telangana merger day
-
కేసీఆర్... నయా రజ్వీ: ఉత్తమ్
గాంధీభవన్‌లో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవం సాక్షి, హైదరాబాద్: రజాకార్ల ఆగడాలను ఎదిరించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ నయా ఖాసీం రజ్వీలాగా రజాకార్ల పాలనను సాగిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సెప్టెంబరు 17 విలీన దినోత్సవాన్ని గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో రజాకార్ల పాలనను గుర్తుకు తెచ్చేలా పేదలు, గిరిజనులు, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేశారని, నేరెళ్లలో దళితులపై పోలీసులు దాడి చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించిన ఘటనలను మరిచిపోకముందే భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో గుత్తికోయలపై పోలీసులు, అటవీ సిబ్బంది దాడులు చేయడం అమానుషమని అన్నారు. గిరిజన రైతుల ఇళ్లను కూల్చివేసి, మహిళా రైతులను వారి చీరలతోనే చెట్లకు కట్టేసి భయానక వాతావరణం సృష్టించారన్నారు. ఇలాంటి దుర్మార్గమైన పాలకులకు తరిమికొట్టడానికి మరో పోరాటానికి సిద్ధపడాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కోరిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడంలేదో చెప్పాలన్నారు. -
కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు
విలీన దినోత్సవంపై ఆయన మాట మార్చారు: ఉత్తమ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమంలో డిమాండ్ చేసిన కేసీఆర్.. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండీ ఎందుకు నిర్వహించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీన దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో, కోఠిలో అశోక స్థూపం వద్ద ఉత్తమ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా రెండు చోట్లా మాట్లాడారు. తొలి ప్రధానమంత్రి నెహ్రూ, కేంద్ర హోంమంత్రి వల్లభాయ్పటేల్ల కృషితోనే హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైందని పేర్కొన్నారు. అప్పడు హైదరాబాద్ స్టేట్‌లో భాగంగా ఉండి, ఇప్పుడు తమ పరిధిలో ఉన్న జిల్లాల్లో మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసినట్లుగానే నియంతృత్వంతో పాలిస్తున్న కేసీఆర్‌కు కూడా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు, అధికార ప్రతినిధి మధుయాష్కీ, రాపోలు ఆనంద్ భాస్కర్, నేతలు దానం నాగేందర్, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్, కనుకుల జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'కొత్త భాష్యం చెబుతున్న టీఆర్ఎస్ సర్కారు'
హైదరాబాద్: గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్నే టిఆర్ఎస్ సర్కార్ అనుసరించడం దౌర్భాగ్యమని ఎబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు మాసాని బాబురావు అన్నారు. నిజాం పరిపాలనలో ఉన్న కొన్ని జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో కలిశాయని.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలు విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతున్నాయని అన్నారు. కానీ తెలంగాణాలో ఏర్పడిన ప్రస్తుత ప్రభుత్వం మాత్రం కొత్త భాష్యం చెబుతుందని అన్నారు. విమోచనం కాదు విలీనం అని కోట్లాది మంది తెలంగాణవాదుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. -
'అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు'
హైదరాబాద్: లొంగిపోయిన నిజాం ప్రభువుకు ఇప్పటి తెలంగాణ పాలకులు వంగి దండాలు పెట్టడం అవమానకరమని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు కె. నారాయణ విమర్శించారు. తెలంగాణ విలీనదినోత్సవం నిర్వహణపై కేసీఆర్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారని ఆరోపించారు. నిజాంపై కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది ఒకే వర్గ స్వభావమని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం సాయుధ పోరాటాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వామపక్షాలు ఒకే వేదికపైకి రావాలని నారాయణ మరోసారి పిలుపునిచ్చారు. -
'తెలంగాణను వ్యతిరేకిస్తే ద్రోహులుగా ప్రకటిస్తాం'
నల్గొండ : తెలంగాణలో గానీ... సీమాంధ్ర ప్రాంతంలోకానీ తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని ద్రోహులుగా ప్రకటిస్తామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. నేడు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం సూర్యాపేటలోని తన నివాసంపై ఇంటిపై జాతీయ జెండాతో పాటు, తెలంగాణ, కాంగ్రెస్ జెండాలను ఎగురవేశారు.