విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
మోత్కూరు:
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం ఉదయం మండలంలోని దత్తప్పగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారృం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని జమ్మిచెట్టు కాలనీలో నివాసముంటున్న గీత కార్మికుడు గుండు నర్సయ్య(58) ఇంట్లోని నీటిసంపులో వరదనీరు చేరింది. ఉదయం నల్లాసంపులో చిన్నమోటారు సహాయంతో బురదనీరు తొలగించేందుకు నర్సయ్య ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు వైరు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని తహసీల్దార్ జి.దశరథ సందర్శించారు. ఆయన వెంట వీఆర్‌వోలు శంకర్, సోమయ్యలు ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసి ఆధుకోవాలని ఎంపీటీసీ సభ్యురాలు ఎలుగు పార్వతమ్మయాదయ్య కోరుతున్నారు. ఏఎస్‌ఐ సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.