కేంద్రంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వాలు ఏర్పడి 15 నెలలు కావస్తున్నా ప్రత్యేక హోదా హామీని పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యానారాయణ అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని వెంటనే నెరవేర్చాలని బొత్స డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న ధర్నాలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.