సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ కొనసాగితే రఫేల్ కుంభకోణం మొత్తం బయటపడుతుందనే ఆందోళనతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అగ్నిమాపక శాఖకు మార్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రధాని స్థాయిలోనే చట్టా ల ధిక్కరణ జరిగితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. సీబీఐపై ఇలాంటి ప్రత్యక్షచర్య 55 ఏళ్లలో ఎప్పు డూ జరగలేదన్నారు. ఆలోక్‌వర్మను సీబీఐ డైర్టెకర్‌గా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శాలు తట్టుకోలేక ప్రధాని నిరాశ, నిస్పృహలతో అత్యున్నతస్థాయి కమిటీ పేరుతో వర్మను ఫైర్ సర్వీస్‌కు బదిలీచేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని వెక్కిరించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మతపరంగా విభజిం చే కుట్ర చేస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. అస్సాం పౌరసత్వం బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment