
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు డాక్టర్ కె.నారాయణ ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజును అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడించాలని చూస్తోందని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి జె.సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఇటీవల ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను అర్థం చేసుకోవాలన్నారు. సీబీఐ బీజేపీ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారిందని నారాయణ మండిపడ్డారు. పార్టీ సమితి సమావేశాలకు గుంటూరు జిల్లా నుంచి వస్తున్న సీపీఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్‌ను పోలీసులు అడ్డుకోవడాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. 11న సీపీఐ నేతలు టిడ్కో ఇళ్లను సందర్శించనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment