సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకంపై కాంగ్రెస్.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో, రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.
వివరాల ప్రకారం.. గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకంపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పీసీసీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ నిరంజన్.. సీఈసీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడి వ్యక్తిని త్రిపుర గవర్నర్‌గా నియమించడం సరికాదని కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొంది. ఇది ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే చర్య అని తెలిపింది. ఈ క్రమంలో గవర్నర్‌గా ఇంద్రసేనారెడ్డి నియామకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్.. సీఈసీని కోరింది.
ఇదిలా ఉండగా.. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా, ఒడిశా గవర్నర్‌గా బీజేపీ నేత, జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్‌దాస్ నియమిస్తూ కేంద్రంలోకి బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇక, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment