
సాక్షి, ద్వారకానగర్ (విశాఖ): గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో అనవసరంగా పొత్తు పెట్టుకున్నామని, అందుకు ఇప్పుడు లెంపలేసుకుంటున్నామని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం చట్టం చేసిందంటూ విశాఖలో మంగళవారం వామపక్షాలు ఆందోళన చేశాయి. నారాయణ మాట్లాడుతూ.. ఆనాడు తమతో పొత్తు పెట్టుకున్న పవన్.. నేడు ప్రధాని మోదీ కాళ్లు మొక్కుతున్నాడని విమర్శించారు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అతనికి వ్యక్తిత్వమే లేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నిర్ణయాలను చంద్రబాబు ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. (చదవండి: నిజాలు దాచి.. నిందలు)