హన్మకొండ: ‘నీ ఫాంహౌజ్, ఇల్లు అమ్ముకో.. అంతే తప్ప ఆర్టీసీ నీ సొంత ఆస్తి కాదు.. అందులో కేంద్ర వాటా ఉంది. 31 శాతం కేంద్రం వాటా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటే ఊరుకుంటారా.? అని సీఎం కేసీఆర్‌కు సీపీఐ నేత కె.నారాయణ హెచ్చరించారు. కార్మికులకు విధుల్లో చేరడానికి నిర్దేశించిన సమయం కార్మికులకు డెడ్ లైన్ కాదు,. అది సీఎం కేసీఆర్‌కేనని ఉద్ఘాటించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. ప్రైవేట్ బస్సులు నడపలేరని, నడిపితే తగుల బెడుతామని నారాయణ హెచ్చరించారు.
మంగళవారం హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డితో కలసి నారాయణ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వంలో ఇంటి కొడుకు కంటే ఇంటి అల్లుడి పెత్తనం ఎక్కువైందని నారాయణ దుయ్యబట్టారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌ని పువ్వాడ అజయ్ అని పిలవలేకపోతున్నామని, పువ్వాడ అంటే సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు గుర్తుకువస్తారని నారాయణ అన్నారు. అలాంటి వంశంలో పువ్వాడ అజయ్ చెడ పుట్టారని విమర్శించారు.
ప్రైవేట్ బస్సులు నడిపితే తగులబెడతాం
Published Wed, Nov 6 2019 3:20 AM | Last Updated on Wed, Nov 6 2019 7:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment