హైదరాబాద్, సాక్షి: గత రెండు రోజుల అరెస్టులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. పోరాటాలు బీఆర్‌ఎస్‌కు కొత్తేం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని అన్నారాయన.
పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం. వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ.. అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలతో సహా సందేశం ఉంచారాయన.
పోరాటం మాకు కొత్త కాదు ✊
ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం
వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం… pic.twitter.com/ThGZAnjbf0— KTR (@KTRBRS) August 3, 2024
నిరుద్యోగుల కోసం గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment