సాక్షి, హైదరాబాద్: కొత్తప్రభుత్వం.. కొత్తపంథా.. కొత్త విధానాలూ అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ పాత ప్రభుత్వాల పంథాలోనే సాగుతున్నారని, కొత్తదనం కొరవడిందని సీపీఐ నేత కె.నారాయణ ధ్వజమెత్తారు. కరెంట్‌తో రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిపై పోలీసుల లాఠీచార్జీలు, కేసులు అంటూ పాత ప్రభుత్వాల ఒరవడిలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా నడుస్తోందన్నారు. మెదక్ రైతులపై లాఠీచార్జీకి కారణమైన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మంగళవారం మఖ్దూంభవ న్‌లో పార్టీనేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కె.రామకృష్ణలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ వితండవాదం వల్లే కౌన్సెలింగ్‌పై సుప్రీంకోర్టులో కేసు పడిందని, ఇప్పటికైనా మధ్యంతర తీర్పునకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. 1956 తర్వాత తెలంగాణలో పుట్టినవారంతా స్థానికులే అంటూ సీఎం కాకముందు ప్రకటించిన కేసీఆర్ సీఎంఅయ్యాక మాటమార్చి రెండునాల్కల ధోరణి ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
పాత పంథాలోనే కేసీఆర్: కె.నారాయణ
Published Wed, Aug 6 2014 2:58 AM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM
Advertisement
Advertisement