CPI general secretary
-
ఎన్నికలనాటి పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో పొత్తులు: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నాటి పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలతో తమ పొత్తులు, అవగాహనలు ఉంటాయని సీపీఐ జాతీయ ప్రధా నకార్యదర్శి డి.రాజా స్పష్టం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికశక్తులు, ప్రాంతీయ పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టు కుంటుందని వెల్లడించారు. తెలంగాణలోనూ ఇదే వైఖరి అవలంభిస్తామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మాత్రం బీజేపీకి వ్యతిరేకంగా ముందస్తుగానే ఒక కూటమి ఏర్పడే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డి.రాజా గురువారం విలే కరులతో మాట్లాడారు. 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలు అత్యంత కీలకమైనవన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోదీ వాగ్దానం ఏమైందని రాజా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను గవర్నర్లు ముందుకు తీసుకెళ్తున్నారని, ఇటీవల తమిళనాడు గవర్నర్ సనా తన ధర్మాన్ని ప్రస్తావించిన విషయాన్ని రాజా గుర్తుచేశారు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే అంశంలో తన ఆలోచనను మార్చుకోవాలని సూచించారు. అనేక ప్రాంతీయ పార్టీలతో తాము చర్చలు జరుపుతున్నామని, బిహార్‌లో నితీశ్‌కుమార్, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ఒక కూటమిగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో ముందుకు సాగుతామన్నారు. గుజరాత్లో బీజేపీ ఓటమిపాలైతే, అక్కడి నుంచే ఆ పార్టీ పతనం ప్రారంభం కానుందన్నారు. మిలియన్ సభ్యత్వాలు... మరో రెండేళ్లలో సీపీఐ శతాబ్ది వార్షికోత్సవానికి చేరుకోబోతున్న సందర్భంగా మిలియన్ సభ్యత్వాలను చేర్పించాలని రాజా పిలుపునిచ్చారు. కార్పొరేట్ ఫండ్స్‌లో బీజేపీకి ఎక్కువ వస్తున్నాయని, దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీ అని, అధికారంలోనికి వచ్చేందుకు ఆ పార్టీ విపరీతమైన డబ్బులను వెదజల్లుతోందని విమర్శించారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడేమీ చెప్పలేం: కూనంనేని ఎన్నికల పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న నల్లగొండ, ఇతర జిల్లాల్లోని స్థానాలను అడుగుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టంచేశారు. బీజేపీని ఓడించే బల మైన ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతోనే ఎన్నికల అవగాహన ఉంటుందన్నారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని స్పష్టంచేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడు తూ.. ప్రైవేటు విమానాల ద్వారా హవాలా డబ్బు, బంగారు ఆభ రణాలు తరలుతున్న నేపథ్యంలో ప్రైవేటు విమానాలలో తనిఖీ చేపట్టాలని, వీటిని నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా? -
అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ జాతీయ సదస్సు
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ మహాసభల సందర్భంగా విజయవాడలో అక్టోబర్ 16న ‘సేవ్ నేషన్’ పేరు తో నిర్వహించే జాతీయ సదస్సుకు సీఎం కేసీఆర్‌తోపాటు తమిళనాడు, కేరళ, బిహార్ ముఖ్యమంత్రులు స్టాలిన్, పినరయి విజయన్, నితీశ్ కుమార్‌నూ ఆహ్వానిస్తున్నామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. వచ్చే నెల 14–18 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మహాసభ తరువాత తొలిసారిగా సీపీఐ నూతన రాష్ట్ర సమితి సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ సమితి సభ్యులు కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, దేశ రాజకీయాల్లో, విధానాల్లో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో విజయవాడలో నిర్వహించనున్న మహాసభలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మధ్య జాతీయస్థాయిలో ఐక్యత బలపడేందుకు ఈ మహాసభ ద్వారా ప్రయత్నం జరగనుందని తెలిపారు. సీపీఐ జాతీయ మహాసభకు 20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఉద్యమాల విషయంలో మొహమాటం లేదు: కూనంనేని ప్రజా సమస్యలపై ఉద్యమించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి మొహమాటం లేకుండా పోరాడతామని కూనంనేని సాంబశివరావు చెప్పారు. రాష్ట్రంలో మతతత్వ బీజేపీని నిలువరించేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతునిచ్చామని, అదే సమయంలో ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టంచేశారు. దేవరకొండ నియోజకవర్గంలో మహిళల శిరోముండనం ఘటనను వదిలిపెట్టబోమని, సాంఘిక దురాచారాలు, ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. -
శ్రీలంక తరహా సంక్షోభం దేశంలోనూ రావొచ్చు: సీపీఐ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘దేశంలోనూ శ్రీలంక తరహా ఆర్థిక, రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆ సమయంలో పుట్టుకొచ్చే ప్రజా ఆందోళనలకు నాయకత్వం వహించేందుకు వామపక్ష పార్టీలన్నీ సిద్ధంగా ఉండాలి. ఇందుకు సైద్ధాంతికంగా ఎర్ర జెండాలన్నీ ఏకం కావాలి..’ అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. మతో న్మాద బీజేపీని ఎదుర్కొవాలంటే సీపీఐ, సీపీఎంల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి పని చేయాలని అన్నారు. ఇందుకు 2 పార్టీల జాతీయ నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీపీఐ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభల్లో భాగంగా సోమవారం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. మతోన్మాద బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలి ‘నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసు కున్నాయి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమైంది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రజల మధ్య అంతరాలూ పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యమై, ఆశించిన స్థాయిలో ఉపాధి అవకాశాలు లేక యువత తీవ్రమైన అసహ నం, ఆగ్రహంతో రోడ్డెక్కుతోంది. మరోవైపు మోదీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలుబొమ్మగా మారారు. బహుళ మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారు. హిందూమత రాజ్యస్థాపనే లక్ష్యంగా చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. మతోన్మాద బీజేపీని, దాని వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనేందుకు ఎర్రజెండా పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని రాజా పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థల దుర్వినియోగం ‘మోదీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల హక్కులను హరిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, నేతలపై సీబీఐ, ఐటీ దాడులు చేయించి వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు లెప్టినెంట్ గవర్నర్, గవర్నర్ వ్యవస్థలను ఉపయోగించుకుంటోంది. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఇప్పటినుంచే ఏకమై పని చేయాలి..’ అని రాజా స్పష్టం చేశారు. ఐక్యత చాటుతాం: రామకృష్ణ కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన ఆవశ్యకతపై వామపక్ష మేధావులంతా చర్చించాలని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. అక్టోబర్‌లో విజయవాడ కేంద్రంగా నిర్వహించే జాతీయ మహా సభల సందర్భంగా వామపక్ష పార్టీలన్నీ భుజం భుజం కలిపి భారీ ర్యాలీ నిర్వహించడం ద్వారా ఐక్యతను చాటి చెబుతాయని చెప్పారు. సీపీఐ ప్రతిపాదనను సమర్థిస్తున్నా: తమ్మినేని సైద్ధాంతిక ప్రాతిపదికన కమ్యూని స్టులంతా ఏకం కావాలనే సీపీఐ ప్రతిపా దనను సమర్థిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలి పారు. మతోన్మాద బీజేపీకి ప్రత్యా మ్నా య శక్తిగా నిలబడే సత్తా కమ్యూనిస్టులకే ఉందన్నారు. మోదీ ప్రభుత్వం ఉన్మాదంతో, ఉద్వేగంతో ప్రజలను రెచ్చగొడు తోందని, ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమా దకారిగా మారిందని విమర్శించారు. సాయుధ పోరాటంతో బీజేపీకి సంబంధమే లేదు: సురవరం తెలంగాణ సాయుధ పోరాటానికి, బీజేపీకి సంబంధమే లేదని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీతో పాటు ఎంఐఎం, టీఆర్ఎస్లు కూడా తామే పోరాటం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. వాస్తవానికి ఈ పోరాటానికి పూర్తిగా కమ్యూనిస్టులే నాయకత్వం వహించారని తెలిపారు. ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే! -
బీజేపీ పాలనలో స్వేచ్ఛలేదు.. ప్రజాస్వామ్యానికి ముప్పు: సీపీఐ
మహారాణిపేట (విశాఖ దక్షిణ): దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రధాని మోదీని, బీజేపీని ఎదిరించినా, ప్రశ్నించినా వారిపై సీబీఐ, ఈడీ, ఎన్ఐఏలను ప్రయోగించి ఇబ్బందిపాల్జేస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. విశాఖ సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో శుక్రవారం సీపీఐ 27వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజా మాట్లాడుతూ బీజేపీ పాలనలో దేశంలో వివిధ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలేదని, అలాగే ఎవరికీ స్వేచ్ఛ లేదన్నారు. నేడు ప్రజాస్వామ్యానికి ముప్పు వచ్చే పరిస్థితి ఎదురైందన్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలో అన్ని పక్షాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలు ఒక్క తాటి మీదకు వస్తే కేంద్రంలో బీజేపీని గద్దె దించవచ్చన్నారు. ఉనికి కోసం చంద్రబాబు పాట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా త్వరలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీకి, బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఒకప్పుడు రాజకీయాలను శాసించిన చంద్రబాబు నేడు ఉనికి కోసం పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీఎస్‌ఎన్ మూర్తి సభకు అధ్యక్షత వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అనీరాజా, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు, సినీ నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇదీ చదవండి: Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్ -
ఆ 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి తథ్యం
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా ఓటమి చవిచూస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ ఓటమి ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థల పరిరక్షణకు ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా, బాలనర్సింహతో కలసి రాజా మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలో కొనసాగితే వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడి ఫాసిజానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఇలాంటి సంక్లిష్ట, సంక్షోభ పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీలు, వివిధ విపక్ష, ప్రాంతీయపార్టీలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం, సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా రాష్ట్రాల అధికారాలను కేంద్రం గుంజుకుంటోందని, బీజేపీని ఓడించకపోతే ఫెడరల్ వ్యవస్థకే ముప్పు అని పేర్కొన్నారు. రైతులు తమ సుదీర్ఘ పోరాటంతో మూడు వ్యవసాయ నల్లచట్టాలను ఉపసంహరింపచేసి మోదీ ప్రభుత్వాన్ని మోకాళ్లపై నిలబెట్టారన్నారు. బ్యాంక్ ఉద్యోగులు, కార్మికులు, పేదలు, వివిధ వర్గాల ఆందోళనలతో బీజేపీ ప్రభుత్వం, ఆరెస్సెస్ వ్యతిరేక పోరాట సంవత్సరంగా 2022 నిలవబోతోందన్నారు. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతావైఫల్యానికి కేంద్ర హోం మంత్రిత్వశాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగభృతి, ఉద్యోగ కల్పన వంటి హామీల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని చాడ సూచించారు. -
జైభీమ్: నాటి పోరాటం గుర్తొచ్చింది!
‘జైభీమ్’ సినిమా చూశాను... నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్‌లు లేవు. యువ లాయర్ల బాధ్యతను, సందేశాత్మక సంకేతాలను ‘జై భీమ్’ సినిమా సమాజానికి పంపింది. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఉపసంహరించు కోవాలన్న పోలీసు బాస్... నీ భర్త ఎటు రాడు... కనీసం పరిహారం తీసుకొని కోర్టు కేసు వెనక్కు తీసుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు చెంపపెట్టులా ఉంటుంది. నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా ఉన్నప్పుడు 37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది. నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ ఇల్లులేక ప్లాట్‌ఫారంపై పడుకునే అభాగ్యురాలు. ఒక రోజు రాత్రి బీట్ కానిస్టేబుల్స్ తమ లాఠీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు. లక్ష్మి పరుగెత్తుతుండగా పోలీసులు కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది. విషయం తెలియగానే మేమంతా ఘటనా స్థలానికి చేరుకున్నాం. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి నిరసన ప్రదర్శన ప్రారంభించాం. నిరసన 25 మందితోనే మొదలైనా, క్రమంగా వందలమంది జతకలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మరునాడు బంద్‌కు పిలుపునిచ్చాము. మేము బంద్ పిలుపు ఇచ్చిన రోజునే నాటి సీఎం ఎన్టీఆర్ తిరుమల పర్యటన ఉంది. ముందురోజు నడి రాత్రి కొందరు పోలీ సులు వచ్చి నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావు, ఎస్పీ ఆల్ఫ్రెడ్ నాతో మాట్లాడుతూ రేపటిబంద్ పిలుపును ఉపసంహరించుకోండి నగరంలో సీఎం పర్యటన ఉందన్నారు. నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. (చదవండి: వారి నిర్బంధంలో న్యాయముందా?) ఆ సమయంలో అధికారులు ఇద్దరూ నాతో.... చనిపోయిన లక్ష్మిది ఈ ప్రాంతం కాదు, ఆమె కోసం మీరు పోరాటం చేస్తే మీకూ, మీపార్టీకి వచ్చే లాభం ఏమిటి, మీపై కేసులు పడటం తప్ప అని వ్యాఖ్యానించారు. ‘మా ఉద్యమం వలన సామాన్యులు కూడా చైతన్యంతో, ధైర్యంగా నివసించగలరు. అధికారులు బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం’ అనేశాను. మరునాడు బంద్ జరిగింది. మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్ జైలులో వారంపాటు నిర్బంధించారు.. కానీ మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్, రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడటానికి ఊతం ఇచ్చింది. ‘జై భీమ్’ సినిమా చూస్తుంటే 37 ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమా రీళ్లలాగా నాకళ్ల ముందు కదులుతున్నాయి. (చదవండి: ఓట్ల డబ్బు పంపిణీలో సమానత్వం) - డాక్టర్ కె. నారాయణ వ్యాసకర్త సీపీఐ జాతీయ కార్యదర్శి -
సీపీఐ జాతీయ కార్యదర్శి రాజాకు అస్వస్థత
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు హాజరైన ఆయన శనివారం అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అతన్ని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. డి. రాజా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని, వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. -
ఎర్రజెండాకు దళిత ‘స్పృహ’!
గత 95 ఏళ్లుగా భారత కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా దళితులను నాయకత్వ స్థానాల్లోకి ఎదిగించని తరుణంలో డి. రాజాకు సీపీఐ అత్యున్నత స్థానం కట్టబెట్టడంతో కమ్యూనిస్టు ఉద్యమాన్ని సుదీర్ఘకాల పక్షపాతం నుంచి విముక్తి చేసినట్లయింది. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం చారిత్రాత్మక చర్య. విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎదిగిన ఈ దళిత నాయకుడి ఎంపిక వామపక్ష–అంబేడ్కర్ వాదుల్లో ఒక నూతన స్ఫూర్తిని కలిగించే చర్య. ఈ రెండు పక్షాలతో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం భవిష్యత్ ఐక్యతకు బలం చేకూరుస్తుంది కూడా. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన డి. రాజా అందరి ప్రశంసలకు అర్హుడు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రధాన కార్యదర్శిగా డి. రాజా నియామకం ఒక చారి త్రాత్మక చర్య. భారత జాతీయ కమ్యూనిస్టు నేతగానే కాకుండా, విజ్ఞత కలిగిన కమ్యూనిస్టుగా, సిద్ధాంతవేత్తగా, స్ఫూర్తిదాయక మూర్తిగా ఎది గిన దళిత నాయకుడు డి. రాజా. మండల్ అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు భారత రాజకీయ చరిత్రను మార్చివేసిన తర్వాత, వామపక్షాల నుంచి దళిత బహుజనులకు, కమ్యూనిస్టులకు మధ్య సాధికారిక స్వరంతో చర్చలు జరిపిన ఏకైక నేత డి. రాజానే. దామోదరం సంజీవయ్య తర్వాత కాంగ్రెస్ పార్టీలో సైతం పార్టీ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చిన చరిత్ర లేదు. భారతీయ జనతా పార్టీ బంగారు లక్ష్మణ్‌ని పార్టీ అధ్యక్షుడిగా ప్రోత్సహించింది కానీ ఆయన తన సొంత సామర్థ్యం ప్రాతిపదికన అత్యున్నత పదవికి ఎంపిక కాలేదన్నది అందరికీ తెలిసిందే. కానీ స్టింగ్ ఆపరేషన్‌లో కేవలం లక్షరూపాయలు తీసుకుంటూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్ చివరకు దాదాపుగా జైలులోనే మృతి చెందాల్సి రావడం విషాదకరం. భారత రాష్ట్రపతి పదవిలో అయిదేళ్ల పూర్తికాలం సౌఖ్యంగా గడిపిన ఏకైక దళిత నేత కె.ఆర్. నారాయణన్. ఈయన స్వతహాగా మేధావి. మరో దళిత నేత రామ్‌నాథ్ కోవింద్ ప్రస్తుతం రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్నారు కానీ ఆయన పదవీ విరమణ సమయానికి రాష్ట్రపతి పదవిపై, దేశ చిత్రపటంపై ఎలాంటి ముద్ర వేయనున్నారో చూడటానికి మనం వేచి ఉండాల్సిందే. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1962లో తొలిసారిగా విడిపోయింది. తర్వాత మావోయిస్టు గ్రూపుల చీలికలతో మరోసారి చీలి పోయింది. ఇలా పలుసార్లు కమ్యూనిస్టు పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. తదనంతర కాలంలో సభ్యుల పరంగా, ఎన్నికల పరంగా సీపీఎం పెద్దపాత్ర పోషించినప్పటికీ సీపీఐ కమ్యూనిస్టు సిద్ధాంత చుక్కానిగా కొనసాగుతూ వస్తోంది. చారిత్రక తప్పిదానికి సవరణ మండల్ ఉద్యమం, అంబేడ్కర్ భావజాలం భారతీయ దళిత–బహుజనుల సామాజిక, రాజకీయ ప్రతిపత్తిని మార్చివేసిన తర్వాత, దేశంలోని కమ్యూనిస్టు పార్టీలు నైతికంగా వెనుకంజ వేసి దెబ్బతిన్నాయి. 1925లో దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాత దాదాపుగా గత 95 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీల (సీపీఐ, సీపీఎం) ప్రధాన కార్యదర్శిగా ఒక్కరంటే ఒక్క దళితనేత కూడా ఎంపికైన చరిత్ర లేదు. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలతో సహా ఏ పాలకపార్టీ కూడా డి. రాజా వంటి నేతను తమ పార్టీల నిర్మాణంలో ఎదిగించని, రూపొందించని తరుణంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాకు అత్యున్నత స్థానం కట్టబెట్టడం అనేది కమ్యూనిస్టు ఉద్యమాన్ని పక్షపాతం, దురభిమానాల నుంచి విముక్తి చేసినట్లయింది. డి. రాజా ఇంతటి అత్యున్నత స్థానాన్ని సాధిం చుకున్నప్పటికీ, దీనికి గాను ఆయన పార్టీని నిజంగా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే సీపీఎం నేటివరకు ఒక్కరంటే ఒక్క దళిత్‌ని/ఆదివాసీని తన పొలిట్ బ్యూరోలోకి తీసుకోలేకపోయింది. కాబట్టే దళితులు, ఆదివాసులు సీపీఎం, ఆరెస్సెస్ మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని భావిస్తున్నారు. సీపీఎం లాగా, ఆరెస్సెస్ కూడా తన అత్యున్నత స్థానంలోకి ఒక దళితుడిని, ఆదివాసీని ప్రోత్సహించలేదు. (బంగారు లక్ష్మణ్ మినహాయింపు). కమ్యూనిస్టులు మాటల్లో కాకుండా చేతల్లో తమను తాము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దిగువ కులాలకు చెందిన ప్రజారాశులు.. ప్రతి ఒక్కరినీ వారి చేతల ద్వారానే అంచనా వేయగలిగినటువంటి తమ సొంత మేధావులను తయారు చేసుకున్నాయని కమ్యూనిస్టులు తప్పకుండా అవగాహన చేసుకోవాలి. కార్మికులు–అగ్రకుల నాయకత్వం కమ్యూనిస్టు ఉద్యమాలు ప్రజాసముద్రంలోని అలలు వంటి వారయినట్లయితే, దాని నేతలు ఆ అలల నుంచి పుట్టుకొచ్చిన నురుగు లాంటివారని చైనా ప్రజాతంత్ర రిపబ్లిక్ తొలి ప్రధానమంత్రి చౌఎన్‌లై పేర్కొన్నారు. కానీ భారతదేశంలో తొలినుంచి జరుగుతూ వచ్చింది ఏమిటంటే దళిత బహుజన సామాజిక బృందాలనుంచి కార్మికులుగా, కర్షకులుగా, కూలీలుగా అలలు పుట్టుకొస్తే, నాయకులు మాత్రం ఆ అలలతో సంబంధం లేని ఎగువ కులాల నుంచి పుట్టుకొచ్చారు. కనీసం తొలినాళ్లనుంచి పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కమ్యూనిస్టు నాయకత్వం దళిత బహుజన శ్రేణులనుంచి పుట్టుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ వారలా చేయలేదు. దీంతో కమ్యూనిస్టు పార్టీలోని ఎగువ కులాలకు చెందిన నాయకులు ఉద్దేశపూర్వకంగానే దళిత, ఆదివాసీ కార్యకర్తలను క్షేత్ర స్థాయిలోనే ఉంచి, అలలపైన నురగలాగా మారడానికి వారిని అనుమతించలేదన్న అభిప్రాయాన్ని కలిగించారు. ఈ క్రమంలో కార్మిక వర్గం వెలుపలి నుంచే మేధోనాయకత్వం పుట్టుకొస్తుందని చెప్పిన లెనిన్ సూత్రీకరణలపైనే భారతీయ కమ్యూనిస్టు నాయకులు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. ఉదాహరణకు భారతదేశంలోని బ్రాహ్మణ జనాభా ఎన్నడూ కమ్యూనిస్టు ఉద్యమ మద్దతుదారులుగా లేరు. కానీ కమ్యూనిస్టు మేధో నాయకులు మాత్రం బ్రాహ్మణులనుంచి వచ్చారు. బ్రాహ్మణులు మాత్రం ఎల్లప్పుడూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీతోనే కలిసి ఉండేవారు. ఎందుకంటే వీటి సంస్థాగత నిర్మాణాలు వారి సామాజిక–ఆధ్యాత్మిక హృదయానికి, ఆలోచనలకు అతి దగ్గరగా ఉండేవి మరి. దీనికి భిన్నంగా, దళిత్, ఓబీసీలకు చెందిన ప్రజానీకం కమ్యూనిస్టు పార్టీల పక్షాన్నే ఉండేవారు కానీ వీరినుంచి మేధోగత నాయకులు ఎదిగి వచ్చేవారు కాదు. బహుశా కమ్యూనిస్టు పార్టీల్లోని క్షేత్ర స్థాయి ప్రజానీకానికి తగిన విద్య, మేధో పరిపక్వత లేకపోవడం ఒక సమస్యే కావచ్చు. ఈ పరిమితి ఉన్నప్పటికీ, సాధారణ ప్రజా రాశులనుంచి నాయకులకు శిక్షణ నివ్వడంపై కమ్యూనిస్టు పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి ఉండాలి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ఉన్నత విద్యా సంస్థలలో అలాంటి చక్కటి మేధోవంతమైన యువత పుట్టుకొచ్చే సమయానికి, వాటిలో అంబేడ్కరిజం బలపడింది. దీంతో దళిత్, ఓబీసీలకు చెందిన యువత వామపక్ష భావాలపైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, కమ్యూనిస్టు పార్టీల్లోని అగ్రశ్రేణి నేతలు దిగువ కులాలనుంచి నాయకులు ఆవిర్భవించడానికి అనుమతించడం లేదన్న అనుమానం క్రమేణా వారిలో పెరుగుతూ వచ్చింది. అందుకే ఆనాటి నుంచి వారు అగ్రకుల కమ్యూనిస్టు నాయకులను అనుమానించడం మొదలుపెట్టారు. అయితే డి.రాజా సీపీఐలో అత్యున్నత స్థాయికి ఎదగడం అనేది వామపక్ష అంబేడ్కర్ వాదుల్లో ఖచ్చితంగా ఒక కొత్త వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ రెండు పక్షాలలో రాజా సజీవ సంబంధాలను కొనసాగించడం కూడా దీనికి కారణం కావచ్చు. ప్రతిభాపాటవాలతోనే ఉన్నతి పెరియార్ ఈవీఆర్ రామస్వామి కాలం నుంచి దిగువ కులాల నాయకత్వం బలంగా రూపొందిన సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్న తమిళనాడు నుంచి డి.రాజా పుట్టుకొచ్చారు. డీఎంకే దివంగత నేత ఎం. కరుణానిధి నాయీ బ్రాహ్మణ సామాజిక బృందం నుంచి ఎదిగివచ్చారు. (ఈయన పూర్వీకులు ఆలయ సంగీత విద్వాంసులుగా, గాయకులుగా జీవించేవారు) ఇప్పుడు డి. రాజా తమిళనాడులోని దళిత కమ్యూనిటీ నుంచి ఎదిగివచ్చారు. అయినంతమాత్రాన రాజా స్వీయ ప్రతిభను కానీ, మనసావాచా కమ్యూనిస్టు ఉద్యమాచరణకు అంకితం కావడాన్ని కానీ ఎవరూ తోసిపుచ్చలేరు. తన సొంత ప్రతిభాపాటవాలపై ఆధారపడి ఎదిగివచ్చిన రాజా అందరి ప్రశంసలకు అర్హుడు. తన సైద్ధాంతిక భూమికను వదులుకోకుండానే ఏ సామాజిక బృందంతోనైనా చర్చించగల, వ్యవహరించగల నిఖార్సయిన నేత డి. రాజా. ప్రత్యేకించి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణాల్లో స్పష్టంగా కనిపించే ఒంటెత్తువాదానికి ఆయన చాలా దూరం. పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు, బృందాలను ఐక్యపరచి నేపాల్ తరహా పంథాలో భారతదేశాన్ని నడిపించగల పరిపూర్ణ వ్యక్తిత్వం ఆయనది. కమ్యూనిస్టు ఉద్యమంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి సీపీఎం కూడా ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకుంటుందని ఆశిద్దాం. ప్రొ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త డైరెక్టర్, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీ -
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.రాజా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలంగా సీపీఐ జాతీయనేతగా ఉన్న డి. రాజా ఎన్నికను సీపీఐ జాతీయ మండలి సమావేశం ఆమోదించింది. 2012 నుంచి సురవరం సుధాకర్ రెడ్డి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. ఆయన పదవీకాలం మరో రెండేళ్లు ఉండగా అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో డి. రాజాను పార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శిగా డి.రాజాను ప్రతిపాదిస్తూ సురవరం ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్ని రాష్ట్రాల కార్యదర్శులు ఆమోదం తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా తప్పుకున్నప్పటికీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతానని సురవరం చెప్పారు. రాజా నాయకత్వంలో పార్టీ పురోగమిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్‌తో పాటు, ఒడిశాకు చెందిన యువ నాయకుడు రామకృష్ణ పండాను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు సురవరం తెలిపారు. మొత్తం 13 అంశాలపై సమావేశంలో తీర్మానాలు చేసి ఆమోదించినట్లు పేర్కొన్నారు. 72 ఏళ్ల వయసున్న డీ రాజా తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆ రాష్ట్రం నుంచే రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యువజన ఉద్యమాల నుంచి క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చారు. 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశారు.1995 నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఢిల్లీ నుంచి పని చేస్తున్నారు. ప్రస్తుతం రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. -
సీపీఐ కొత్త సారథి డి.రాజా
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సురవరం సుధాకర్‌రెడ్డి స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం సీపీఐ జాతీయ సమితి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ, జాతీయ సమావేశాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ ప్రధానకార్యదర్శిగా పార్టీ అత్యున్నత బాధ్యతలను సురవరం సుధాకర్‌రెడ్డి నుంచి డి.రాజా స్వీకరిస్తారు. పార్టీ అత్యున్నత పదవి కోసం డి.రాజాతో పాటు సీనియర్ నేతలు అతుల్ కుమార్ అంజాన్, అమర్జిత్ కౌర్ పేర్లను నాయకత్వం పరిశీలించింది. తమిళనాడు నుంచి ఎంపీగా కొనసాగుతున్న రాజా రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగియనుంది. దళిత వర్గ నేతగా, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా ఉండడంతో జాతీయస్థాయిలో రాజకీయ పార్టీల అగ్రనేతలతో ఆయనకు పరిచయాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొత్త రక్తం నింపడంతో పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే వ్యూహంలో భాగంగానే రాజా వైపు జాతీయ సమితి మొగ్గు చూపినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుపొందడంతో పాటు దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, క్రియాశీలంగా మార్చడం వంటివి రాజాకు సవాళ్లేనని పరిశీలకులు అంటున్నారు. సురవరం ఎందుకు వైదొలిగారంటే.. ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సురవరం సుధాకర్ రెడ్డి(77) కోరినట్టు పార్టీ వర్గాల సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల వరకే పదవిలో ఉంటానని పార్టీకి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ›ప్రధాన కార్యదర్శిగా 2012లో బాధ్యతలను చేపట్టిన సురవరం, వరసగా మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2021 వరకు ఉంది. -
‘అక్కడ అమలవుతుంది కానీ.. కేరళలో కాదా’
న్యూఢిల్లీ : శబరిమల ఆలయం విషయంలో కేంద్రం, బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. శని సింగ్నాపూర్ విషయంలో కోర్టు తీర్పును అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కేరళలో శబరిమల అంశాన్ని వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని.. ఆయన కంటే కూడా దావూద్ ఇబ్రహీం నయమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో ఆరెస్సెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ కలిసి అరాచకం, అల్లర్లు సృష్టిస్తున్నాయని.. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని నారాయణ పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబును వ్యతిరేకిస్తాం కాంగ్రెస్‌ది రీటైల్ అవినీతి అయితే, బీజేపీది హోల్‌సేల్ అవినీతి అని నారాయణ దుయ్యబట్టారు. రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. జాతీయ స్థాయిలో అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో చంద్రబాబును వ్యతిరేకిస్తున్నా, తెలంగాణలో మాత్రం టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతం అని పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌కు దాసోహమంటారా?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్‌లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి. స్థానిక ఎన్నికలతోసహా లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తీర్మానాలు... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాలమల్లేశ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్ చేసింది. స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు. -
టీఆర్ఎస్ ప్రచారంలో వాస్తవం లేదు: నారాయణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వమైనా నిర్ణయా లు తీసుకోగలుగుతుం దా అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ప్రజాఫ్రంట్ అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి రాహుల్‌గాంధీ, ఏపీ నుంచి చంద్రబాబు చక్రం తిప్పుతారంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. బుధవారం మగ్దూమ్‌భవన్‌లో పార్టీనాయకులు అజీజ్‌పాషా, బాలమల్లేశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో 5–10 శాతం మంది మాత్రమే సంక్షేమపథకా లు, రైతుబంధు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నం దున, మిగతా వారి ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడే అవకాశముందన్నారు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా కేంద్రంలో మోదీ సర్కార్‌కు చెక్ పెడితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టు అవుతుందన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ నేతలకు చెందిన కాలేజీలకు ఏఐసీటీయూ అనుమతినిచ్చేలా చేశారన్నారు. ఈ కాలేజీల నుంచి టీఆర్ఎస్కు ముడుపులు అందాయని నారాయణ ఆరోపించారు. -
కేసీఆర్‌ను ఓడించడం ద్వారా మోదీని దింపొచ్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించడం ద్వారా కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్‌ను ఓడించవచ్చని భావిస్తున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్పారు. బీజేపీ బారినుంచి దేశాన్ని రక్షించేందుకు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ వ్యతిరేకశక్తులను ఏకతాటిపైకి తెచ్చే కృషి జరుగుతోందని ఆయన వెల్లడించారు. లోపాయికారీ ఒప్పందాన్ని కొనసాగిస్తూనే పైకిమాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న టీఆర్ఎస్–బీజేపీలది ‘‘ముద్దులాట–గుద్దులాట’’చందంగా ఉందని ఎద్దేవా చేశారు. మగ్దూమ్ భవన్లో పార్టీ నేతలు అజీజ్‌పాషా, పల్లావెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఐదుశాతం కూడా అమలు కాలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి–టీఆర్ఎస్ల మధ్యే ప్రత్యక్షపోరు నెలకొందన్నారు. -
‘ఓడిపోతున్నట్టు కేసీఆర్ అంగీకరించారు’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను ఓడిపోతున్నట్టు అంగీకరించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిపోతే ఇంట్లో పడుకుంటామని కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. అలా అయితే ఫలితాల వరకూ ఎదురుచూడటం ఎందుకని, ఇప్పుడే రాజకీయాలకు సెలవు చెప్పి ఇంట్లోనే పడుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఆయన నోటి నుంచి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటానని చెప్పిన రోజే ఆయన రాజకీయ జీవితం అయిపోయిందని నారాయణ పేర్కొన్నారు. మేడ్చల్ సభలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో మహాకూటమి నేతలు వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. సోనియా పర్యటనతో కేసీఆర్ భయాందోళనకు గురువుతున్నారని చెప్పారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదని, అలాంటి జనాలను మోసం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని పేర్కొన్నారు. -
ప్రధాని మోదీ కొత్తడ్రామాకు తెరలేపారు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని, రోజుకో నిబంధన పేరుతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలను హైదరాబాద్‌లోని ముగ్ధుం భవన్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అపరిపక్వతతో నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. సీనియారిటీ, నిబంధనలు పాటించకుండా ఆర్మీ, సీబీఐ, రా చీఫ్‌లను నియమిస్తున్నారని విమర్శించారు. దేశంలో గోహత్య పేరుతో దళితులపై దాడులు జరిగాయని అన్నారు. త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలని సురవరం అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న జాతీయ కౌన్సిల్ సమావేశాలలో వివిధ రాష్ట్రాల నుంచి 125 మంది ప్రతినిధులు పాల్గొంటారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిణామాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, దళితులు-మైనారీటీలపై దాడులు, తాజా రాజకీయ, ఆర్దిక పరిస్థితులపై చర్చిస్తారు. ఫెడరల్ క్యాస్ట్రో, జయలలిత, సీపీఐలో వివిధ హోదాల్లో పనిచేసి చనిపోయిన కామ్రేడ్లకు ఎంపీ డి.రాజా సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టారు. -
మే 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా ధర్నాలు: సురవరం
హైదరాబాద్ : కరువుపై తమ పార్టీ మే 5,6 తేదీల్లో దేశ్యవ్యాప్తంగా ధర్నాలు చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... కరువు సహాయక చర్యల్లో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. అలాగే సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... కరువుపై సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే తప్ప ప్రభుత్వాలు కదలడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాడా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
'హైదరాబాద్‌లో ఆంధ్ర ఓటర్లు కావాలి గానీ ...'
విజయవాడ : దేశంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ డిమాండ్ చేశారు. గురువారం విజయవాడలో నారాయణ మాట్లాడుతూ... కేంద్రం చేతుల్లో రాష్ట్ర గవర్నర్లు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ఇదే విషయం మరోసారి స్పష్టమైందని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ కులంపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం దారుణమని నారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఓటర్లు కావాలి గానీ... ఆంధ్ర విద్యార్థి చినిపోతే మాత్రం పట్టించుకోరా... అంటూ చంద్రబాబుపై నారాయణ నిప్పులు చెరిగారు. మంత్రి రావెల కిషోర్ బాబును పంపి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. రాజధాని రైతులను చంద్రబాబు బ్లాక్మెయిల్ ధోరణిలో బెదిరిస్తున్నారని విమర్శించారు. రైతులను ఒప్పించి... రాజధాని నిర్మించుకోవాలని చంద్రబాబుకు సీపీఐ నారాయణ సూచించారు. -
'దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి'
హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకే అనుకూలమని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లోని ముగ్ధుం భవన్లో సీపీఐ 91వ వ్యవస్థాపక వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల పునరేకీకరణ వల్లే ప్రజలకు లాభమని ఆయన స్పష్టం చేశారు. -
బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి
- కేంద్రం తీరు సరికాదు - సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ మండిపాటు చిగురుమామిడి: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపి ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేటాయింపులు జరిపిందని.. రెండు కొత్తరాష్ట్రంపై ఇంత వివక్ష ప్రదర్శించడం దారుణమని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. దీనిపై పార్టీ ఆందోళనలు చేపడుతుందని చెప్పారు. బడ్జెట్ పూర్తిగా కా ర్పొరేట్ సంస్థలకు ఊతమిచ్చేదిగా ఉందని, నిత్యావసర సరుకులపై పన్ను పెంచేలా ఉందని మండిపడ్డారు. మండలంలోని రేకొండలో శుక్రవారం దివంగత సీపీఐ నాయకుడు, మాజీ ఎంపీపీ చాడ ప్రభాకర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఈ సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ లోని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదని విమర్శించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేం దుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్ హామీలు నెరవేర్చాలి మండలంలోని రేకొండలో చాడ విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కోరారు. పంట రుణాల మాఫీ పై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని, వృద్ధులు, వికలాంగుల పింఛన్లు ఎప్పుడు పెంచుతారో చెప్పడం లేదని విమర్శించారు. ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల సాగు భూమి ఇస్తామని.. మండలానికో గ్రామాన్ని ఎంపిక చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతకు ముందు అర్హుల జాబితా రూపొందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి హోదాలో తొలిసారి గ్రామానికి వచ్చిన చాడను రేకొండవాసులు సన్మానించారు. పార్టీ జిల్లా, మండల కార్యదర్శులు నారాయణ, అందె స్వామి, ఎంపీపీ తాడూరి కిష్టయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.