బిగ్‌బాస్‌ షోను నిషేధించాలి: సీపీఐ నారాయణ | Bigg Boss Telugu 5: CPI Narayana Fires On Bigg Boss Show | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ షోపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

Published Sat, Sep 11 2021 4:54 PM | Last Updated on Sat, Sep 11 2021 6:38 PM

Bigg Boss Telugu 5: CPI Narayana Fires On Bigg Boss Show - Sakshi

బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిగ్‌బాస్‌ షో వల్ల ఎవరికి ఉపయోగమో చెప్పాలన్నారు. ఇలాంటి షోలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఈ అనైతిక షోను వేల కోట్ల వ్యాపారానికి ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహించారు. బూతులు, కొట్లాటలతో సాగే బిగ్‌బాస్‌ షో అనైతికమని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని ఆపాలంటూ గతంలో కోర్టుకెక్కినప్పటికీ, అటు న్యాయవ్యవస్థ, ఇటు పోలీసులు తనకు ఏమాత్రం సాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనికిమాలిన షోను టీవీలో ప్రసారించేందుకు అనుమతించకూడదని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement