
ప్రధానితో రాహుల్ గాంధీ భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిశారు. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి ముందు అరగంట పాటు ఈ భేటీ జరిగింది. సమావేశం వివరాలు వెల్లడికాలేదు. కోర్ కమిటీ సమావేశంలో అవినీతి వ్యతిరేక బిల్లుపై ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. దీనిలో చేపట్టాల్సిన సవరణలపై సమాలోచనలు జరిపినట్టు సమాచారం.
పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న పలు కీలక బిల్లులపై కూడా కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపినట్టు తెలిసింది. సోనియా గాంధీ, టెలికం మంత్రి కపిల్ సిబాల్, వి. నారాయణ స్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.