించిన స్టేషన్ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని మండిపడ్డారు. పైగా, తాము కోరని కోదాడ సీటును కాంగ్రెస్ ఖాళీగా వదిలిందని మండిపడ్డారు. టీఆర్ఎస్ను కాదనుకుని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఇంత దెబ్బ కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన మాటను ఎలా తప్పుతారంటూ సీపీఐ తెలంగాణ, సీమాంధ్ర ఉమ్మడి కార్యదర్శి నారాయణ కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను సంప్రదించేందుకు సీపీఐ నేతలు ప్రయత్నించినప్పటికీ, ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో పార్టీ తెలంగాణ నేతలు సోమవారం సాయంత్రం నారాయణ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అసమ్మతిని తెలపడంతో పాటు స్టేషన్ ఘన్పూర్ స్థానాన్ని సీపీఐకే కేటాయించాలని కోరాలని నిర్ణయించారు. -
మాట మసాలా
ప్రొఫైల్ గోడలెక్కుతారు, గేట్లను తంతారు. ఆడా, మగా తేడా లేకుండా ఉన్నదున్నట్టు ముఖం మీద అనేస్తారు. తర్వాత క్షమాపణలు చెబుతారు. ప్రధానినే ఉరి తీయాలంటారు. ముఖ్యమంత్రిని దద్దమ్మంటారు. మీడియాను చూస్తే శివాలెత్తుతారు. భాష మార్చుకోమని పార్టీ సలహా ఇస్తే సరేనంటారు. ఆ తెల్లారే మరచిపోతారు. తప్పు చేయడం, సరిదిద్దుకోవడం మానవ సహజమంటారు. పుట్టింది చిత్తూరు జిల్లాలో...పెరిగింది గుంటూరులో. చదివింది ఆయుర్వేద వైద్యం. చేస్తున్నది సామ్యవాద రాజకీయం. ధోరణి అతివాదం....శైలి నిత్యనూతనం.మనసు వెన్నలా ఉంటే...మాటను గన్నులా పేల్చే ఆయన మరెవరో కాదు.. కంకణాల నారాయణస్వామి నాయుడు. అలియాస్ డాక్టర్ కె.నారాయణ. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్ల తరువాత 1949 డిసెంబర్ 7న చిత్తూరు జిల్లా నగరి మండలం ఆయనంబాకంలో జన్మించారు. తండ్రి సుబ్బనాయుడు ఓ మోస్తరు రైతు. తల్లి ఆదిలక్ష్మి గృహిణి. ఆ కుటుంబంలో చివరి సంతానమైన నారాయణ కాస్త గారాబంగానే పెరిగారు. నగరి ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ, మదనపల్లి బీటీ కాలేజీలో పీయూసీ పూర్తి చేశారు. అల్లోపతి చదవడానికి గుంటూరు వెళ్లి ఆయుర్వేదం చేశారు. కమ్యూనిస్టు ఉద్యమంపై అడుగులు 1970 దశకంలో కమ్యూనిస్టు ఉద్యమం మాంచి ఊపు మీద ఉన్నప్పుడు దానిపట్ల ఆకర్షితులయ్యారు. నారాయణ ఒడ్డూ పొడవు, చొరవ, మాట తీరు అప్పటి గుంటూరు జిల్లా పార్టీ నాయకులుగా ఉన్న వేములపల్లి శ్రీకృష్ణ, కనపర్తి నాగయ్య, వల్లూరి గంగాధరరావు, జీవీ కృష్ణారావు లాంటి వారిని ఆకట్టుకుంది. దీంతో గుంటూరు జిల్లా ఏఐఎస్ఎఫ్ బాధ్యతలు అప్పగించారు. 1973లో జిల్లాస్థాయి నుంచి ఏఐఎస్ఎఫ్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అప్పట్లో విద్యార్థి నేతలు పార్టీ నుంచి బయటకు పోకుండా ఉండేందుకు పార్టీ.. సోషలిస్టు దేశాల పర్యటనకు పంపించేంది. అలా నారాయణ 1973లో నాటి తూర్పు జర్మనీ(జీడీఆర్)లో జరిగిన ప్రపంచ యువజనోత్సవాలకు రాష్ట్రప్రతినిధిగా వెళ్లారు. అప్పటికే నారాయణ పరిణతిని గమనించిన పార్టీ నాయకత్వం 1976లో ఆయనను రాయలసీమ విద్యార్థి, యువజన సంఘం బాధ్యతలు చూసేందుకు తిరుపతి కేంద్రంగా పనిచేయమని ఆదేశించింది. ఎనిమిదేళ్ల పాటు ఆ పనిని దిగ్విజయంగా నిర్వహించారు. ప్రతి పనికీ తానే ముందన్నట్టుగా ఇళ్ల స్థలాల మొదలు వ్యవసాయ భూముల స్వాధీనం వరకు అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఉద్యమాలు.. పదవులు ఉద్యమాలతోపాటే ముందుకుసాగిన నారాయణ 1986లో చిత్తూరు జిల్లాపార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1995లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, జాతీయ సమితి సభ్యుడిగా ఎన్నికయ్యారు. అప్పుడు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సురవరం సుధాకర్‌రెడ్డి ఉన్నారు. జాతీయ పార్టీ అవసరాల దృష్ట్యా సురవరం ఢిల్లీకి మారాల్సి రావడంతో 1999లో నారాయణను పార్టీ సహాయ కార్యదర్శిని చేసి హైదరాబాద్ తీసుకువచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నారు. మర్చిపోలేని పోరాటం చిత్తూరు జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా ఉన్న సమయంలో టీడీపీపై చేసిన పోరాటాన్ని మర్చిపోలేనంటారు నారాయణ. 1985లో తిరుపతిలో ఇళ్ల స్థలాల కోసం ఉద్యమిస్తుంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయనతోపాటు 1500మందిపై భూ ఆక్రమణ కేసులు పెట్టి జైలుపాల్జేసింది. ఆ కేసుల ఎత్తివేతకు ఏకంగా అఖి లపక్ష కమిటీ ఏర్పాటు చేశారు. దానికాయనే అధ్యక్షుడి గా ఉండి అన్ని వర్గాల వారిని సమీకరించి అహర్నిశలు పోరాడి విజయం సాధించారు. ఈ ఘటనను తన జీవితంలో మర్చిపోలేనని తరచూ చెబుతుంటారు. విద్యుత్ వ్యతిరేక పోరాటం తన జీవితంలో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అంశమని అంటారు. మూడుసార్లు.. సురవరం తర్వాత పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయిన నారాయణ 2007 డిసెంబర్లో తిరుపతిలో జరిగిన మహాసభల్లో రెండో సారి, 2012 ఫిబ్రవరిలో కరీంనగర్లో జరిగిన మహాసభల్లో మూడో విడత కూడా రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనేక సమస్యలపై ముందుండి పోరాటాలు నడిపారు. చైనా, రష్యా దేశాల కమ్యూనిస్టు పార్టీల ఆహ్వానం మేరకు ఇటీవల ఆయా దేశాల్లో పర్యటించి వచ్చారు. తిరిగి కుమార్తె ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లొచ్చారు. దూరం.. దూరం పార్టీ పదవుల్లో ముందున్న నారాయణ ఎన్నడూ చట్టసభలకు పోటీ చేయలేదు. ఆ ఆసక్తి కూడా తనకు లేదంటారు. శాసనసభ, లోక్‌సభ సభ్యత్వం కంటే పార్టీ పదవే ఎక్కువంటారు. తన వాగ్ధాటితో, పోరాటపటిమతో పార్టీని జనంలో నిలబెట్టడంలో ఆయన విజయవంత మయ్యారు. -ఎ. అమరయ్య -
హవ్వా.. వన్‌సైడ్ లవ్వా!
పదునైన మాటలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు సంధించడం సీపీఐ నారాయణ స్టయిల్. వెనుకాముందు ఆలోచించకుండా పరుష పదజాలంతో ఎవరినైనా కడిగిపారేయడం ఆయన ప్రత్యేకత. ఎంత పెద్ద నాయకుడి పైనా విమర్శలు చేసినా ఆయన మాటల వాడి తగ్గదు. తాజాగా తన సహచర కామ్రేడ్ నాయకుడు తమ్మినేని వీరభద్రంపై 'ప్రేమ పూర్వక' విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పొత్తుకు సుముఖంగా ఉన్న సీపీఎం వైఖరిని 'లవ్ కామెంట్స్'తో ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో సీపీఐ కలిసి వెళ్లడాన్ని సీపీఎం తప్పుబట్టింది. దీనిపై నారాయణ స్పందిస్తూ.. ఏ సిద్ధాంతం ప్రకారం టీఆర్ఎస్ను సీపీఎం వన్‌సైడ్ లవ్ చేస్తోందని గట్టిగా ప్రశ్నించారు. సమైక్యాంధ్ర కట్టుబడిన సీపీఎం, విభజనకు కోరుకున్న టీఆర్ఎస్తో కలిసి వెళ్లడానికి సిద్ధపడడాన్ని ఏమంటారని నిలదీశారు. సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీఆర్ఎస్ను వన్‌సైడ్ లవ్ చేస్తున్నా... కేసీఆర్ తిరిగి చేయడం లేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు సినిమాలకే పరిమితమైన 'వన్‌సైడ్ లవ్' నారాయణ పుణ్యమాని రాజకీయాలకూ పాకింది. ఒకవైపు ప్రేమ పాలిటిక్స్‌లో ఫలిస్తుందో, లేదో చూడాలి. -
3 ఎంపీ, 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ!
-
ఉరికంబంపై ఊగిసలాట
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై నారాయణ ఎద్దేవా పార్లమెంట్లో దాడిచేసిన వారు ఉగ్రవాదులే మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉరికంబంపై ఊగిస లాడుతున్నాయని సీపీఐ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఎద్దేవాచేశారు. పార్లమెంట్లో మైకులు విరగ్గొట్టి కత్తులుగా వాడటం, పెప్పర్ స్ప్రే చల్లి వీధిరౌడీలకంటే హీనంగా తన్నుకోవ డం ప్రపంచ చరిత్రలో ఎప్పు డూ జరగలేదన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఆయన విలేకరుతో మాట్లాడారు. గతంలో పార్లమెంట్ భవనంపై దాడిచేసిన వారిని ఉరితీయాలని అందరం డిమాండ్ చేశామని, కానీ లోక్‌సభలో తోటి ఎంపీలపై దాడిచేసిన వారి సంగతేమిటని ప్రశ్నించారు. వారు ముమ్మాటికి ఉగ్రవాదు లేనని ఆరోపించారు. వీడియో పుటేజ్‌లను పరిశీలించి సంఘటనకు బాధ్యులైన వారిని ఉరితీసినా పాపం లేదన్నారు. దోషులను శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని, లేకుంటే రిలయన్స్, అంబానీ, ప్రపంచ బ్యాంకులు దేశ సార్వభౌమత్వాన్ని శాసిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నిపార్టీల అభిప్రాయాలు, పలు కమిషన్ల నివేదికలు, జీఓఎం సిఫార్సులాంటి అన్ని చర్చలు, ఇతర ప్రక్రియలు పూర్తయ్యాయని, అందుకే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ర్ట విభజన పట్ల రాజకీయ పార్టీలు చేసిన నిర్ణయాలకు కట్టుబడకపోవడమే ఈ అరాచకాలకు మూలమన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్న బీజేపీ, చంద్రబాబు సావాసదోషంతో మాటమారుస్తోందని దుయ్యబట్టారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పగలనన్న ఫోజులకు మాత్రమే బాబు ఇతర రాష్ట్రాల నేతలు కలిసి సమన్యాయం అంటున్నారని విమర్శించారు. సమస్యను రాష్ట్రంలో సృష్టించి ఢిల్లీలో పరిష్కారాన్ని వెదుకులాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పడమటి ఎద్దులా మొండికేస్తున్నాడని ధ్వజమెత్తారు. -
మోడీతో వెళితే కాలిపోతావ్
* చంద్రబాబు రాజకీయాలపై నారాయణ వ్యాఖ్య తిరుపతి, న్యూస్‌లైన్: బీజేపీతో దోస్తీ చేస్తే టీడీపీ తీవ్రంగా నష్టపోవడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అన్నారు. దీపాన్ని చూసి భ్రమపడి శలభం వెళితే ఏం జరుగుతుందో...మోడీకి ఆకర్షితుడైతే చంద్రబాబుకూ అదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర సమస్యలపై ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణకుమార్రెడ్డి దీక్ష చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. సమైక్యరాష్ట్రంలో సమస్యలు లేవా ? గత మూడేళ్లలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సమస్యలు కనపడలేదా ? అని నారాయణ ప్రశ్నించారు. ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేయడం సబబు కాదన్నారు. ప్రత్యేక తెలంగాణకు సీపీఐ మద్దతిస్తున్నా.. రాయలసీమ సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, పార్లమెంట్లో కాంగ్రెస్ వాళ్లే బిల్లును అడ్డుకునే అవకాశం ఉందంటూ ఆ పార్టీపై బీజేపీ నెపం మోపి చేతులెత్తేసే పరి స్థితి కనిపిస్తోందని నారాయణ విమర్శించారు.