'అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు'
హైదరాబాద్: లొంగిపోయిన నిజాం ప్రభువుకు ఇప్పటి తెలంగాణ పాలకులు వంగి దండాలు పెట్టడం అవమానకరమని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె. నారాయణ విమర్శించారు. తెలంగాణ విలీనదినోత్సవం నిర్వహణపై కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. నిజాంపై కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలన్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది ఒకే వర్గ స్వభావమని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం సాయుధ పోరాటాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వామపక్షాలు ఒకే వేదికపైకి రావాలని నారాయణ మరోసారి పిలుపునిచ్చారు.