
మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించాడు సీపీఐ నారాయణ. తాను వాడిన పదాలను భాషాదోషంగా పరిగణిస్తున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. విజయవాడలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'చిరంజీవి గురించి చేసిన కామెంట్ భాషాదోషంగా గమనించాను. దీనివల్ల చిరంజీవి అభిమానులతో పాటు కొందరికి బాధ, ఆవేశం కలిగింది. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు ఉంటాయి. అవి లేకుండా రాజకీయ పార్టీలు లేవు. దాని ప్రకారం నేను మాట్లాడింది వాస్తవమే. అయితే రాజకీయ భాషకు మించి చిరంజీవి గురించి మాట్లాడినదాన్ని భాషాదోషంగా పరిగణించాలి. మీకు దండం పెడుతున్నా, దాన్ని వదిలిపెట్టండి' అని కోరారు.
కాగా ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించడంపై నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజుగా నటించిన కృష్ణను పిలవకుండా చిరును పిలవడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల్లో రంగులు మార్చే చిరంజీవి స్టేజీపై స్థానం తగదంటూ చిల్లర బేరగాడు అంటూ తిట్టిపోశారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన వ్యాఖ్యలపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
చదవండి: గుడ్‌న్యూస్, ఇకమీదట అన్ని సినిమాలకు ఒకటే టికెట్ రేట్!
చైసామ్ మా అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు, అసలు గొడవపడేవారు కాదు
Comments
Please login to add a commentAdd a comment