గుజరాత్ ముఖ్యమంత్రి, తమ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్రమోడీపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అవాకులు, చెవాకులు పేలడం మానాలని బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి సలహా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తి హుందాతనం నేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. నరేంద్ర మోడీని కల్లుతాగిన కోతి అనడం ఏం సంస్కారమని ప్రశ్నించారు.
నారాయణ నోరును సీపీఐ కార్యకర్తలు అదుపులో ఉంచాలని, అందుకు అవసరమైతే ఒక ట్యూటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. సీపీఐ కార్యకర్తలు ఆయన నోటిని శుద్ధి చేయకపోతే తమ పార్టీ కార్యకర్తలే ఫినాయిల్‌తో శుభ్రం చేస్తారని ఇంద్రసేనారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కూడా నారాయణ అనేక సందర్భాలలో నోరు జారి క్షమాపణలు చెప్పారని గుర్తుచేశారు. కమ్యూనిస్టులంటే నచ్చనివారు సైతం ఆ పార్టీనేతల హుందాతనాన్ని, నైతికతను ప్రశంసిస్తుంటారని, నారాయణ మాత్రం అటువంటి వారి పరువు తీస్తున్నారని ధ్వజమెత్తారు.
నారాయణకు భాష నేర్పండి: ఇంద్రసేనారెడ్డి
Published Fri, Sep 13 2013 9:25 PM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement