sri kalahasthi
-
గ్రహణ సమయంలో శ్రీకాళహస్తిలో పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
చంద్రబాబు పర్యటనలో టీడీపీ నేతల ఓవరాక్షన్
రేణిగుంట (చిత్తూరు జిల్లా): తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం శ్రీకాళహస్తి పర్యటనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి దేవాలయాలపై టీడీపీ జెండాలు ఉంచారు. దీంతో భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి. అయినా దేవాలయాలపై ఇలా రాజకీయ పార్టీ జెండాలు పెట్టడాన్ని భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే కాకుండా అక్కడి రోడ్ల పక్కన ఉన్న మున్సిపాలిటీ కుండీలకు కూడా టీడీపి జెండాలు కట్టారు. ఈ చర్యలు ఎన్నికల నియమావళికి వ్యతిరేకం అని మున్సిపల్ అధికారులు అంటున్నారు. ( చదవండి: శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ ) -
రైతే రాజయ్యేలా..
సాక్షి, శ్రీకాళహస్తి : రుణమాఫీ మాయాజాలంతో అంతు చిక్కని మోసం..విత్తన, ఎరువుల పంపిణీలో అవినీతి జాడ్యం..ధీమా ఇవ్వని పంటల బీమా, వాతావరణ బీమా పథకాలు..పంట రుణాల మంజూరులో తిరకాసులు..సంక్షేమ పథకాల లబ్ధిలో పైరవీలు...వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో దగాపడ్డ అన్నదాతలు. తమను ఆదుకునే నాథుడే లేరా అంటూ ఎదురుచూస్తున్న తరుణంలో ప్రతిపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి రూపంలో చిరుదివ్వెలా కనిపించిన వెలుగు.. మహాజ్వాలగా మారి అంధకారం నిండుకున్న రైతుల జీవితాల్లో వెలుగులు ప్రసరించ సాగింది. నవరత్నాల పథకాలతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా వరాలు ప్రకటించిన జననేత అన్నదాతలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజాసంకల్పయాత్రలో ప్రకటించిన హామీలపై అన్నదాతల్లో హర్షం వ్యక్తంమవుతోంది. ‘సహాయనిధి’ చాలా సంతోషం 2015లో అతివృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోలేదు. ఈ ఏడాది అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు రూ.4 వేల కోట్లు సహాయనిధి ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇవ్వడం హర్షణీయం – కలివేలయ్య, పాపనపల్లి వడ్డీ రాయితీతో ఎంతో మేలు బ్యాంకుల్లో తీసుకునే పంట రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లించి రైతులకు పూర్తిగా రాయి తీ కల్పించడం ఎంతో మేలు. టీడీపీ ప్రభుత్వం విధానాలతో పంట రుణాలపై వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. జగన్ ఇచ్చిన హామీ పేద రైతులకు ఎంతో మేలు. – ప్రసాద్‌నాయుడు,, సూరావారిపల్లి -
శ్రీగిరి.. భక్త జన ఝరి
శ్రీశైలం/శ్రీకాళహస్తి(రేణిగుంట)/నరసరావుపేట: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో కిటకిటలాడుతోంది. శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం నాడే మహాశివరాత్రి పర్వదినం కూడా రావడంతో భ్రమరాంబ సమేత మల్లికార్జునుడి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. ఆదివారం రాత్రే నాలుగు లక్షల మందికి పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. కర్ణాటకతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నల్లమల మీదుగా పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్నారు. భక్తులందరికీ 24 గంటలూ మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యాలకు అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్లన్న సర్వదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నెల ఏడు వరకు ఇదే తరహాలో అనుమతిస్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించడానికి భక్తులు పోటెత్తడంతో స్నానఘట్టాలు కిక్కిరిశాయి. గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైలేశుడు శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆదివారం రాత్రి గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి.. ప్రధానాలయ రాజగోపురం గుండా రథశాలకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం ప్రధాన మాడ వీధిలోని అంకాలమ్మగుడి, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్సింగ్, ఈఓ శ్రీరామచంద్రమూర్తి, చైర్మన్ వంగాల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం రాత్రి 10గంటల నుంచి శ్రీమల్లికార్జునస్వామి వార్లకు 11 మంది రుత్వికులు వేదమంత్రోచ్ఛారణతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ప్రారంభిస్తారు. ఒకవైపు అభిషేకం జరుగుతుండగానే.. మరోవైపు మల్లన్న వరుడయ్యే శుభముహూర్తం రాత్రి 10.30 నుంచి ఆరంభమవుతుంది. గర్భాలయ కలశవిమాన శిఖరం నుంచి ముఖమండపంపై ఉన్న నవనందులను కలుపుతూ అతిసుందరంగా పాగాను అలంకరిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట సమీపంలో అత్యంత శోభాయమానంగా అలంకరించిన కల్యాణవేదికపై శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవ కల్యాణం ఆగమ శాస్త్రానుసారం జరిపిస్తారు హంసవాహనంపై విహరించిన ఆదిదేవుడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాళహస్తీశ్వరుడు హంసవాహనంపై, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు చిలుక వాహనంపై విహరించారు. రాత్రి హాలాహలాన్ని సేవించిన నీలకంఠుడు మగతనిద్రలోకి జారుకోగా ఆయనను మేల్కొలిపేందుకు నాగులు నిర్వహించే ఉత్సవమే నాగరాత్రి. ఉదయం హంస–చిలుక వాహనాల్లో పార్వతీపరమేశ్వర్లు పురవీధుల్లో విహరించారు. అలాగే రాత్రి కైలాసపతి శేష వాహనంపై చిద్విలాసంతో భక్తులకు ఆభయ ప్రధానం చేశారు. తల్లి జ్ఞానప్రసూనాంబ యాళి వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఈవో పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మహాశివరాత్రి సందర్భంగా రాహుకేతు పూజలను సోమవారం రద్దు చేశారు. నేడు కోటప్పకొండ తిరునాళ్లు మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో సోమవారం మహా తిరునాళ్ళు జరగనున్నాయి. ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని భావిస్తున్నారు. త్రికోటేశ్వరుడిని సోమవారం తెల్లవారు జాము నుంచే భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు త్రికోటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మొక్కుబడి కింద విద్యుత్ ప్రభలు, పెద్దా, చిన్న తడికె ప్రభలు నిర్మించి తీసుకురానున్నారు. అధికారులు తిరునాళ్లకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తిచేశారు. కోటప్పకొండకు నరసరావుపేట డిపో నుంచి 255 ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేయగా, చిలకలూరిపేట, అద్దంకి, వినుకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు. ఈ తిరునాళ్లను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర పండుగగా ప్రకటించారు. శ్రీకాళహస్తిలో నేడు నందిసేవ – లింగోద్భవ అభిషేకం చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి రోజున శివుడు నంది వాహనంపై ఊరేగడం ఆనవాయితీ. ధర్మానికి ప్రతీకగా ఉన్న నందిపై ఊరేగుతున్న పరమశివుని దర్శిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. ఇందుకోసం భక్తులు భారీ సంఖ్యలో శ్రీ కాళహస్తికి తరలి వస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో లింగోద్భవ దర్శనం ఇక్కడ మరో ప్రధానఘట్టం. విషప్రభావంతో ఉన్న శివుడు తిరిగి మేల్కొనడాన్ని లింగోద్భవంగా పిలుస్తారు. మహాశివరాత్రి రోజు రాత్రి నంది వాహనంపై స్వామి ఊరేగింపునకు వెళ్లి తిరిగి వచ్చే సమయానికి పూజారులు 10 రకాల అభిషేకాలను నిర్వహిస్తారు. గర్భాలయంలో మూలమూర్తి వెనుకభాగంలో ఉన్న లింగోద్భవ మూర్తికి 11వ అభిషేకం (లింగోద్భవ అభిషేకం) శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ అభిషేకం కేవలం మహాశివ రాత్రి రోజున మాత్రమే నిర్వహిస్తారు. వేకువజామున రెండుగంటల సమయంలో జరిగే ఈ ఉత్సవంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తారు. -
నేడు స్వామివారి ధ్వజారోహణం
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం మాఘబహుళ నవమిని పురస్కరించుకుని స్వామివారి ధ్వజారోహణం జరుగనుంది. ఆలయంలో స్వామి వారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తం భం వద్ద మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ధ్వజా రోహణ పూజలు ప్రారంభం కానున్నాయి. శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం భక్త కన్నప్ప ధ్వ జారోహణం వైభవంగా జరిగింది. సా యంత్రం కైలాసగిరుల్లోని భక్త కన్నప్ప ఆలయంలో ధ్వజారోహణంతో బ్ర హ్మో త్సవాలకు అంకురార్పణ జరిగింది. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారథ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దిగివచ్చి దీవించా లంటూ దేవతలను అర్చకులు శాస్త్రో క్తంగా ఆహ్వానించారు. భక్తుడైన భక్తకన్నప్ప ఉత్సవాల్లో ప్ర«థమ పూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. సాయంత్రం 4.15గంటలకు ధ్వజారోహణ పూజలు ప్రారంభమయ్యాయి. గంట పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆలయం నుంచి శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్త కన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగసుందరంగా అలంకరించి మేళతాళాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ఊరేగింపుగా కైలాసగిరి కొండపై ఉన్న భక్త కన్నప్ప ఆలయానికి వేంచేపు చేశారు. ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.∙వేదమంత్రోచ్ఛారణల నడు మ శాస్త్రోక్తంగా దర్భతో తయారు చేసిన పవిత్ర దారాన్ని, వస్త్రాన్ని «ధ్వజస్తంభాని కి ఆరోహింపజేశారు. దీప,ధూçప, నైవే ద్యాలు సమర్పించారు. దీంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ పూర్తయింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు, మేళతాళాలు నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమ ర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ భ్రమరాంబ, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మున్సి పల్ చైర్మన్ ముత్యాల పార్థసార«థి, దేవస్థానం మాజీ చైర్మన్లు శాంతా రామ్ జే పవార్, పీఆర్ మోహన్, కోలా ఆనంద్, ప్రముఖులు పాల్గొన్నారు. -
తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చి...
