హైదరాబాద్ ను యూటీ చేస్తే ఒప్పుకోం: నారాయణ
భద్రాచలం ప్రాంతం తెలంగాణలో అంతర్భాగం అని జీవోఎం సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే నారాయణ తేల్చిచెప్పారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే ఒప్పుకోం అని నారాయణ హెచ్చరించారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలోని సీమాంధ్రులకు భయాందోళన కలిగించింది అని నారాయణ ఆరోపించారు. సీమాంధ్రుల భయాందోళన తొలగించే బాధ్యత కాంగ్రెస్‌దేనని ఆయన అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి ఆయన సూచించారు.
10 ఏళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంగీకారమే, చిన్న సమస్యలను చూపి విభజనను అడ్డుకోవద్దు అని ఆయన అన్నారు. విజయవాడ నుంచి ఒంగోలు మధ్య ఎక్కడైనా కొత్త రాజధాని కట్టుకోవచ్చు అని నారాయణ సలహా ఇచ్చారు.