సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
చెన్నై: తూత్తుకూడి ఘటన కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..రేపు(శుక్రవారం) తమిళనాడు బంద్‌కు వామపక్షాలు మద్ధతు ఉంటుందని వ్యాఖ్యానించారు.కేంద్రమే దీనికి బాధ్యత వహించాలని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పతనానికి కర్ణాటక తొలిమెట్టు అవుతుందన్నారు. గవర్నర్ల వ్యవస్థ పనికి మాలిందని అన్నారు.
కేంద్రానికి, రాష్ట్రాల నడుమ గవర్నర్లు బ్రోకర్లుగా పనిచేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. టీటీడీ విషయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వస్తోన్న ఆరోపణలు ఆయనే నిరూపించుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం, టీటీడీని కూడా తమ ఆధీనంలోనికి తీసుకునేలా కనపడుతోందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment