
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఓడిపోతున్నట్టు అంగీకరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో పడుకుంటామని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. అలా అయితే ఫలితాల వరకూ ఎదురుచూడటం ఎందుకని, ఇప్పుడే రాజకీయాలకు సెలవు చెప్పి ఇంట్లోనే పడుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఆయన నోటి నుంచి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన రోజే ఆయన రాజకీయ జీవితం అయిపోయిందని నారాయణ పేర్కొన్నారు. మేడ్చల్ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో మహాకూటమి నేతలు వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సోనియా పర్యటనతో కేసీఆర్ భయాందోళనకు గురువుతున్నారని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదని, అలాంటి జనాలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment