నారాయణా.. ఇంక దిగజారకు! | BV Raghavulu Letter to Narayana | Sakshi
Sakshi News home page

నారాయణా.. ఇంక దిగజారకు!

Published Sat, Oct 19 2013 4:23 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

నారాయణా.. ఇంక దిగజారకు! - Sakshi

నారాయణా.. ఇంక దిగజారకు!

సాక్షి, హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తనతో పాటు తన పార్టీ పరువు, ప్రతిష్టలను దిగజార్చుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు దుయ్యబట్టారు. తన స్థాయి మరిచి విమర్శలకు దిగి అసత్యాలు, దిగజారుడు మాటలు మాట్లాడవద్దని హితవుపలికారు. వైఎస్సార్‌సీపీతో సర్దుబాట్లపై చర్చలకు తానే ప్రత్యక్ష సాక్షినన్నట్టు మాట్లాడిన నారాయణ.. నిజాయితీ ఉన్న కమ్యూనిస్టయితే వాటిని నిరూపించాలని రాఘవులు సవాల్ చేశారు.

వైఎస్సార్‌సీపీతో సీపీఎం రహస్యంగా సీట్ల ఒప్పందం కుదుర్చుకుంటోందని నారాయణ విమర్శించిన నేపథ్యంలో రాఘవులు శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పదేపదే లేఖలు రాసినా  సీపీఎం పట్ల నారాయణ దురుసుగానే ప్రవర్తిస్తున్నారని చెప్పారు. వామపక్షాల మధ్య ఉండాల్సిన స్థాయిలో ఈ విమర్శలు ఉండడం లేదని, వ్యక్తిగత దూషణలకు దిగి అబద్ధాలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఈ విమర్శల వల్ల నారాయణకు, ఆయన పార్టీకే తీరని నష్టమని అన్నారు.

వైఎస్సార్‌సీపీతో పొత్తుపై బేరసారాలు జరిపి సీట్ల సంఖ్యపై కూడా తాము చర్చించినట్టు నారాయణ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి తేలేవరకు ఎన్నికల గురించి చర్చించబోమని ఇదివరకే చెప్పామని గుర్తు చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం నారాయణకు ఓ లేఖ రాశారు. ఒంగోలులో గురువారం నారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు, నిరాధార, కల్పిత ఊహాగానాలు చేయవద్దని సలహా ఇచ్చారు. నారాయణ వాడిన ప్రతిమాటను ఖండిస్తూ ఈ లేఖ సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement