
సాక్షి, హైదరాబాద్ : సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో జరుగుతున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాలకు హాజరైన ఆయన శనివారం అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే అతన్ని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. డి. రాజా ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని, వైద్య చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు.