PM Manmohan Singh
-
మాటల గారడే.. ముందుచూపు లేదు!
ఉపాధి కల్పనకు ఊతమేది?: విపక్షం దార్శనిక, ప్రగతిశీల బడ్జెట్: బీజేపీ న్యూఢిల్లీ : బడ్జెట్ పేదల అనుకూలమని ప్రభుత్వం చెప్పడం ఒట్టి మాటల గారడేనని విపక్షం మండిపడింది. ఉత్తుత్తి హామీలతో రైతులను మోసం చేయలేరని హెచ్చరించింది. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం వంటి తీవ్ర సమస్యలకు పరిష్కారం దిశగా తక్షణ ఉపాధి అవకాశాల కల్పనలో బడ్జెట్ విఫలమైందని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ తదితర పార్టీలు మండిపడ్డాయి. సామాన్యులను గాలికొదిలేసి పారిశ్రామికవేత్తలకు, విదేశీ పెట్టుబడిదారులకు పెద్దపీట వేశారని, నల్లధనవంతులకు మేలు చేశారని దుయ్యబట్టాయి. ప్రభుత్వానికి పెద్ద ఆలోచనేదీ లేదని మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ విమర్శించారు. ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని వ్యర్థం చేసుకుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రెండేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం పల్లెసీమలను, సాగును నిర్లక్ష్యం చేసిందని మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ధ్వజమెత్తారు. ‘సంస్కరణ అంటే మార్కెట్ శక్తులను, ఉత్పత్తి మార్కెట్లను సంస్కరించడం. అలాంటిది బడ్జెట్లో కనిపించలేదు. ప్రభుత్వం హౌజ్‌కీపింగ్, అకౌంటింగ్‌కే పరిమితమైంది’ అని అన్నారు. అయితే బడ్జెట్ ముందుచూపుతో, ప్రగతిశీలంగా ఉందని అధికార బీజేపీ కొనియాడింది. రైతులు, పేదలు, యువత సాధికారతకు ఇది బాటలు వేసిందని కొనియాడింది. కలగూరగంపలా.. బడ్జెట్ కలగూరగంపలా ఉంది. గొప్ప ఆలోచనేదీ లేదు. అనవసర విమర్శలకు ప్రాధాన్యమిచ్చారు. ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడం అసాధ్యం. ఎలా సాధ్యం చేస్తారో చెప్పలేదు ఆ లక్ష్యం నెరవేరాలంటే ఏదేళ్లపాటు విదేశీ ఆదాయం ఏటా 14 శాతం పెరగాలి. -మన్మోహన్సింగ్(మాజీ ప్రధాని) కార్పొరేట్లకు లక్షల కోట్లు.. లక్షల కోట్లను కార్పొరేట్ల కోసం, బిల్డర్ల కోసం కేటాయించారు. సామాన్యుల, మధ్యతరగతి ప్రజల కలలను భగ్నం చేశారు. -నవాబ్ మాలిక్(ఎన్సీపీ) దార్శనికత లేదు బడ్జెట్లో దార్శనికతలేదు. అన్నీ ఉత్తుత్తి హామీలు. పరోక్ష పన్నులతో సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం పడుతుంది. ప్రజలపైకంటే విదేశీ పెట్టుబడులపైనే ఎక్కువ దృష్టి సారించారు. -సీతారాం ఏచూరి (సీపీఎం ప్రధాన కార్యదర్శి) మధ్యతరగతిని మోసం చేశారు రైతుల, మధ్యతరగతి ప్రజల ఆందోళనను పట్టించుకోలేదు. వారిని మోసం చేశారు. పారిశ్రామికవేత్తల రుణాలు మాఫీ చేసినట్లే, రైతుల రుణాలను ఎందుకు మాఫీ చేయలేదు? తమకు ఓట్లేసిన మధ్యతరగతిని మోదీ వంచించారు. -అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ సీఎం, ఆప్ నేత) కార్పొరేట్ల బడ్జెట్ బడ్జెట్.. కార్పొరేట్లు, విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న ఎన్డీయే ఆర్థిక విధానానికి తగ్గట్టే ఉంది. వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తామని చెబుతూనే ఎరువుల సబ్సిడీని తగ్గించారు. -డి. రాజా (సీపీఐ జాతీయ కార్యదర్శి) నిరాశపరచింది మోడీ బడ్జెట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. నల్లధనవంతులకే మంచిరోజులని హామీ ఇచ్చారు. బిహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇస్తామన్న రూ. 1.25 లక్షల కోట్ల ఊసే ఎత్తలేదు. -నితీశ్ కుమార్(బిహార్ సీఎం, జేడీయూ) అందరి బడ్జెట్ ఇది దార్శనికత, ప్రగతిశీల బడ్జెట్. అందరి బడ్జెట్. పోర్టులు, రైల్వే, విమానాశ్రయాలు, ఆరోగ్యం వంటి ఎన్నో రంగాలకు ప్రాధాన్యం దక్కింది. ప్రధాని నినాదం ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ ప్రతిఫలించింది. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే కలను నెరవే ర్చేలా ఉంది. - రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య (కేంద్ర మంత్రులు) మంచి బడ్జెట్ ఇప్పటివరకూ నేను చూసిన బడ్జెట్లలో ఇదొక మంచి బడ్జెట్. విస్మరణకు గురయ్యే సాగుకు, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం సంతోషంగా ఉంది. దేశాన్ని శక్తిమంతం, సుసంపన్నం చేయడానికి ప్రధాని, ఆర్థిక మంత్రి అనుసరిస్తున్న వైఖరికి ఇది నిదర్శనం. -ఎల్కే అద్వానీ(బీజేపీ అగ్రనేత) నిర్దిష్ట పథకాల్లేవు బడ్జెట్లో పరిమళం లేదు. నిర్దిష్ట పథకాలను ప్రకటించలేదు. గతంలో ఇచ్చిన హామీల అమలు గురించి చెప్పలేదు. - జయలలిత, తమిళనాడు సీఎం మోదీ.. మొద్దు విద్యార్థి బడ్జెట్ పరీక్షలో మోసం, అబద్ధాలకుగాను బహిష్కరణకు గురైన మొద్దు విద్యార్థి మోదీ. లోక్‌సభ ఎన్నికల నాటిహామీలను ఆయన నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. నల్లధనం తీసుకురాకుండా నల్లధనవంతులకు మేలు చేశారు. -లాలూ ప్రసాద్ యాదవ్(ఆర్జేడీ చీఫ్) -
ముగిసిన మన్మోహన్ శకం
-
ప్రధానికి సోనియా వీడ్కోలు విందు
-
తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ ఆగ్రనేతలు
-
కొత్త పార్టీపై అళగిరి నో కామెంట్
న్యూఢిల్లీ: డీఎంకే అధినేత కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే అళగిరి.. ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారు. మర్యాదపూర్వకంగానే ప్రధానమంత్రిని కలిసినట్టు అళగిరి చెప్పారు. 2009 నుంచి 2013 వరకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపానని వెల్లడించారు. డీఎంకే తనకు ఎంపీ టిక్కెట్ నిరాకరించిన నేపథ్యంలో సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించేందుకు అళగిరి నిరాకరించారు. అయితే రానున్న ఎన్నికల్లో కీలకపాత్ర పోషిస్తానని చెప్పారు. ఎటువంటి పాత్ర పోషిస్తాననేది ఇప్పుడే వెల్లడించబోనని అన్నారు. తన మద్దతుదారులతో మాట్లాడిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటానని చెప్పారు. తండ్రి, సోదరుడిపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అళగిరి.. ప్రధానమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ప్రధానితో రాహుల్ గాంధీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి ముందు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. సమావేశం వివరాలు వెల్లడికాలేదు. కోర్ కమిటీ సమావేశంలో అవినీతి వ్యతిరేక బిల్లుపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. దీనిలో చేపట్టాల్సిన సవరణలపై సమాలోచనలు జరిపినట్టు సమాచారం. పార్లమెంట్లో పెండింగ్‌లో ఉన్న పలు కీలక బిల్లులపై కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపినట్టు తెలిసింది. సోనియా గాంధీ, టెలికం మంత్రి కపిల్ సిబాల్, వి. నారాయణ స్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
అమెరికా సేవలో ప్రధాని మన్మోహన్
ఏలూరు(ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : ప్రధాని మన్మోహన్సింగ్ అమెరికాకు సేవ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు పవర్‌పేటలోని కాశీ విశ్వేశ్వర కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం ఆయన పార్టీ రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. నారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ బొగ్గు కుంభకోణంలో అమెరికా భాగస్వామిగా ఉందన్నారు. అమెరికాలో కాలుష్యం పెరుగుతోందని బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తిని ఆపివే శారన్నారు. అక్కడ ఉన్న బొగ్గును మన దేశానికి దిగుమతి చేసుకుని కాలుష్యాన్ని పెంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. అమెరికా లో మూసివేసిన ఫార్మా సంస్థలను దేశంలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మందులను అక్కడకు పంపుతున్నార న్నారు. అణు ఒప్పందాన్ని వ్యతిరేకిం చినా పార్లమెంట్ సభ్యులకు డబ్బులి చ్చి ఓట్లు కొన్నారని, రూ.10 లక్షల కోట్ల ఆర్థిక అంశం దీంతో ముడిపడి ఉందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మర్చంట్ పవర్ పాలసీని అమలు చేయడం కారణంగా సంస్థలు విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకుంటున్నాయన్నా రు. దీనికి ల్యాంకో కంపెనీ ఉదాహరణ ని విమర్శించారు. వాల్ మార్ట్ కంపెనీలు దేశంలో ఏర్పాటు చేయడం చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయారన్నా రు. గ్యాస్ ధరలు పెంచడాన్ని త ప్పుబట్టారు. శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్‌గా సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ వ్యవహరించారు. ముందుగా కార్యాలయం వద్ద పార్టీ పతాకాన్ని రాష్ర్ట సమితి సభ్యుడు నెక్కంటి సుబ్బారావు ఆవిష్కరించారు. సభలో బండి వెంకటేశ్వరరావు, కె.కృష్ణమాచార్యులు ప్రసంగించారు. పార్టీ, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్
-
రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా: మన్మోహన్
న్యూఢిల్లీ: సరైన సమయంలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. సాధారణ ఎన్నికల అనంతరం యూపీఏ కొత్త ప్రధానిని ఎన్నుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రధానికి బాధ్యతలు అప్పగిస్తానని వెల్లడించారు. ఢిల్లీ రైసినా రోడ్డులోని నేషనల్ మీడియా సెంటర్లో మన్మోహన్ పూర్తిస్థాయి విలేకరుల సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తమ ప్రభుత్వం అనేక చారిత్రక చట్టాలను అమల్లోకి తెచ్చిందని తెలిపారు. రాజీనామా చేయాలని ఎప్పుడు అనిపించలేదని, రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానన్నారు. తనను దిగిపోమ్మని ఎవరూ అడగలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ నుంచి తనకు అనూహ్య మద్దతు లభించిందన్నారు. ఈ పదేళ్లలో పార్టీకి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు రాలేదన్నారు. రాహుల్ గాంధీ సమర్థుడైన నాయకుడు, ఆయన విషయంలో పార్టీ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. యూపీఏ- 3 ప్రభుత్వం గురించి ఇప్పుడే మాట్లాడడం అసంగతమన్నారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల మధ్య అంతరం తగ్గుతోంది. ధరల పెరుగుదల ప్రజలను కాంగ్రెస్‌కు దూరం చేసిందన్నారు. ధరాభారం నుంచి పేదలను కాపాడేందుకు కృషి చేశామన్నారు. గతంలో ఎన్నడూలేనంతగా వ్యవసాయ వృద్ధిరేటు పెరిగిందన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాధాన్యంగా దృష్టి సారించామని చెప్పారు. తాము సాధించిన అభివృద్ధిని విపులంగా చెప్పేందుకు ఇప్పుడు సమయం తక్కువగా ఉందన్నారు. అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి బయటపడుతున్నాయని తెలిపారు. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ప్రధాని కావడం వినాశకరపరిణామంగా భావిస్తానని మన్మోహన్ అన్నారు. గుజరాత్లో జరిగిన మారణకాండ మళ్లీ దేశంలో జరగాలని కోరుకోవడం లేదన్నారు. ఇప్పుడున్న మీడియాతో పోలిస్తే చరిత్రకారులు తన పట్ల సున్నితంగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. -
ప్రధాని దొంగలను కాపాడే మేస్త్రీ : నారాయణ
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను దొంగలను కాపాడే మేస్త్రీ అని పిలిస్తే సమంజసంగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యాఖ్యానించారు. ప్రధాని చర్యలను పరిశీలిస్తే ఈ పదమే సరిపోతుందని పేర్కొన్నారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయున ప్రధానిని తీవ్రంగా దుయ్యబట్టారు. ‘ఆర్థికవేత్తగా పేరొందిన మన్మోహన్సింగ్ను ‘దొంగ’ అని తోటి పార్లమెంటు సభ్యులు అనటంతో ప్రధాని ఆక్రోశం వ్యక్తంచేశారు. సభ్య సమాజ ం దీన్ని ఖండించాల్సిందే. మన్మోహన్‌ను దొంగ అనడాన్ని నేను ఆమోదించను. ఆ పదం ప్రధానికి ఎలా వర్తిస్తుంది? కనీస రాజకీయ-ఆర్థిక పరిజ్ఞానం ఉన్నవారు ఆ విధంగా సంబోధించరు. అరుుతే కాపలాదారుడిని అంటున్న మన్మోహన్ ఖజానా ఖాళీ అవుతున్నా గుడ్లప్పగించి చూస్తున్నారు. దోపిడీ చేసే వాళ్లపై ఈగ వాలనీయకుండా చూసే వారిని ఏవునాలో.. ఆయునను అలానే పిలివాలి’ అని వ్యాఖ్యానించారు. ‘బ్యాంకులకు బకాయిపడ్డ సంపన్నులనుంచి మూడు లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయకపోగా, నిరర్ధక ఆస్తులుగా పరిగణించి సంతృప్తి పడుతున్నారు. పార్లమెంటును నడపడానికి బెదిరింపులు, ప్రలోభాలతో ప్రయుత్నిస్తున్నారు’ అని వివుర్శించారు. -
4న ఢిల్లీ వెళ్లనున్న సీఎం కిరణ్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 4వ తేదీ బుధవారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్న నేపధ్యంలో 20 రోజుల్లో తెలంగాణ తీర్మానాన్ని కేంద్ర మంత్రి మండలి ముందుకు తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటించిన పరిస్థితులలో సీఎం ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో పరిస్థితులను, సీమాంధ్ర ఉద్యమాల గురించి సీఎం ప్రధానికి వివరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కీలక బిల్లులు అడ్డుకుంటే ఎలా?
బీజేపీపై ప్రధాని మన్మోహన్ విమర్శనాస్త్రాలు రూపాయి, దేశ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో వివరణ కఠినమైన సంస్కరణలకు సమయం ఆసన్నమైంది న్యూఢిల్లీ: ఎట్టకేలకు ప్రధాని మన్మోహన్సింగ్ మౌనం వీడారు. రూపాయి పతనం, రోజురోజుకూ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై శుక్రవారం రాజ్యసభలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే ప్రధాన ప్రతిపక్షం బీజేపీపై పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ కీలకమైన ఆర్థిక బిల్లులను అడ్డుకుంటూ పార్లమెంటును స్తంభింపచేస్తోందని, ఫలితం గా దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం చెడిపోతోందని మండిపడ్డారు. చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాల్సిందేనని, అలాగే ఆర్థిక పరిస్థితి చక్కబడాలంటే ప్రతిపక్షం కూడా ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. ప్రధాని వ్యాఖ్యలపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమైంది. కుంటి సాకులు కట్టిపెట్టి, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ఏం చేస్తారో చెప్పాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ నిలదీశారు. అసమర్థ సర్కారు తీరుతో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని, దేశంపై వారు విశ్వాసం కోల్పోతున్నారని దుయ్యబట్టారు. వెనక్కి పోలేం...: ప్రస్తుతం ఆర్థికరంగం గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నా సంస్కరణల నుంచి వెనక్కి వెళ్లలేమని ప్రధాని ఉద్ఘాటించారు. స్వల్పకాలిక ఆటుపోట్లు తప్పవని వ్యాఖ్యానించారు. ‘ప్రమాదకరంగా పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటును సరిచేయాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు చేయాల్సిందంతా చేస్తాం. రూపాయి మారకం విలువ పడిపోవడం ఆందోళనకరమే. అయితే దీన్ని అధిగమించేందుకు సంస్కరణలను పక్కనపెట్టబోం. ఇతరత్రా మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొంటాం’ అని వివరించారు. కఠినమైన ఆర్థిక సంస్కరణలకు సిద్ధమవ్వాల్సిన తరుణం ఆసన్నమైం దన్నారు. సబ్సిడీలు తగ్గించుకోవడం, బీమా, పెన్షన్ రంగా ల్లో సంస్కరణలు, వస్తు, సేవల పన్ను, అనుమతులు, నిర్ణయాల్లో అధికారిక జాప్యాన్ని నివారించడం వంటివి చేపడతామన్నారు. అయితే ఇవన్నీ అంత సులువు కాదని, విపక్షం సహకరిస్తేనే ఈ చర్యలు తీసుకోగలుగుతామని చెప్పారు. ‘రాజకీయ ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ప్రభుత్వం అనేక కీలక చట్టాలు చేయలేకపోతోంది. ముఖ్యమైన అంశాల విషయంలో రాజకీయాలకు అతీతంగా మెల గాలి. ఆర్థిక స్థితిని గాడిన పెట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని అన్ని పక్షాలను కోరుతున్నా’ అని చెప్పారు. ఉల్లిపాయల నిల్వ విషయంలో రాష్ట్రాలు కేంద్రం సూచనలను పాటించింటే ఇప్పుడీ కష్టాలు ఉండేవి కావని అన్నారు. ఏ దేశంలో అయినా ఇలా చేస్తారా? బీజేపీ తరచూ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ప్రధాని తప్పుపట్టారు. సభాధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. ‘ప్రధాని తన మంత్రులను సభకు కూడా పరిచయం చేసుకోనివ్వలేని పరిస్థితిని ఏ దేశంలోనైనా చూశారా? విపక్ష సభ్యులు సభామధ్యలోకి దూసుకొచ్చి ‘ప్రధాని దొంగ(చోర్)’ అని అరవడం ఏ పార్లమెంటులో అయినా విన్నారా?. కానీ అవన్నీ ఇక్కడ చూస్తున్నాం’ అని అన్నారు. ఇందుకు బీజేపీ నేత అరుణ్‌జైట్లీ దీటుగా స్పందించారు. ‘ఎంపీలను కొని విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రధానిని ఏ దేశంలో అయినా చూశారా?’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలకు సాకులు చెప్పడం కాకుండా ఆర్థికరంగానికి జవసత్వాలు కల్పించేందుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. -
బంగారంపై మోజు తగ్గించుకోండి: ప్రధాని
రూపాయి పతనం ఆందోళనకర పరిణామమని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఊహించని అంతర్జాతీయ పరిణామాలతోనే రూపాయి రికార్డు స్థాయికి పడిపోయిందని ఆయన తెలిపారు. లోక్‌సభలో దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని ప్రకటన చేశారు. ప్రపంచ దేశాల కరెన్సీ బలహీనపడడానికి అమెరికా ఫెడరల్ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలే కారణమని మన్మోహన్ సింగ్ అన్నారు. బంగారంపై వ్యామోహం తగ్గించుకోవాలని, చమురు ఉత్పత్తులను పొదుపుగా వాడుకోవాలని దేశ ప్రజలను ప్రధాని కోరారు. పసిడి కొనుగోళ్లకు ఎగబడవద్దని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటును 70 బిలియన్ డాలర్లకు తగ్గిస్తామన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. రూపాయి పతనంతో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉందని తెలిపారు. రూపాయి విలువ తగ్గడం, ముడి చమురు ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమయిందని వివరించారు. రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నాయని చెప్పారు. -
ప్రధానితో ఏపీఎన్జీవో నేతల భేటీ
-
ప్రధానితో ఏపీఎన్జీవో నేతల భేటీ
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఏపీఎన్జీవో, విద్యుత్, ఆర్టీసీ, విద్యార్థి సంఘాల నేతలు కలిశారు. వీరిని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు.. ప్రధాని వద్దకు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రధానికి వీరు వివరించినట్టు సమాచారం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కమిటీ వేస్తామని ఏపీఎన్జీవోలకు ప్రధాని హామీయిచ్చారు. విభజన జరగనందున అప్పుడే ఆందోళన చెందాల్సిన పనిలేదని ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రధాని అన్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పటికే సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. -
మంత్రుల కమిటీ వేస్తామన్నారు: విజయమ్మ
-
మంత్రుల కమిటీ వేస్తామన్నారు: విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రకటన నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై మంత్రుల బృందంతో కమిటీ వేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రధాని మన్మోహన్ సింగ్ హామీయిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ప్రధానికి వివరించామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. విభజన ప్రకటనతో రాష్ట్రం అగ్నిగుండంలా మారిందన్నారు. పార్టీ నాయకులతో ప్రధానిని కలిసిన తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడారు. న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని మన్మోహన్ సింగ్‌ను కోరామని విజయమ్మ తెలిపారు. రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. రాష్ట్రపతిని కలిసి ఇదే విషయం చెబుతామన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉండి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తమతో ప్రధాని అన్నారని విజయమ్మ వెల్లడించారు. మంత్రుల కమిటీ వేస్తామని మన్మోహన్ తమకు హామీయిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చామని ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. -
యూపీఏ, రూపాయిల విలువ పోయింది: మోడీ
రాజ్‌కోట్: యూపీఏ సర్కారు, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌లపై బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ విమర్శల పరంపరను కొనసాగిస్తున్నారు. రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయికి పడిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రూపాయి, యూపీఏ సర్కారు రెండు కూడా విలువ కోల్పోయాయని, మన్మోహన్ మాదిరిగానే రూపాయి కూడా మూగబోయిందని ఎద్దేవా చేశారు. మోర్బీ ప్రాంతాన్ని రాజ్‌కోట్ నుంచి వేరు చేసి ప్రత్యేక జిల్లాగా ప్రకటించిన సందర్భంగా మోడీని శనివారం ఇక్కడ సన్మానించారు. ఆయన ప్రసంగిస్తూ.. రూపాయి మరణశయ్యపైకి చేరిందని, దానికి అత్యవసర చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షోభం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అసలు మనదేశం ఎందుకు సంక్షోభం వైపు పయనిస్తోందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కేంద్రం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపించారు. సన్మానం సందర్భంగా మోర్బీలోని సిరామిక్ పరిశ్రమల యజమానులు మోడీకి వెండి కాసులతో తులాభారం వేసి.. 80 కేజీల వెండిని అందజేశారు. వెండిని వల్లభాయ్ పటేల్ ప్రతిమ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ నిర్మాణానికి వాడతామని మోడీ చెప్పారు. -
పరిశోధన.. అపనింద కారాదు
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘మీడియాలో పరిశోధన స్ఫూర్తి అపనిందల ప్రచారంలా మారకూడదు. పరిశోధనాత్మక జర్నలిజానికి కక్ష సాధింపులు ప్రత్యామ్నాయం కాదు. ప్రజోపయోగం స్థానాన్ని వ్యక్తిగత పక్షపాతాలు ఆక్రమించకూడదు’’ అని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ హితవుపలికారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 75వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఢిల్లీలోని రాయ్‌సీనా రోడ్లో అరవై కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక జాతీయ మీడియా కేంద్రం (నేషనల్ మీడియా సెంటర్ )ను ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మీడియా అనేది కేవలం కార్యక్రమాలకు అద్దంపట్టేది మాత్రమే కాదని.. మొత్తం సమాజాన్ని అది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణలు తెచ్చిన గొప్ప సామాజిక మార్పుల ప్రక్రియను ప్రతిబింబించే క్రమంలో.. మీడియా కూడా ఆ మార్పుల ప్రభావానికి లోనయిందన్నారు. మార్పు అనేది సవాళ్లను కూడా తెస్తుందని.. మీడియా రంగంలోని వారు ఈ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని చెప్పారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో పరిశోధన స్వేచ్ఛ, ప్రశ్నలకు సమాధానాల అన్వేషణ అనే బాధ్యతను నిర్వర్తించేటపుడు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. పరిశోధనాత్మక జర్నలిజానికి కక్షసాధింపులు ప్రత్యామ్నాయం కాదని హితవు పలికారు. మీడియా చర్చలో ఒక్కోసారి హుందాతనం లోపిస్తోందని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. రెండెకరాల విస్తీర్ణం.. అత్యాధునిక హంగులు రాష్ట్రపతి భవన్‌కు, పార్లమెంటుకు సమీపంలో 1.95 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలతో నెలకొల్పిన ఈ కేంద్రం ప్రభుత్వ సమాచార కేంద్రంగా పనిచేస్తుంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను కూడా ఈ భవనంలోనే ఏర్పాటుచేస్తారు. ఈ మీడియా సెంటర్లోని ప్రధాన ప్రెస్ కాన్ఫరెన్స్ ఆడిటోరియంలో దాదాపు 300 మంది విలేకరులు కూర్చోగల సదుపాయం ఉంది. మరో హాల్లో 60మందికి పైగా కూర్చోవచ్చు. మీడియా ప్రతినిధుల కోసం 24 వర్క్స్టేషన్లు ఉంటాయి. మీడియా ప్రతినిధులకు లైబ్రరీ, కెఫెటీరియా, లాంజ్ కూడా అందబాటులో ఉంటాయి. వివాదాస్పద వ్యాఖ్యలపై జస్టిస్ కట్జూ క్షమాపణ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మార్కండేయ కట్జూ ఇన్నాళ్లకు తన వ్యాఖ్యలపై సారీ చెప్పారు. 90 శాతం మంది భారతీయులు మూర్ఖులన్న ఆయన తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘నా వ్యాఖ్యలతో కొందరు బాధపడ్డారు. అవి నిర్దిష్టమైన సందర్భాన్ని ఉద్దేశించి చేసినవి తప్ప.. ఎవరినో బాధపెట్టడానికి కాదు’ అని శనివారమిక్కడ చెప్పారు. ‘ముందస్తు’పై ఏమీ చెప్పలేను: సోనియా న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత మళ్లీ యూపీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుత యూపీఏ సర్కారు పూర్తికాలం కొనసాగటమే తమ లక్ష్యమని.. అయితే ముందస్తు ఎన్నికల గురించి ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో జాతీయ మీడియా కేంద్రం ప్రారంభోత్సవం తర్వాత తనను చుట్టుముట్టిన విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ వెంటనే వెళ్లిపోగా.. సోనియాగాంధీ విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ‘ఎన్నికల తర్వాత యూపీఏ-3 సర్కారు ఏర్పాటవుతుందా?’ అన్న ప్రశ్నకు.. ‘‘నూటికి నూరు శాతం ఏర్పడుతుంది’’ అని ఆమె బదులిచ్చారు. ‘లోక్‌సభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయా?’ అని ప్రశ్నించగా, సర్కారు పూర్తి కాలం కొనసాగించటమే తమ లక్ష్యమన్నారు. ‘లోక్‌సభలో ఆహారభద్రత, భూసేకరణ బిల్లుల ఆమోదం తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా?’ అని అడిగినపుడు, ‘‘నేనేమీ చెప్పలేను’’ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ విజయాలుగా ప్రచారం చేయబోయే అంశాలపై ప్రశ్నించినపుడు.. దేశప్రజలకు ఇచ్చిన హక్కులను ప్రచారం చేస్తామన్నారు. ‘మేం చాలా హక్కులు అందించాం. సమాచార హక్కు, విద్యా హక్కు, ఇప్పుడు ఆహార హక్కు అందించబోతున్నాం’’ అని చెప్పారు. -
'ప్రధానిని విమర్శించే అర్హత మోడీకి లేదు'
హైదరాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై మంత్రి సి రామచంద్రయ్య విరుచుకు పడ్డారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ని విమర్శించే అర్హత మోడికి లేదన్నారు.గుజరాత్ అనేక రంగాల్లో అభివృధ్ధిలో విఫలమైందని రామచంద్రయ్య విమర్శించారు. ప్రధానిపై మోడీ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తక్షణమే మోడీ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా రాయలసీమ విభజనకు తాము ఒప్పుకొనేది లేదని రామచంద్రయ్య స్పష్టం చేశారు. 19న జరిగే ఆంటోనీ కమిటీలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరతామని ఆయన తెలిపారు. ఆంటోనీ కమిటీకి తమ వాదనలు వినిపిస్తామని రామచంద్రయ్య తెలిపారు. -
కాంగ్రెస్, టీడీపీలది ద్వంద్వవైఖరి: కిషన్‌రెడ్డి
ప్రధాని మన్మోహన్ సింగ్ అసమర్ధత వల్లే సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి విమర్శించారు. తన మంత్రులను ఒక తాటిపై నిలపడంలో ప్రధాని విఫలమని మండిపడ్డారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీయే ఇరుప్రాంతాల్లో ఆందోళన చేయిస్తుందన్న అనుమానాన్ని కిషన్‌రెడ్డి వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీడీపీ ద్వంద్వ ప్రమాణాల వల్లే రాష్ట్రంలో ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయని దుయ్యబట్టారు. టీఆర్ఎస్తో పొత్తు సమయంలో టీడీపీ, కాంగ్రెస్‌లు తెలంగాణపై ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉద్యమకారుల ముసుగులో తమ పార్టీపై మజ్లీస్ దాడులకు పాల్పడుతోందని కిషన్‌రెడ్డి తెలిపారు. దేశంలో సుస్థిరపాలన అందించే సత్తా ఒక్క నరేంద్ర మోడీకే ఉందని, ఆయనకు భయపడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిందని అంతకుముందు ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయడానికి సోనియా గాంధీ పావులు కదుపుతున్నారని, దీనికి టీడీపీ, టీఆర్ఎస్లు పునాదులు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు.