న్యూఢిల్లీ : శబరిమల ఆలయం విషయంలో కేంద్రం, బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. శని సింగ్నాపూర్ విషయంలో కోర్టు తీర్పును అమలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం, కేరళలో శబరిమల అంశాన్ని వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని.. ఆయన కంటే కూడా దావూద్ ఇబ్రహీం నయమంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేరళలో ఆరెస్సెస్, బీజేపీ, విశ్వహిందూ పరిషత్ కలిసి అరాచకం, అల్లర్లు సృష్టిస్తున్నాయని.. దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని నారాయణ పిలుపునిచ్చారు.
ఏపీలో చంద్రబాబును వ్యతిరేకిస్తాం
కాంగ్రెస్‌ది రీటైల్ అవినీతి అయితే, బీజేపీది హోల్‌సేల్ అవినీతి అని నారాయణ దుయ్యబట్టారు. రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా.. జాతీయ స్థాయిలో అందరూ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీలో చంద్రబాబును వ్యతిరేకిస్తున్నా, తెలంగాణలో మాత్రం టీడీపీతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నది అప్రస్తుతం అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment