
వైఎస్ జగన్ ధర్నాకు సీపీఐ మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు సీపీఐ మద్దతు తెలిపింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు సీపీఐ మద్దతు తెలిపింది. సీపీఐ తరపున కేరళ ఎంపీ సీఎన్ జయదేవన్ ధర్నా ప్రాంగణానికి వచ్చి తన మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన.. ప్రత్యేక హోదా అనేది ఏపీ రాష్ట్రానికి లభించిన హక్కుగా పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ డిమాండ్ నెరవేర్చేంతవరకూ మద్దతిస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.