
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి: నారాయణ
కాంగ్రెస్ పార్టీ అసమర్థతతోనే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అసమర్థతతోనే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టే అధికారంలో ఉన్నా...తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తీవ్రమైన తాత్సారం చేస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన ప్రకటన అనంతర పరిణామాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోలేకపోతుందని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓ పథకం ప్రకారం విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఎన్‌డీఏ హయాంలో, అక్కడి రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలు ఉన్నా, మూడు రాష్ట్రాల విభజన శాంతియుతంగా జరిగిందన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కేంద్రానికి లేఖ రాయమని లగడపాటి రాజగోపాల్, కిషన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు తనకు లేఖ రాశారన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనతో ప్రజల్లో అభద్రతాభావం నెలకొని ఉందన్నారు. దీనిని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాజకీయ పార్టీలపైనే ఉంద ని చెప్పారు.