Delhi dharna
-
వదిలిపెట్టం, అవసరమైతే ఢిల్లీకి..: అరెస్టుపై కేటీఆర్ రియాక్షన్
హైదరాబాద్, సాక్షి: గత రెండు రోజుల అరెస్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(KTR) ఎక్స్ వేదికగా స్పందించారు. పోరాటాలు బీఆర్ఎస్కు కొత్తేం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని అన్నారాయన. పోరాటం మాకు కొత్త కాదు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతం. వదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం. జై తెలంగాణ.. అంటూ తన అరెస్టుకు సంబంధించిన ఫొటోలతో సహా సందేశం ఉంచారాయన.పోరాటం మాకు కొత్త కాదు ✊ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అని నమ్మించి రాహుల్ గాంధీ తెలంగాణ యువతను మోసం చేస్తున్న విధానం మీద అవసరమైతే ఢిల్లీకి వచ్చి మిమ్మల్ని ఎండగడతంవదిలిపెట్టం, మీరు బూతులు తిట్టినా, అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం, నిలదీస్తూనే ఉంటాం… pic.twitter.com/ThGZAnjbf0— KTR (@KTRBRS) August 3, 2024నిరుద్యోగుల కోసం గన్ పార్క్ వద్ద ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. -
జగన్‌కు ఫస్ట్ టైం... అయినా సూపర్ సక్సెస్
వైఎస్సార్సీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన భారీ ధర్నా రెండు లక్ష్యాలను నెరవేర్చిందని చెప్పాలి.ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న ఆటవిక పాలన తీరుతెన్నులను రాజధాని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలందరికి వెల్లడించగలిగారు. అదే టైంలో ఇంతకాలం దాదాపు ఒంటరియానం చేసిన వైఎస్సార్సీపీకి తోడు ఎవరైనా వస్తారా?అన్న డౌటు వచ్చినవారికి ఒక సమాధానం లభించినట్లయింది. మొత్తం.. తొమ్మిది రాజకీయ పార్టీల ప్రముఖులు ఈ ధర్నాకు వచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజవాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ధర్నాకు వచ్చి సంఘీభావం తెలపడం హైలైట్ అని చెప్పాలి.డిల్లీ ధర్నాలో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఈ నేతలు తిలకించారు. ఏపీలో టీడీపీ గూండాలు అరాచకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలను నరికి చంపడం, ఆస్తులు విధ్వంసం, ఎంపీ కార్లను సైతం ద్వంసం చేయడం వంటి సన్నివేశాలను చూసి ఈ నేతలంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన ఇంత ఘోరంగా ఉందా?ఆయన కుమారుడు లోకేష్ ఇంత అరాచకంగా రెడ్ బుక్ అని పెట్టి ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని బెదిరించడం, ఆయన మనుషులు దాడులకు పాల్పడడం వంటివి చేస్తుంటే చర్యలు తీసుకునే పరిస్థితి లేదా? అని విస్తుపోయారు. అసలు రెడ్ బుక్ కాన్సెప్ట్ అన్నదే కొత్తది అయితే,అలాంటివాటిని అమలు చేస్తున్నవారిపై కేసులు పెట్టవలసిన పరిస్థితి ఉండగా, టీడీపీ రాక్షసపాలనను అడ్డుకునేవారే లేకుండా పోయారని ఆయా పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. దీంతో.. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ డొల్లతనం బయట రాష్ట్రాల నేతలకు కూడా కళ్లకట్టినట్లు చెప్పినట్లయింది. జగన్ వీరందరికి దగ్గరుండి ఆ వివరాలు తెలియచేయడమే కాకుండా వీడియో క్లిప్పింగ్ లను కూడా ప్రదర్శించారు. అదే సమయంలో.. జగన్ ఢిల్లీ ధర్నాను తక్కువ చేసి చూపడానికి మద్యం పై శ్వేతపత్రం డ్రామాను చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఢిల్లీ ధర్నాకు మొదటి పేజీలో కవరేజీ ఇవ్వకుండా , చంద్రబాబు శ్వేతపత్రానికే ప్రాధాన్యం ఇచ్చి, ఎప్పటికీ తాము చంద్రబాబు భజనలోనే తరిస్తామని తేటతెల్లం చేసింది.చంద్రబాబు పత్రం గురించి వార్తలు ఇవ్వడం తప్పుకాదు. కానీ, ఒక ప్రధాన పార్టీ ఢిల్లీలో అంత పెద్ద ధర్నా చేపడితే కవరేజీ ఇవ్వడానికి వారికి మనసు రాలేదు. జర్నలిజం ప్రమాణాలను రోజురోజుకు దిగజార్చుతున్న వైనం కనిపిస్తూనే ఉంది. ఇక వైఎస్సార్సీపీకి చెందిన పలువురు సీనియర్ నేతలంతా ఈ ధర్నాలో పాల్గొనడం,రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు తరలివెళ్లడం ద్వారా పార్టీలో నైతిక స్పూర్తి వచ్చినట్లయింది.దీంతో రాష్ట్రంలో ఈ దాడుల పర్వం కాస్త ఆగే అవకాశం ఉంది.అలాగే పోలీసులు కూడా తాము మరీ అప్రతిష్ట పాలవుతున్నామన్న భావనతో దాడులకు పాల్పడ్డవారిపై కొంతమేర అయినా చర్యలు తీసుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఈ నేతలందరితో పరిచయాలు ఉన్నాయి. గతంలో ప్రత్యేక హోదా అంశం సమయంలో డిల్లీలో ఆయన కూడా ధర్నాలు నిర్వహించి ,ఆయా రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ తోను, ఇటు బీజేపీతోను ఆయన కూటమి కట్టిన అనుభవం ఉంది. అందువల్ల వారందరి దృష్టిలో చంద్రబాబు పాలనపై తక్కువ అబిప్రాయం కలుగుతుంది. అది కూడా ఆయనకు అప్రతిష్ట అవుతుంది. ఈ రకంగా వైసిపి ధర్నా ఎపిలో సాగుతున్న దమనకాండకు ముగింపు పలకడానికి ఉపయోగపడుతుంది. మరో కోణం చూద్దాం.. ఇంతకాలం వైఎస్సార్సీపీ వివిధ కారణాల రీత్యా ఏ ఇతర రాజకీయపార్టీలతో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నా, ఆ తర్వాత పరిణామాలలో జగన్ ను ఆ పార్టీ ఇబ్బంది పెట్టినందున దానికి దూరం అయ్యారు. బీజేపీ వారికి సానుభూతి ఉన్నా, గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ మద్దతు ఏదో రకంగా తీసుకున్నా.. ఇప్పుడు వారు టీడీపీతో ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్నందున వైఎస్సార్సీపీకి సహకరించే పరిస్థితి లేదు. కనీసం సంఘీభావం ప్రకటించలేదు. దీంతో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీయే కూటములకు సమదూరంలో ఉంటూనే వైఎస్సార్సీపీ తోడు ఎవరు వస్తారా? అని ప్రశ్న తలెత్తింది. ఆ తరుణంలో సమాజ్‌వాదీ పార్టీతో సహా తొమ్మిది పార్టీలు ధర్నాకు హాజరై వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వడం , చంద్రబాబు పాలనను తప్పు పట్టడం, అధికారం ఎవరికి శాశ్వతం కాదని చెప్పడం వంటివాటితో జగన్ కు జాతీయ స్థాయిలో మంచి పట్టే ఉందనే భావన కలుగుతోంది. జగన్‌ను తొమ్మిది పార్టీలు కలిస్తే, వాళ్లలో ఒక్క అన్నాడీఎంకే తప్ప మిగిలినవన్నీ ఇండి కూటమిలోనే పార్టీలే. ఉద్దావ్ ధాక్రే వర్గానికి చెందిన శివసేన నేత అయితే నేరుగా వైస్సార్సీపీని ఇండియా కూటమిలో చేరాలని పిలుపు ఇచ్చారు. అలా చేస్తారన్న గ్యారంటీ లేదు. కాని,జగన్ భవిష్యత్తులో ఆయా రాజకీయ పక్షాలతో సత్సంబంధాలు నెరపడానికి అవకాశం ఉంది. బీజేపీ,కాంగ్రెస్ తో పాటు వామపక్షాలవారు కూడా ఈ ధర్నాకు రాలేదు. వామపక్షాలవారు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. తృణమూల్ కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా.. మొదలైన పార్టీల నేతలు వచ్చారు. లోక్ సభ మాజీ స్పీకర్ తంబిదురై ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ లెక్కన.. జాతీయ కూటమిలో చేరడమో,లేక ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కొత్త శక్తిగా తయారవడమో అనే అంశాలపై జగన్ ఆలోచిస్తారేమో చూడాల్సి ఉంది. అఖిలేష్ యాదవ్ ఇండియా కూటమిలో అత్యంత కీలకమైన నేతగా ఉన్నారు. ఆయన ఈ ధర్నాకు రావడంతో ఉత్తరాది రాష్ట్రాలలో రాజకీయ పక్షాల దృష్టి ఇటువైపు పడుతుంది. ఆ రకంగా వైఎస్సార్సీపీకి ఇది ఉపయోగపడుతుంది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ రావడంతో పశ్చిమబెంగాల్ లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ సానుభూతి కూడా లభించినట్లయింది. డీఎంకే అధినేత స్టాలిన్ వంటివారు తమ ప్రతినిధిని పంపించి ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఎంపీని పంపించి ఉంటే రాజకీయంగా చాలా ప్రాధాన్యత వచ్చేదేమో!. కాని ఇంకా ఆ పరిస్థితి రాలేదు. రాజకీయాలలో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుంటారు. ప్రస్తుతం బీజేపీ-కాంగ్రెస్ ఆ దశలోనే ఉన్నాయి. ఈ రెండు కూటములలో వైఎస్సార్సీపీకి స్థానం లేకుండా చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. జగన్ ప్రజలను నమ్ముకుంటే.. చంద్రబాబు వ్యూహాలపై ఆదారపడి రాజకీయాలు చేస్తుంటారు. అయితే జగన్ ఇప్పటికైనా వాటన్నింటిని గమనించి మొదటిసారి జాతీయ స్థాయిలో తన రాజకీయం చేసి సఫలం అయ్యారని చెప్పాలి.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్.. ఘన స్వాగతం
ఎన్టీఆర్, సాక్షి: టీడీపీ కూటమి అరాచక పాలనపై చేపట్టిన ధర్నా సూపర్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ఏపీకి చేరుకున్నారు. గురువారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు, నేతలకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్‌ను అభిమానులు చుట్టుముట్టగా.. ఓపికగా ఆయన సెల్ఫీలు దిగారు.ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. హత్యలు, హత్యాచారాలు, దాడులు, వేధింపులు, విధ్వంస ఘటనలు పెరిగిపోయాయి. ప్రత్యేకించి వైఎస్సార్సీపీని లక్ష్యంగా చేసుకుని హింసాపర్వం కొనసాగింది. ఈ నరమేధాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయింది. అదే సమయంలో.. వినుకొండ హత్యాఘటన, వైఎస్సార్సీపీ ఎంపీ..మాజీ ఎంపీలపై దాడి ఘటన రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆపై కూటమి పాలన అరాచకాలపై గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో.. ఈ పరిస్థితుల్ని దేశం దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ జగన్ భావించారు. దేశ రాజధానిలో వైస్సార్సీపీ ధర్నాచేపట్టగా.. పలు జాతీయ పార్టీల సంఘీభావంతో అది విజయవంతం అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ, శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం, ఆప్, అన్నాడీఎంకే.. తదితర పార్టీలు వైఎస్సార్సీపీ ధర్నాకు సంఘీభావం తెలిపాయి. ఆ సమయంలో చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీలో జరుగుతున్న రాజకీయ హత్యలను వైఎస్ జగన్ దేశ రాజధానిలో ఎండగట్టారు. వీడియో, ఫోటో సాక్ష్యాలతో జాతీయ నాయకులకు ఏపీలోని అరాచక పరిస్థితులను వివరించారాయన. ఇదీ చదవండి: రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.. అరాచకాన్ని అడ్డుకుందాంచంద్రబాబు గత నెలన్నర పాలనలో జరిగిన నేరాలను ఘోరాలను తెలుసుకుని ఆ నేతలు నివ్వెరపోయారు. ‘‘ఏపీలో రాజ్యాంగబద్ధ పాలన జరుగుతోందా?’’ అని ప్రశ్నించిన ఆయా పార్టీల నేతలు.. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని.. జగన్‌ను మళ్లీ ఆశీర్వదించే అధికారం కట్టబెట్టే అవకాశం ఉందని అన్నారు. అలాగే.. శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ప్రభుత్వ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో వైఎస్ జగన్ వెంటే ఉంటామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాయని ఆ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. మరోవైపు.. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, కక్షపూరిత రాజకీయాల్ని జాతీయ మీడియా ముందు ప్రస్తావించిన వైఎస్ జగన్, ప్రజాస్యామ్య పరిరక్షణకు అంతా తమకు మద్దతు ప్రకటించాలని జాతీయ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్ర మంత్రులకూ ఏపీలో పరిస్థితులను వివరిస్తామని, రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ చెబుతున్నారు. అపాయింట్మెంట్ దొరకగానే త్వరలో జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. క్లిక్ చేయండి: ఈ పోరాటంలో జగన్‌కు మా మద్దతు ఉంది -
రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది.. అరాచకాన్ని అడ్డుకుందాం..: వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో క్షీణించిన శాంతి భద్రతలు, కక్షసాధింపు చర్యలు, దాడులు, అరాచకాలపై అందరూ గళం విప్పాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో అండగా నిలవాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ప్రజాస్వామ్యవాదులందరితో కలసి అరాచకాన్ని అడ్డుకుందామన్నారు. ‘ఎవరో గుర్తు తెలియని వ్యక్తి మీ ఇంట్లోకి చొరబడి దాడి చేస్తే ఎలా ఉంటుంది? దాన్ని మీరెలా ఎదుర్కొంటారు? దానిపై మీరెలా స్పందిస్తారు? దయచేసి ఇక్కడి గ్యాలరీలో ఫొటోలు, వీడియోలు చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో దారుణ పరిస్థితి గురించి తెలుసుకోండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో అండగా నిలవండి’ అని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విధ్వంసకాండను నిరసిస్తూ బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా, దాడుల తాలూకు ఫొటో గ్యాలరీని ప్రారంభించిన సందర్భంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, చట్టం ముందు అందరూ సమానులే అన్న స్ఫూర్తికి విఘాతం కలిగిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితిని యావత్ దేశం దృష్టికి తెచ్చేందుకు ఇక్కడ నిరసన చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అరాచక, ఆటవిక పాలన సాగుతోందని, అంతులేని దారుణాలు జరుగుతున్నాయని చెప్పారు. అరాచకాలు, అమాననీయ ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూపుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి కొనసాగడం సబబేనా అని ఆలోచించాలన్నారు.యథేచ్ఛగా దాడులు, విధ్వంసాలురాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైఎస్ జగన్ తెలిపారు. యథేచ్ఛగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల విధ్వంసం సాగుతోందన్నారు. వైఎస్సార్సీపీని అణగదొక్కడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. ఇందులో భాగంగానే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 36 హత్యలు, 300 మందిపై హత్యాయత్నాలు, 560 చోట్లకు పైగా ప్రైవేటు, 490 చోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారని చెప్పారు. చినీ తోటలు కూడా ధ్వంసం చేశారన్నారు. నారా లోకేశ్ ఒక మంత్రిగా ఉండి.. రెడ్‌బుక్ పేరిట హోర్డింగ్‌లు పెట్టారని, ఎవరెవరి మీద దాడులు చేయాలి.. ఎవరిని ఎలా వేధించాలన్న వివరాలు అందులో రాసినట్లు స్వయంగా ప్రకటించారని తెలిపారు. అధికార పార్టీ శ్రేణులు ఎలాంటి దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా, ఏ చర్యా తీసుకోవద్దని రాష్ట్ర పోలీసులకు స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. ఆ రెడ్‌బుక్‌ను రాష్ట్రంలో అంతటా హోర్డింగ్‌ల ద్వారా ప్రదర్శించడమే కాకుండా, దాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లారన్నారు. ఆ విధంగా రాష్ట్రంలో ఇప్పుడు భారత రాజ్యాంగం కాకుండా, రెడ్‌బుక్ రాజ్యాంగం పని చేస్తోందని తెలిపారు. మేం దాడులను ప్రోత్సహించలేదుగతంలో వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘటనలేవీ జరగలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, ఇళ్లలోకి చొరబడి వేధింపులు, దాడులు ఎక్కడా జరగలేదని.. పౌర హక్కులకు భంగం కలిగించలేదని వివరించారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వాటన్నింటినీ వెంటనే ఆపలేకపోతే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం, చీనీ తోటల ధ్వంసం.. వీటన్నింటిపై ఫొటో గ్యాలరీతో పాటు వీడియోలు కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ‘దయచేసి ఒక్కసారి ఈ ఫొటోలు, వీడియోలు చూడండి. రాష్ట్రంలో దారుణ పరిస్థితిని అర్థం చేసుకోండి. మా పార్టీ ప్రజా ప్రతినిధులు.. చివరకు ఒక ఎంపీ కూడా తన నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితి. ఎంపీ మిథున్‌రెడ్డిపై పట్టపగలే రాళ్లతో దాడి చేసి వాహనాలు ధ్వంసం చేశారు. ఇన్ని జరుగుతున్నా, పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. ఆ విధంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారు’ అని చెప్పారు. రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న వారి నుంచి బాధితులను కాపాడకపోగా, తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలాంటి దుస్థితి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొనసాగడం సబబేనా? అన్నది ఆలోచించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమానికి అండగా నిలవకపోతే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేమన్నారు.