
సాక్షి, మెదక్: యాసంగిలో వరిపంటను ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఆమె చేపట్టిన రైతు ఆవేదన యాత్ర మెదక్ జిల్లా కంచనపల్లికి చేరుకుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని వైఎస్ షర్మిల ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలన్నారు.
చదవండి: 5 రోజులు.. 5 జిల్లాలు
‘‘రుణ మాఫీ చేస్తా అన్నారు. ఎంతమందికి చేశారో చెప్పాలి. బ్యాంకుల్లో వడ్డీలు కట్టలేక రైతులు అవస్థలు పడుతున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే. సీఎం కేసీఆర్ ఊసరవెల్లిలాగా మాటలు మారుస్తూ మాట్లాడుతున్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. రైతును రాజు చేయడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యమని’’ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment