
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
దళితున్ని సీఎం చేస్తే చెవి కోసుకుంటానని..కేసీఆర్ మెడ నరుక్కుంటారా అని ఆయన ప్రశ్నించారు
సాక్షి, న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు దళితున్ని సీఎం చేస్తే చెవి కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సవాల్ విసిరారు. అలా చేయకపోతే కేసీఆర్ మెడ నరుక్కుంటారా అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఓడించేందుకు అన్ని రాజకీయ శక్తులు ఏకం కావాలని కోరారు.
గడువుకు ముందే అసెంబ్లీని రద్దు చేయటం అంటే ప్రజలను అవమానించటమేనని అన్నారు. ఎన్నికల కమిషన్‌తో సంప్రదింపులు జరిపి అసెంబ్లీని రద్దు చేశామనటం ఎంతవరకు కరెక్టని, ఎన్నికల కమిషన్ కంటే ముందే ఎన్నికల ప్రక్రియ ప్రకటించటంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ దీనికి జవాబు చెప్పాలన్నారు.