చిన్నారులను శిశువిహార్‌కు తరలింపు
చిన్నారులను శిశువిహార్‌కు తరలింపు
Published Mon, Sep 12 2016 10:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
మోత్కూరు:
మోత్కూరుకు చేరిన చిన్నారులను ఐసీడీఎస్ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండలోని శిశువిహార్‌కు తరలించారు. వివరాలు.. మోత్కూరు కొత్త బస్టాండ్‌లో ఆదివారం రాత్రి ఓ తండ్రి కిషన్ (4), అంజలి(3)ని వదిలి వెల్లాడు. అక్కడ స్థానికులు గమనించి మీది ఏ ఊరు, ఎక్కడి వచ్చారని వివరాలు అడిగారు. దీంతో మానాన్న పేరు నర్సింహ్మ, అమ్మ అనిత అని, మాది పాలమూరు అని చెప్పారు. మా నాన్న ఇక్కడ నిలిచోపెట్టి మల్లివస్తానని వెళ్లాడని చిన్నారులు తెలిపారు. రాత్రి కావడంతో స్థానిక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ ఎస్‌కె. జానీమియాకు అప్పగించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు శ్రీదేవి, సునితలకు అప్పగించగా స్థానిక కస్తూరిభా బాలికల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ యాదమ్మ వద్దకు తీసుకెళ్లారు. చిన్నారులు సరైన వివరాలు చెప్పకపోవడంతో ఎంఈఓ మన్నె అంజయ్య సమక్షంలో హెడ్‌కానిస్టేబుల్ జానిమియా, సీడీపీఓ వై.వి ఝాన్సీలక్ష్మీకి అప్పగించారు. వీరిని నల్లగొండలోని ప్రభుత్వ శిశు విహార్‌లో చేర్పించనున్నట్లు సీడీపీఓ తెలిపారు. హైదరాబాద్‌లోని లాలాపేట ప్రాంతంలో తాము అమ్మనాన్నలతో ఉన్నట్లు చిన్నారులు తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు మంగమ్మ, ప్రమీళ, ఎస్‌ఓ యాదమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు శ్రీదేవి, నిర్మల, హోంగార్డు సిద్దక్ తదితరులు ఉన్నారు.
.
Advertisement
Advertisement