హైదరాబాద్ : కరువుపై తమ పార్టీ మే 5,6 తేదీల్లో దేశ్యవ్యాప్తంగా ధర్నాలు చేస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... కరువు సహాయక చర్యల్లో ఈ ప్రభుత్వాలు విఫలమయ్యాయని సుధాకర్రెడ్డి ఆరోపించారు.
అలాగే సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి మాట్లాడుతూ... కరువుపై సుప్రీంకోర్టు అక్షింతలు వేస్తే తప్ప ప్రభుత్వాలు కదలడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చాడా వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు.