గన్‌ఫౌండ్రీ: తెలంగాణ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌం డ్స్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల ముగింపు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకుని త్యాగాలు చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తుచేశారు. భూమి, భుక్తి, బానిస సంకెళ్ల విముక్తి కోసం నాడు నిజాం ప్రభుత్వంతో ఈ పోరాటం జరిగిందని, అయితే దీనిని ముస్లింలపై జరిగిన పోరాటంగా బీజేపీ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు.
ఈ పోరాటా నికి ముస్లింల మద్దతు ఉందన్న చరిత్రను తెలుసుకోవాలని సూచించారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కార్యక్రమం లో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం, అజీజ్‌పాషా, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా మంగళవారం మఖ్దూం భవన్‌లో చాడ వెంకట్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Comments
Please login to add a commentAdd a comment