తాండూరు రూరల్/ చేవెళ్ల రూరల్/ ఆలంపల్లి, న్యూస్‌లైన్: పేద ప్రజల కోసం మళ్లీ భూపోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ చేవెళ్ల, ఆలంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సెజ్‌ల పేరుతో పేదలనుంచి వేల ఎకరాలను తీసుకుందని, వాటిలో ఎలాంటి ఫ్యాక్టరీలు నిర్మించలేదని అన్నారు. వాటిని తిరిగి రైతులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను యూటీ చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం రావణకాష్టంగా మారిందని, ఇందుకు కాంగ్రెస్ తీరే కారణమని అన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, నిత్యావసరాల ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. జనాలకు కొట్లాట పెట్టి మంత్రులు దావత్‌లు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 17న తెలంగాణ సాయుధ వారోత్సవాల సందర్భం గా హైదరాబాద్‌లో బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట సీపీఐ నాయకులు పుస్తకాల నర్సింగ్‌రావు, రామస్వామి, ప్రభులింగం, యాదయ్య, ఎం.బాలయ్య, సత్యనారాయణ, గోపాల్‌రెడ్డి, విద్యార్థి టీజేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ శుభప్రద్‌పటేల్, టీఆర్‌ఎస్ కార్మికవిభాగం అధ్యక్షుడు కృష్ణయ్య పాల్గొన్నారు.
కార్మికుల సమ్మెకు సంఘీభావం
తాండూరు మండలం మల్కాపూర్ శివారు ఇండియా సిమెంట్ లిమిటెడ్(ఐసీఎల్) కర్మాగారంలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం తొమ్మిదో రోజుకు చేరింది. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తొలగించిన కాంట్రాక్టు కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రమేష్ మాట్లాడుతూ.. కార్మికుల వెన్నంటి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాల మల్లేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జంగన్న, సీపీఐ డివిజన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఫిర్యాదు
సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న స్థానికులను తొలగించి ఇతర ప్రాంతాల వారిని నియమించుకుంటున్న ఐసీఎల్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఎస్పీ రాజకుమారికి ఫిర్యాదు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలిస్తామని చెప్పిన యాజమాన్యం ఇప్పుడు స్థానికులను కాదని ఇతర ప్రాంతాలకు చెందిన వారిని నియమించుకుంటోందన్నారు.
మళ్లీ భూపోరాటం
Published Fri, Sep 13 2013 12:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement