భారత సైన్యానికి మద్దతుగా సంబరాలు | celebrated to support the indian army | Sakshi
Sakshi News home page

భారత సైన్యానికి మద్దతుగా సంబరాలు

Published Thu, Sep 29 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

భారత సైన్యానికి మద్దతుగా సంబరాలు

భారత సైన్యానికి మద్దతుగా సంబరాలు

మోత్కూరు: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చిన భారత సైన్యానికి మద్దతుగా కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానికంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చౌరస్తాలో బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత జవాన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. భారత సైన్యం తీసుకున్న నిర్ణయానికి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మైనార్టీసెల్‌ తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి జహంగీర్‌పాషా, ఐఎన్‌టీయూసీ యూత్‌ రాష్ట్ర కార్యదర్శి ఎండి. అయాజ్, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, జిల్లా కార్యదర్శి కల్యాణ్‌ చక్రవర్తి, నాయకులు కొత్తపెల్లి వెంకటేశ్వర్లు, సైదులు, సోములు, ఎండి.సమీర్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement