గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలనకు వ్యతిరేకంగా.. ఇక్కడి హింసాత్మక రాజకీయాలు దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దేశ రాజధాని వేదికగా బుధవారం ధర్నా చేపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా.. 36 హత్యలు జరిగాయి. 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1050 దాడులు-దౌర్జన్యాలు చోటు చేసుకున్నాయి. 300 హత్యాయత్న ఘటనలు నమోదయ్యాయి, 560 ప్రయివేటు ఆస్తులు ధ్వంసం, 490 ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం అయ్యాయి. 2,700 కుటుంబాలు ప్రాణభయంతో ఊళ్లు వదిలి పారిపోయే పరిస్థితులు తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. దీనికి నిరసగానే వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఈ ధర్నాలో పాల్గొనబోతున్నారు.
మూడు రోజులపాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోం మంత్రి సహా పలువురి అపాయింట్‌మెంట్ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు.
ఇదీ చదవండి: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: వైఎస్ జగన్
అలాగే.. పలు జాతీయ పార్టీల నేతల్నీ కలిసి ఇక్కడి పరిస్థితుల్ని వివరించనున్నారు. అలాగే వాళ్లనూ ధర్నాకు హాజరు కావాలని ఆహ్వానించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న ఈ పోరాటంలో కలిసొచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోతామని జగన్ ఇప్పటికే ప్రకటించారు.
అరాచకాలు అందరికీ తెలిసేలా..
ఢిల్లీలో రేపటి ధర్నాలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జరుగుతున్న హింసకు ఫొటో గ్యాలరీని, వీడియోలను ప్రదర్శించాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. అలాగే.. చట్టసభల్లోనూ పెద్దఎత్తున తమ పార్టీ వాణి వినిపిస్తామని అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment