రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్ను ఏపీఎన్జీవో, విద్యుత్, ఆర్టీసీ, విద్యార్థి సంఘాల నేతలు కలిశారు. వీరిని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు.. ప్రధాని వద్దకు తీసుకెళ్లారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రధానికి వీరు వివరించినట్టు సమాచారం.
మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కమిటీ వేస్తామని ఏపీఎన్జీవోలకు ప్రధాని హామీయిచ్చారు. విభజన జరగనందున అప్పుడే ఆందోళన చెందాల్సిన పనిలేదని ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రధాని అన్నట్టు తెలిసింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పటికే సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రధానితో ఏపీఎన్జీవో నేతల భేటీ
Published Tue, Aug 27 2013 2:12 PM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement