ఏలూరు(ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ :
ప్రధాని మన్మోహన్‌సింగ్ అమెరికాకు సేవ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పవర్‌పేటలోని కాశీ విశ్వేశ్వర కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం ఆయన పార్టీ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. నారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ బొగ్గు కుంభకోణంలో అమెరికా భాగస్వామిగా ఉందన్నారు. అమెరికాలో కాలుష్యం పెరుగుతోందని బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తిని ఆపివే శారన్నారు. అక్కడ ఉన్న బొగ్గును మన దేశానికి దిగుమతి చేసుకుని కాలుష్యాన్ని పెంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. అమెరికా లో మూసివేసిన ఫార్మా సంస్థలను దేశంలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మందులను అక్కడకు పంపుతున్నార న్నారు. అణు ఒప్పందాన్ని వ్యతిరేకిం చినా పార్లమెంట్ సభ్యులకు డబ్బులి చ్చి ఓట్లు కొన్నారని, రూ.10 లక్షల కోట్ల ఆర్థిక అంశం దీంతో ముడిపడి ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మర్చంట్ పవర్ పాలసీని అమలు చేయడం కారణంగా సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకుంటున్నాయన్నా రు. దీనికి ల్యాంకో కంపెనీ ఉదాహరణ ని విమర్శించారు.
వాల్ మార్ట్ కంపెనీలు దేశంలో ఏర్పాటు చేయడం చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారన్నా రు. గ్యాస్ ధరలు పెంచడాన్ని త ప్పుబట్టారు. శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్‌గా సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ వ్యవహరించారు. ముందుగా కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని రాష్ర్ట సమితి సభ్యుడు నెక్కంటి సుబ్బారావు ఆవిష్కరించారు. సభలో బండి వెంకటేశ్వరరావు, కె.కృష్ణమాచార్యులు ప్రసంగించారు. పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అమెరికా సేవలో ప్రధాని మన్మోహన్
Published Sat, Jan 4 2014 3:18 AM | Last Updated on Tue, Oct 9 2018 4:27 PM
Advertisement
Advertisement