'గుదిబండలా మారిన గవర్నర్'
తిరుపతి: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ గుదిబండలా మారారని సీపీఐ నాయకుడు కె. నారాయణ విమర్శించారు. గవర్నర్ ను మార్చడం కాదు, వ్యవస్థనే రద్దు చేయాలని అన్నారు.
బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆర్థిక నేరాల నిందితుడు లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నిందితురాలని పేర్కొన్నారు. 'లలిత్ గేట్'పై పార్లమెంట్ లో సమాధానం ఇస్తే.. ఉభయ సభలకు అవమానకరమన్నారు. సుష్మా స్వరాజ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వామపక్షాలు ఇప్పటికే డిమాండ్ చేశాయి.