
హైదరాబాద్ కమ్యూనిస్టుల సొత్తు: నారాయణ
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రాష్ట్రంలో యుద్ధం ప్రకటించారని, అది ఢిల్లీలో చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సూచించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి రాష్ట్రంలో యుద్ధం ప్రకటించారని, అది ఢిల్లీలో చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ సూచించారు. హైదరాబాద్ కేసీఆర్దో, లగడపాటిదో కాదని కమ్యూనిస్టుల సొత్తు అని ప్రకటించారు. తెలంగాణ సాధనలో అనుకూల శ్రతువులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. దోపిడీదారులు, అవినీతిపరులు సమైక్యాంధ్ర ముసుగులో ఉన్నారన్నారు.
సీమాంధ్రలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న ఆందోళన స్వార్థ రాజకీయ ఉద్యమం కాదని అంతకుముందు నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరుగుతుందన్న భయాందోళనలతో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు రోడ్డెక్కారని అభిప్రాయపడ్డారు. అయితే అందులో పాల్గొంటున్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం ప్రజల్లో తమ పట్టు నిలుపుకునేందుకే ఉద్యమంలో చేరారని విమర్శించారు.