చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: లెహర్ తుపాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంటుందని, ఈ దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. లెహర్ తుపాన్ నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తలను కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ‘న్యూస్‌లైన్’కు ఆయన మంగళవారం వివరించారు. లెహర్ తుపాను ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెక్చరికల కేంద్రం, అమెరికన్ మెట్రోలాజికల్ టీం హెచ్చరించాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఫైలిన్ తుపాను కారణంగా జిల్లాలోని 80 శాతం చెరువుల్లోకి నీళ్లు చేరాయన్నారు. హెలెన్ తుపాను కారణంగా కురిసిన మోస్తరు వర్షాలకు చెరువులు ప్రమాదస్థితికి చేరుకున్నాయని వివరించారు. లెహర్ ప్రభావం జిల్లాపై అధికం గా ఉంటుందని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరించాయన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ దృష్ట్యా కలెక్టరేట్, తిరుపతి, చిత్తూరు డివిజన్ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
16 మండలాలపై ప్రభావం
జిల్లాలోని 16 మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని జేసీ తెలిపారు. తిరుపతి డివిజన్‌లోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, చిత్తూరు డివిజన్ పరిధిలోని విజయపురం, నగరి, నిండ్ర, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, కార్వేటినగరం, నారాయణవనం మండలాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్న మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. వర్షాలు కురిసే సమయంలో సర్పంచ్‌లు, వీఆర్వోలు, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ధాన్యం తరలింపు
తూర్పు మండలాల్లో రైతుల చేతికి అందిన పంట ముంపునకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నామని చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, డీఆర్‌డీఏ శాఖల ద్వారా బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జేసీ సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
26 సీటీఆర్ 11 : జేసీ బసంత్‌కుమార్ ‘లెహర్’పై అప్రమత్తం
ఉందని చెప్పారు. ఈ దృష్ట్యా కలెక్టరేట్, తిరుపతి, చిత్తూరు డివిజన్ కార్యాలయాల్లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
16 మండలాలపై ప్రభావం
జిల్లాలోని 16 మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని జేసీ తెలిపారు. తిరుపతి డివిజన్‌లోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, చిత్తూరు డివిజన్ పరిధిలోని విజయపురం, నగరి, నిండ్ర, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, కార్వేటినగరం, నారాయణవనం మండలాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్న మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. వర్షాలు కురిసే సమయంలో సర్పంచ్‌లు, వీఆర్వోలు, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ధాన్యం తరలింపు
తూర్పు మండలాల్లో రైతుల చేతికి అందిన పంట ముంపునకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నామని చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, డీఆర్‌డీఏ శాఖల ద్వారా బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జేసీ సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు.
‘లెహర్’పై అప్రమత్తం
Published Wed, Nov 27 2013 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
Advertisement