టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. ఈ షో వల్ల ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. "అంగరంగ వైభవంగా బిగ్‌బాస్ షోను ప్రారంభించారు. అది చూస్తుంటే హిమాలయంలో ఉన్న సాంస్కృతిక సంఘాన్ని తీసుకువచ్చి ఈ మురికి కుంటలో పడేసినట్లు ఉంది. విజయ్ మాల్యా జీవించే భవనాలు ఎంత విలాసంగా ఉన్నాయో, అంతకు మించి బిగ్‌బాస్ హౌస్ ఉంది. యువతీ యువకుల్ని తీసుకొచ్చి అందులో పెట్టారు. వందరోజుల పాటు ఇంట్లోనే పెడతారట. (బిగ్‌బాస్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్!)
నాగార్జున ఓ యువకుడిని(అభిజిత్) పిలిపించి.. ముగ్గురు సినిమా హీరోయిన్ల ఫొటోలను చూపించి వారి గురించి చెప్పమంటాడు. అప్పుడా యువకుడు ఒకమ్మాయిని ముద్దు పెట్టుకుంటా, ఒకమ్మాయితో డేటింగ్ చేస్తా, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటాడు. ఇదేనా యువతీయువకులకు మీరిచ్చే సందేశం. 100 రోజుల పాటు లోపలే ఉంచి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయడం ఘోరం. ఇలా అనైతిక చర్యలకు పాల్పడటాన్ని మేము ఖండిస్తున్నాం. కళామతల్లికి అన్యాయం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. కోట్ల మంది ప్రజలను టీవీ ముందు కూర్చోబెడుతూ సాంస్కృతిక దోపిడీ జరుగుతోంది. ఇలాంటి అనైతిక షోలను ప్రజలు ఆదరించవద్దు" అని నారాయణ పిలుపునిచ్చారు. (బిగ్‌బాస్: ఒక్క డైలాగ్‌తో తేల్చేసిన గంగవ్వ)
Comments
Please login to add a commentAdd a comment