
సాక్షి, హైదరాబాద్: వాస్తవాలను ప్రతిబింబించేలా ఎగ్జిట్ పోల్ ఫలితాలు లేవని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుంటే, ఏ అంశాల ఆధారంగా బీజేపీకి 300 సీట్లు దాటుతాయని చెబుతున్నారో అర్థం కావడం లేదన్నా రు. మంగళవారం మఖ్దూంభవన్‌లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకూడదని, ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఆగాలన్నా, అధికార పార్టీలోకి ఫిరాయింపులు నిలిచిపోవాలన్నా దామాషా పద్ధతి ఎన్నికల విధానాన్ని అనుసరిస్తేనే అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించే అవకాశాలు ఉంటాయన్నారు.