ఢిల్లీ ధర్నాకు హాజరైన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలుఆంధ్రప్రదేశ్లో పరిస్థితిపై ఫొటో, వీడియోల ప్రదర్శన అనంతరం కార్యక్రమానికి వచ్చిన వారందరికీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ‘నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సోదరుడు, స్నేహితుడు, అక్క, చెల్లెమ్మకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మరోవైపు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలిపిన అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వాతాతలు అందరికీ మనసారా కృతజ్ఞతలు. నిరసన ప్రదర్శనకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవడంతోపాటు వాటిపై అభిప్రాయాలు తెలిపి మనకు సంఘీభావం తెలిపిన ప్రతి పార్టీకి, ఆయా పార్టీల నేతలకు వైఎస్సార్సీపీ తరఫున కృతజ్ఞతలు. మీడియా సంస్థల నుంచి వచ్చిన జర్నలిస్టులు ఏపీలో జరుగుతున్న దమనకాండ గురించి తెలుసుకున్నారు కాబట్టి, ఆ హేయమైన పనుల మీద గళం విప్పాలని విన్నవిస్తున్నా. జర్నలిస్టులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’ అని అన్నారు. -
ఢిల్లీ వేదికగా రేపే వైఎస్సార్సీపీ ధర్నా
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలనకు వ్యతిరేకంగా.. ఇక్కడి హింసాత్మక రాజకీయాలు దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దేశ రాజధాని వేదికగా బుధవారం ధర్నా చేపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆ పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా.. 36 హత్యలు జరిగాయి. 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1050 దాడులు-దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి. 300 హత్యాయత్న ఘటనలు నమోదయ్యాయి, 560 ప్రయివేటు ఆస్తులు ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం అయ్యాయి. 2,700 కుటుంబాలు ప్రాణభయంతో ఊళ్లు వదిలి పారిపోయే పరిస్థితులు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. దీనికి నిరసగానే వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు. మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. ఇదీ చదవండి: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: వైఎస్ జగన్అలాగే.. పలు జాతీయ పార్టీల నేతల్నీ కలిసి ఇక్కడి పరిస్థితుల్ని వివరించనున్నారు. అలాగే వాళ్లనూ ధర్నాకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోతామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అరాచకాలు అందరికీ తెలిసేలా.. ఢిల్లీలో రేపటి ధర్నాలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరుగుతున్న హింసకు ఫొటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. అలాగే.. చట్టసభల్లోనూ పెద్దఎత్తున తమ పార్టీ వాణి వినిపిస్తామని అంటోంది. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ప్రయత్నం చేస్తోందని, దానిని వైఎస్సార్సీపీ అడ్డుకుని తీరుతుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వినుకొండలో వైఎస్సార్సీపీ యువకార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. తన ఎక్స్ ఖాతాలో ఆయన ఒక సందేశం ఉంచారు.ఈ నెల 24వ తేదీ బుధవారం న్యూఢిల్లీలో శాంతియుతంగా ధర్నా చేపడతాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక గత 45 రోజుల్లో రాష్ట్రంలో అరాచకాలే రాజ్యమేలుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ధర్నా అని స్పష్టం చేశారాయన. We will be holding a peaceful protest in New Delhi on the 24th of this month, the coming Wednesday. This is to draw the nation’s attention to the lawlessness and anarchy that have plagued Andhra Pradesh in the 45 days since the Chandrababu Naidu regime has come to power. We have…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024అసెంబ్లీలో కూడా నిలదీస్తాంఅలాగే.. చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం. అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వారికి వివరిస్తాం అని తెలుగులో మరో ట్వీట్ చేశారు. చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం.…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024ఆ తల్లిదండ్రులకు సమాధానమేది?మరోవైపు.. రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన తెలియజేశారు. ‘‘పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో క్రూరమైన హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించాను.రాజకీయ కక్షలతో తన కొడుకును పొట్టనబెట్టుకున్నారంటూ ఆ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధ్యాప్యంలో తోడుగా నిలవాల్సిన కొడుకు దారుణ హత్యకు గురికావడం వారిని మరింత కుంగదీసింది.ఆ తల్లిదండ్రుల ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆటవిక పాలనకు బలైన ఆ కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా నిలుస్తుంది.రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందడనడానికి రషీద్ హత్యే ఒక ఉదాహరణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 36 రాజకీయ హత్యలు జరిగాయి. టీడీపీ వాళ్ల వేధింపులు భరించలేక 37 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300 మందికి పైగా హత్యాయత్నాలు జరిగాయి అని ట్వీట్ చేశారాయన.పల్నాడు జిల్లా వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో క్రూరమైన హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించాను. రాజకీయ కక్షలతో తన కొడుకును పొట్టనబెట్టుకున్నారంటూ ఆ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తంచేశారు. వృద్ధ్యాప్యంలో తోడుగా నిలవాల్సిన కొడుకు దారుణ హత్యకు గురికావడం వారిని మరింత… pic.twitter.com/5mP4MnAYV0— YS Jagan Mohan Reddy (@ysjagan) July 19, 2024 -
దేశం దృష్టికి ఏపీ అరాచక పాలన.. ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా
పల్నాడు, సాక్షి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, దానిని దేశం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారు. వినుకొండలో హత్యకు గురైన యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం.. ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. వ్యక్తిగత కారణాలని క్రియేట్ చేశారు. కానీ, కేవలం వైఎస్సార్సీపీ కోసం పని చేశాడని రషీద్‌ను హత్య చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. హత్యలు చేస్తున్నారు. మా ఎంపీ, ఎమ్మెల్యేలపై కూడా దాడి చేశారు. మిథున్‌రెడ్డి, రెడ్డప్పపై దాడి చేశారు. దాడి చేసింది కాకుండా.. వాళ్లపైనే మర్డర్ కేసు పెట్టారు. గత ఐదేళ్లలో ఎన్నాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. లోకేష్ రెడ్‌బుక్ ప్రకారమే ఇదంతా జరుగుతోంది. దాడులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలి. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలియజేస్తాం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటాం... ఏపీలో జరుగుతున్న దాడులపై, అరాచకపాలనపై ప్రధాని మోదీ సహా అందరినీ కలుస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తాం. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్ర అరాచక పాలనకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తాం’’ అని అన్నారాయన. ఇక.. వచ్చే బుధవారం ఢిల్లీలో జగన్ నేతృత్వంలో ధర్నా జరుగుతుందని, ఇందులో వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొంటారని వైఎస్సార్సీపీ ప్రకటించింది. -
'ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరు'
-
గుర్తు చేస్తున్నా.. పట్టించుకోవట్లేదు
-
'15 నెలలు అవుతున్నా హామీ నెరవేర్చలేదు'
-
వైఎస్ జగన్ ధర్నాకు సీపీఐ మద్దతు
-
వైఎస్ జగన్ ధర్నాకు సీపీఐ మద్దతు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు సీపీఐ మద్దతు తెలిపింది. సీపీఐ తరపున కేరళ ఎంపీ సీఎన్ జయదేవన్ ధర్నా ప్రాంగణానికి వచ్చి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రత్యేక హోదా అనేది ఏపీ రాష్ట్రానికి లభించిన హక్కుగా పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ డిమాండ్ నెరవేర్చేంతవరకూ మద్దతిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. -
ఆనాడు వెంకయ్య అడగలేదా?:వైఎస్ జగన్
-
పవన్.. ఏ ప్యాకేజి ఆపుతోంది?
-
ఢిల్లీలో వైఎస్ జగన్ సమరభేరి