
'దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయి'
హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకే అనుకూలమని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లోని ముగ్ధుం భవన్లో సీపీఐ 91వ వ్యవస్థాపక వార్షికోత్సవ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ... దేశంలో మతోన్మాదశక్తులు పేట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల పునరేకీకరణ వల్లే ప్రజలకు లాభమని ఆయన స్పష్టం చేశారు.