40 సవర్లు బంగారం, రూ.3 లక్షలు చోరీ శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తి ఆలయంలో పూజలు చేసుకుంటే వ్యాపారం బాగా జరుగుతుందని నమ్మబలికి తీర్థంలో మత్తు మందు కలిపి ఇచ్చి 40 సవర్లు బంగారం, రూ.3 లక్షలు చోరీ చేసిన ఘటన శనివారం శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. డీఎస్పీ వెంకట కిశోర్ కథనం మేరకు... కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపురం జిల్లా గౌరీబిదనూరుకు చెందిన గోపాలకృష్ణ రైస్ మిల్లులు నడుపుతున్నారు. ఆయనకు రెండు నెలల కిందట విజయవాడకు చెందిన సత్యనారాయణతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సత్యనారాయణ పలుమార్లు గోపాలకృష్ణ ఇంటికి వెళ్లాడు. గోపాలకృష్ణ రైస్‌మిల్లులో వ్యాపారం సక్రమంగా జరగకపోవటాన్ని ఆసరాగా తీసుకున్న సత్యనారాయణ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో బంగారు ఆభరణాలు ధరించి పూజలు చేసుకుంటే వ్యాపారం బాగా జరుగుతుందని నమ్మబలికాడు. గోపాలకృష్ణ చెల్లెలి కొడుకు మనోజ్‌కు శ్రీకాళహస్తి ఆలయంలో ఉద్యోగం ఇప్పించేందుకు రూ.3 లక్షలు తీసుకురావాలని సత్యనారాయణ చెప్పాడు. గోపాలకృష్ణ, అతని భార్య వసంత, తల్లి నారాయణమ్మ గోపాలకృష్ణ చెల్లెలి కొడుకు మనోజ్ (హిందూపురం వాసి), మనోజ్ స్నేహితుడు కొండలబాబు (భద్రాచలం వాసి) శుక్రవారం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. నగిరివీధిలోని ఒక లాడ్జిలో రెండు గదులు అద్దెకు తీసుకున్నారు. విజయవాడ నుంచి సత్యనారాయణ కూడా శుక్రవారం శ్రీకాళహస్తికి చేరుకున్నారు. వారికి శనివారం ఉదయం దర్శనం చేయించి లాడ్జీకి పంపించారు. స్వామి, అమ్మ వారి తీర్థం తాగేవరకు బంగారు ఆభరణాలు అలాగే శరీరంపై ఉంచుకోవాలని చెప్పి సత్యనారాయణ తీర్థంలో మత్తు కలిపి అందజేశారు. తీర్థం తాగిన వెంటనే గోపాలకృష్ణ, వసంత, నారాయణమ్మ, మనోజ్, కొండలబాబు మత్తులోకి జారుకున్నారు. ఇదే అదునుగా భావించిన సత్యనారాయణ 320 గ్రాముల బంగారు ఆభరణాలు, ఉద్యోగం కోసం మనోజ్ తీసుకువచ్చిన రూ.3 లక్షలు, అతని స్నేహితుడు కొండలబాబు బ్యాగులోని రూ.15 వేలు నగదు, సెల్ఫోన్లు తీసుకుని పరారయ్యాడు. వారు మధ్యాహ్నం వరకు అద్దె గదుల నుంచి బయుటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది కిటికీలో నుంచి పరిశీలించారు. చలనం లేకుండా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ చిన్నగోవింద్, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకుని మత్తులో ఉన్న ఐదుగురిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయంత్రానికి మత్తు దిగడంతో వారు పోలీసులకు పరిస్థితిని వివరించారు. కేసు నమోదు చేసి సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. -
సందేశాత్మక చిత్రాలు కరువయ్యాయి
ముక్కంటి సేవలో దాసరి శ్రీకాళహస్తి : సందేశాత్మక చిత్రాలు కరువయ్యాయని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. శనివారం ఆయన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆల యానికి విచ్చేశారు. ఈవో బి.రామిరెడ్డి స్వాగతం పలికారు. రూ. 2500 టికెట్ ద్వారా దాసరి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వచనం పొందారు. ఈవో రామిరెడ్డి దుశ్శాలువాతో సత్కరించి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన జ్ఞానప్రసూనాంబ అతిథి భవనంలో వి లేకరులతో మాట్లాడారు. నేడు ప్రతి చిత్రం కమర్షియల్‌పైనే నడుస్తోందన్నారు. నటులు, దర్శకులు, నిర్మాతలు సంప్రదాయబద్ధంగా ఉండడంతో పాటు ఒక చక్కటి సందేశాన్ని ప్రజలకు అందించే చిత్రాలను నిర్మించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. -
శ్రీకాళహస్తిలో బైక్ రేసింగ్‌ల కలకలం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో అర్ధరాత్రి బైక్ రేసింగ్‌లు కలకలం రేపింది. జిల్లా పరిధిలోని శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదీ వంతెనపై ఆదివారం అర్ధరాత్రి దాటాక యువకులు బైక్‌లతో విచ్చలవిడిగా హల్ చల్ చేశారు. ఈ ఆనందంలో అదుపు తప్పిన రెండు బైకులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో మునికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. -
జనవరిలో ముక్కంటికి కుంభాభిషేకం
రూ.10కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ముక్కంటీశుని ఆలయంలో కుంభాభిషేకాన్ని 2015 జనవరిలో నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి గురువారం ముఖ్యమైన అధికారులు, ప్రధాన అర్చకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000లో కుంభాభిషేకం నిర్వహించారని, తర్వాత 2012లో జరగాల్సి ఉండగా వారుుదా పడుతూ వస్తోందని చెప్పారు. ప్రధాన అర్చకులు బాబు గురుకుల్ మాట్లాడుతూ 12 ఏళ్లకొకసారి జరగాల్సిన కుంభాభిషేకాన్ని వాయిదా వేయడంతోనే ఆలయానికి కొన్ని ఇబ్బందులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో రెండు గంటలపాటు కుంభాభిషేకంపై చర్చలు సాగాయి. 2015 జనవరిలో కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. స్వామివారి ధ్వజస్తంభానికి ఉన్న రాగి తొడుగును తొలగించి, రూ. 5 కోట్లతో బంగారు తొడుగు ఏర్పాటు చేస్తారు. మే నెలలో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. -
భక్తుల నిలువుదోపిడీ
రాహు-కేతు పూజల్లో బలవంతపు వసూళ్లు పనిచేయని సీసీ కెమెరాలు అధికారులకూ వాటాలు! శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా అర్చకులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వాటా అందుతున్న కారణంగానే ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం రాహు-కేతు పూజలకు పేరుగాంచింది. ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో భక్తులు అనేక మోసాలకు గురవుతున్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పూజారులు అందినకాడికి దోచుకుంటున్నారు. అడుగడుగునా దోపిడీ పట్టణంలోని దేవస్థానం సమాచారకేంద్రం నుంచి ఆలయం వరకు, సన్నిధివీధిలో నేతి దీపాలు, కొబ్బరికాయలు, గరిక, జిల్లేడు మాలలు విక్రయించే దుకాణాలు అనేకం ఉన్నాయి. వీటిని ఆలయంలోకి అనుమతించరు. రాహు-కేతు పూజలు చేయించుకునే భక్తులు వీటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దేవస్థానం వారే పూజా సామగ్రిని అందజేస్తారు. అయినా రాహు-కేతు టికెట్లు తీసుకున్న భక్తులకు దుకాణదారులు వీటిని బలవంతంగా అంటగడుతున్నారు. బలవంతంగా దక్షిణ రూ.300, రూ.750, రూ.1500, రూ.2,500 టికెట్లపై రాహు-కేతు పూజలు జరుగుతున్నాయి. పూజలు చేయించుకున్న భక్తులు చివర్లో తప్పనిసరిగా దక్షిణ(డబ్బు) సమర్పించుకోవాల్సి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత దోషం పోవాలంటే బ్రాహ్మణులకు గోదానం, భూదానం, సువర్ణదానం చేయాల్సిఉంటుందని పూజారులు బాహాటంగానే చెబుతుం టారు. వాటిని ఇవ్వడం వీలుకాదు కాబట్టి దక్షిణ ఇవ్వాలని వారే సలహా ఇస్తుంటారు. ఏమవుతుందో ఏమోనని భక్తులు తోచినంత ఇచ్చి వెళుతున్నారు. పూజకో రేటు రాహు-కేతు పూజా టికెట్లు మూడు రకాలుగా ఉన్నా యి. మూడు ప్రాంతాల్లో పూజలు జరుగుతున్నాయి. ఒక్కో పూజ చేసుకునే భక్తులు ఒక్కో రకమైన దక్షిణ సమర్పించుకోవాలి. రూ.300 పూజ చేసుకునే భక్తులు రూ.50, రూ.750 పూజ వారు రూ.100, రూ.1500 పూజ చేసుకునే భక్తులు రూ.200 నుంచి 300 వరకు దక్షిణ ఇవ్వాలి. పనిచేయని సీసీ కెమెరాలు మృత్యుంజయ మండపంలోని సీసీ కెమెరాలు మాత్రమే పనిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా రూ.300, రూ.1500 టికెట్లు కొని రాహుకేతు పూజలు చేయించుకుంటుంటారు. వీటిని ఆలయంలోని మృత్యుంజయ మండపంలో చేస్తారు. ఇక్కడే ప్రధానంగా ఆలయ కిందిస్థాయి సిబ్బంది, దళారులు, అర్చకులు భక్తుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. భక్తుల నుంచి అధికమొత్తంలో దక్షిణ రూపంలో, దానధర్మం పేరిట వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకూ వాటాలు ఆలయంలోని స్వామి అమ్మవార్ల సన్నిధిలోనే కాకుండా పరివార దేవతల వద్ద పూజారులు, పరిచారకులు ఉన్నారు. హారతి పళ్లాలను నిషేధించారు. దీనివల్ల భక్తులకు దక్షిణలు ఇచ్చే బాధ తప్పిందని భావించారు. అయితే మళ్లీ ఈ తంతు సాధారణమై పోయింది. హారతి పళ్లాలు, రాహు-కేతు పూజల్లో వచ్చే వసూళ్లు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఆలయంలోని మృత్యుంజయ మండపంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఇటీవల నా దృష్టికి వచ్చింది. వాటిని త్వరలో బాగు చేయిస్తాం. ఆలయంలో జరిగే రాహుకేతు పూజల్లో భక్తుల నుంచి దక్షిణ వసూలు చేయరాదని అర్చకులను ఆదేశించాం. ఎక్కడైనా దక్షిణ వసూలు చేస్తుంటే భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. విచారించి చర్యలు తీసుకుంటాం. - పూర్ణచంద్రరావు, ఇన్చార్జి ఈవో -
గ్యాస్ సిలండర్ పేలుడు: ముగ్గురికి గాయాలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బి. అగ్రహారంలో ఓ ఇంట్లో మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను తిరుపతి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘన స్వాగతం
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం తంగేళ్లపాళెం చేరుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో స్వాగతించారు. ఈ గ్రామంలో రెండు చోట్ల జగన్ కాన్వాయ్‌ను క్వారీల్లో పనిచేస్తున్న కార్మికులు, వారి కుటుంబాలకు చెందిన తమిళ మహిళలు ఆపి అభిమాన నేతను కలుసుకున్నారు. తమను జగన్ ఆశీర్వాదించారనేది తమిళంలో చెప్పుకుంటూ సంతోషపడ్డారు. కిక్కిరిసిన రోడ్లు తంగేళ్లపాళెంలో జగన్ రాక సందర్భంగా రోడ్లు జనంతో కిక్కిరిసిపోయాయి. జననేతను చూసేందుకు యువకులు చెట్లపైకి ఎక్కడం కనిపించింది. తారాజువ్వలు పేల్చుతూ తమ నాయకుడికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికాయి. అక్కడ నుంచి బసవయ్యపాళెం, కొత్తబైపాస్రోడ్డు క్రాస్‌ల్లో తన కోసం వేచి ఉన్న మహిళలను, గ్రామస్తులను పలకరిస్తూ జగన్మోహన్రెడ్డి శ్రీకాళహస్తిలోని వీఎంపల్లెకు చేరుకున్నారు. -
నేడు జగన్ పర్యటన ఇలా...
సాక్షి, చిత్తూరు: వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నాల్గో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజైన బుధవారం శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి యాత్ర ప్రారంభం. మిట్టకండ్రిగ, చెర్లోపల్లె, ఇసుకగుంట వరకు రోడ్‌షో. చల్లపాళెం, మేర్లపాక ఎస్సీ కాలనీ మీదుగా ఏర్పేడు వరకు రోడ్‌షో. ఏర్పేడులో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన మ హానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సీతారాంపేట మీదుగా అంజిమేడు చేరుకుంటారు. అక్కడ మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. గోపాలపురం, మల్లవరం, గుత్తివారిపల్లె, రేణిగుంట సర్కిల్, రేణిగుంట పట్టణం వరకు రోడ్‌షో. రేణిగుంటలో వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. కేఎల్ఎం హాస్పిటల్ సర్కిల్ జీవగ్రాం వద్ద మోజెస్ భగవాన్ దాస్ కుటుంబాన్ని ఓదారుస్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో దామినేడు నుంచి తిరుచానూరు మీదుగా అవిలాల క్రాస్ వరకు రోడ్‌షో. అవిలాలలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఎంఆర్‌పల్లె పోలీసు స్టేషన్ మీదుగా వైకుంఠపురం ఆర్చి, తుమ్మల గుంట మీదుగా రోడ్‌షో. చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో రాత్రి బస. -
అందరికీ అండగా ఉంటా
ఎల్లవేళలా అందరికీ అండగా ఉంటానని జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘నాలుగు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం రాగానే అవ్వ, తాతల పింఛన్లు రూ.700కు పెంచుతా.. అంటూ వృద్ధులకు ఆయన భరోసా ఇచ్చారు. జిల్లాలో నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర తొమ్మిదో రోజు మంగళవారం సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో సాగింది. జననేతకు అడుగడుగునా జనం అపూర్వ స్వాగతం పలికారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నాటి యాత్ర బీఎన్.కండ్రిగ మండలంలోని నీర్పాకోట గ్రామం నుంచి ప్రారంభమైంది. తన కోసం వేచి ఉన్న గ్రామస్తులు, మహిళలను ఆయన పలకరించారు. అక్కడ నుంచి నీర్పాకోట ఎస్సీ కాలనీకి చేరుకుని దళిత మహిళలు, యువకులను పలకరించారు. నీర్పాకోట పోలీసుస్టేషన్ సమీపంలో గిరిజనుల వద్ద ఆగి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. అనంతరం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. బీఎన్.కండ్రిగలో జరిగిన బహిరంగసభలో జననేత పాల్గొన్నారు. బీఎన్.కండ్రిగలో నాలుగు చోట్ల మహిళలు గుంపులు గుంపులుగా కాన్వాయ్‌ను ఆపి తమ అభిమాన నాయకుడిని కలుసుకున్నారు. వీరందరినీ జననేత ఆశీర్వదించారు. వృద్ధులను పలకరించారు. రోడ్ షోలో ఒక మహిళ జగన్‌ను కలిసి బీఎన్.కండ్రిగలో బ్రాందీషాపులు ఎత్తేయాలని వినతిపత్రం సమర్పించారు. ఉదయం నుంచే పురుషులు తాగుతున్నారని, కుటుంబాలు అవస్థలు పడుతున్నాయని చెప్పారు. బీఎన్.కండ్రిగ శివార్లలో గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ జగన్‌కు స్వాగతం పలికారు. ఇక్కడ రోడ్డు పక్కన ఆపివున్న బస్సుల పైకి యువకులు ఎక్కి వైఎస్ఆర్సీపీ జెండాలు ఊపుతూ జగన్‌కు స్వాగతం పలకడం కనిపించింది. వృద్ధులకు భరోసా బీఎన్.కండ్రిగ శివార్ల నుంచి కొంచెం ముందుకు రాగానే ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వలస రైతుకూలీలు చెరుకు కొట్టడం ఆపి రోడ్డుపైకి వచ్చి జగన్‌ను కలిశారు. వారి సమస్యలను ఆయన ఓపిగ్గా విన్నారు. కూలీల్లో ఓ వృద్ధురాలు నాయనా.. ఈ వయసులోనూ కష్టపడుతున్నాం, ఆర్థికంగా చాలడం లేదని జగన్ దృష్టికి తెచ్చారు. జననేత స్పందిస్తూ ‘అవ్వా నీలాంటి వాళ్లు కష్టపడాల్సిన అవసరం లేదు, త్వరలో మన ప్రభుత్వం రాగానే మీకు పింఛన్ పెంచుతాం. పిల్లల తల్లులూ భయపడాల్సిన పనిలేదు. ఇద్దరు పిల్లలు ఉంటే వారికి ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున ఆ తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాం. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే వృద్ధుల పింఛన్, అమ్మ ఒడి పథకాలపై సంతకాలు చేస్తా’ అని భరోసా ఇచ్చారు. చిన్నపిల్లలను పలకరిస్తూ నువ్వు బడికిపోవాలి, నువ్వూ బడికి పోవాలి అంటూ వారిని ముద్దాడి ఆశీర్వదించారు. తర్వాత 10వ మైలు వద్దకు రాగానే నెల్లూరు జిల్లా మతకామూడి గ్రామం నుంచి వచ్చి తోటలో గెరిక్కాయలు కోస్తున్న కూలీలు జగన్‌ను చూసి రోడ్డుపైకి పరుగున చేరుకున్నారు. వీరిని చూసిన జగన్ కాన్వాయ్ ఆపారు. తమకు ఉపాధిహామీ పనుల్లో తగినంత కూలి రావడం లేదని జననేతకు ఫిర్యాదు చేశారు. అందుకోసమే ఇలా పక్క జిల్లాకు వచ్చి పనులు చేసుకుంటున్నామని తెలిపారు. నాన్నంత గొప్పవాడు కావాలి మయూరి షుగర్‌ఫ్యాక్టరీ వద్ద వృద్ధులు తమకు పింఛన్ రావడం లేదని, ఒకరిద్దరికి వస్తున్నా అది చాలడం లేదని జగన్ దృష్టికి తెచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యను పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఒక మధ్యవయస్కురాలు ముందుకు వచ్చి జగనయ్యా నువ్వు మీ నాన్నంత గొప్పవాడు కావాలని దీవించింది. అరిగలకండ్రిగ వద్దకు రోడ్‌షో రాగానే రైతులు జగన్‌ను కలిసేందుకు తోసుకు వచ్చారు. వీరందరికీ జననేత అభివాదం చేసి సమస్యలు విన్నారు. బ్యాంకు రుణంపై వడ్డీభారం పెరుగుతోందని రైతులు చెప్పారు. బ్యాంకులో రూ.20 వేలు రుణం తీసుకుంటే ఇప్పుడు వడ్డీతో సహా రూ.70 వేలు కట్టమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అన్యాయమని, ప్రభుత్వంలోకి రాగానే రైతుల వడ్డీ సమస్యను పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఒక మహిళ అన్నా గ్యాస్ సబ్సిడీ రావడం లేదు, పూర్తి డబ్బులు కట్టి గ్యాస్ తీసుకుంటున్నామని తెలిపారు. జగన్ స్పందిస్తూ అవునమ్మా ఈ ప్రభుత్వం చేస్తున్నదంతా మోసమేనన్నారు. అక్కడి నుంచి కాటూరు చేరుకుని జననేత రోడ్ షో నిర్వహించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆలత్తూరు రోడ్డు, కత్తివారికండ్రిగల్లోనూ జనం సమస్యలు తెలుసుకుంటూ కదిలారు. స్థానికులు సమైక్యాంధ్ర జెండాలతో ఎదురెళ్లి ఆహ్వానించారు. వీఎంపల్లెలో ఓదార్పు శ్రీకాళహస్తి సమీపంలోని వీఎంపల్లెలో జననేత ఓదార్పులో పాల్గొన్నారు. మహానేత వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమాని పసల చిన్నపాపయ్య మృతి చెందారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి కుటుంబ సమస్యలు విన్నారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం, వైఎస్ఆర్సీపీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ వరప్రసాద్, కార్మికవర్గ కన్వీనర్ బీరేంద్ర వర్మ, పార్టీ నాయకులు వై.సురేష్, విరూపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
‘లెహర్’పై అప్రమత్తం
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: లెహర్ తుపాన్ ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంటుందని, ఈ దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని జాయింట్ కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. లెహర్ తుపాన్ నేపథ్యంలో తీసుకున్న జాగ్రత్తలను కలెక్టరేట్లోని తన చాంబర్లో ‘న్యూస్‌లైన్’కు ఆయన మంగళవారం వివరించారు. లెహర్ తుపాను ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ, విశాఖ తుపాను హెక్చరికల కేంద్రం, అమెరికన్ మెట్రోలాజికల్ టీం హెచ్చరించాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఫైలిన్ తుపాను కారణంగా జిల్లాలోని 80 శాతం చెరువుల్లోకి నీళ్లు చేరాయన్నారు. హెలెన్ తుపాను కారణంగా కురిసిన మోస్తరు వర్షాలకు చెరువులు ప్రమాదస్థితికి చేరుకున్నాయని వివరించారు. లెహర్ ప్రభావం జిల్లాపై అధికం గా ఉంటుందని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరించాయన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి తర్వాత జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ దృష్ట్యా కలెక్టరేట్, తిరుపతి, చిత్తూరు డివిజన్ కార్యాలయాల్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 16 మండలాలపై ప్రభావం జిల్లాలోని 16 మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని జేసీ తెలిపారు. తిరుపతి డివిజన్లోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, చిత్తూరు డివిజన్ పరిధిలోని విజయపురం, నగరి, నిండ్ర, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, కార్వేటినగరం, నారాయణవనం మండలాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్న మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. వర్షాలు కురిసే సమయంలో సర్పంచ్‌లు, వీఆర్వోలు, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం తరలింపు తూర్పు మండలాల్లో రైతుల చేతికి అందిన పంట ముంపునకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నామని చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, డీఆర్డీఏ శాఖల ద్వారా బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జేసీ సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. 26 సీటీఆర్ 11 : జేసీ బసంత్‌కుమార్ ‘లెహర్’పై అప్రమత్తం ఉందని చెప్పారు. ఈ దృష్ట్యా కలెక్టరేట్, తిరుపతి, చిత్తూరు డివిజన్ కార్యాలయాల్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 16 మండలాలపై ప్రభావం జిల్లాలోని 16 మండలాల్లో లెహర్ తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని జేసీ తెలిపారు. తిరుపతి డివిజన్లోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం, కేవీబీపురం, సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, చిత్తూరు డివిజన్ పరిధిలోని విజయపురం, నగరి, నిండ్ర, పుత్తూరు, వడమాలపేట, రామచంద్రాపురం, కార్వేటినగరం, నారాయణవనం మండలాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చెరువులు నిండి ప్రమాదకర స్థితిలో ఉన్న మండలాల్లో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని వివరించారు. వర్షాలు కురిసే సమయంలో సర్పంచ్‌లు, వీఆర్వోలు, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ధాన్యం తరలింపు తూర్పు మండలాల్లో రైతుల చేతికి అందిన పంట ముంపునకు గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేపట్టనున్నామని చెప్పారు. వ్యవసాయ, మార్కెటింగ్, డీఆర్డీఏ శాఖల ద్వారా బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. వర్షాలు కురిసే సమయాల్లో ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని జేసీ సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. -
చిన్నారులను చిదిమేస్తున్నారు
పాలబుగ్గల చిన్నారులు, బుడిబుడి నడకల పాపాయిలు సైతం పురుషుల కామవాంఛకు బలైపోతున్నారు. ఆడుకోడానికి వెళ్లిన ఆరేళ్ల చిన్నారిని ఒక మృగాడు మాయమాటలతో చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి పాల్పడ్డాడు. తర్వాత తాడుతో మెడకు బిగించి చంపాడు. ఇంతకూ ఈ చిన్నారి చేసిన పాపం ఏమిటి? శ్రీకాళహస్తి/ఏర్పేడు, న్యూస్‌లైన్: అన్నెం పుణ్నెం ఎరుగని ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురికావడం ఏర్పేడు మండలంలోని కుక్కలగుంట ఎస్టీ కాలనీలో విషాదం నిం పింది. ఎస్టీ కాలనీకి చెందిన సుజాత(6) స్థానిక పా ఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆదివారం మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఆడుకునేందుకు పాఠశాల వద్దకు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన గిలకల చిన్నసుబ్బయ్యు కువూరుడు గిరి(25) బాలికకు మాయమాటలు చెప్పి చెరుకు తోటలోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాలిక స్పృహ కోల్పోయింది. దీంతో బాలిక మెడను తాడుతో బిగిం చాడు. బాలిక చనిపోయిందని నిర్ధారించుకుని ఇంటికి వచ్చేశాడు. కాగా ఆదివారం సాయంత్రమే బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు రేఖ, మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.మంగళవారం సుజాత మృతదే హాన్ని చెరకు తోటలో గుర్తించారు. బాలిక శరీరంపై పళ్ల గాట్లు, తాడుతో బిగించిన గుర్తులు ఉన్నాయి. తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామ్కువూర్, ఎస్ఐ విక్రమ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయుంతో నిందితుడి ఆచూకీ కోసం ప్రయుత్నించారు. విషయం బయటకు పొక్కడంతో అత్యాచారం, హత్యకు పాల్పడిన గిరి పారిపోతుండగా రేణిగుంట వుండలంలోని అ త్తూరు సమీపంలో స్థానికులు జనార్దన్, సురేంద్ర పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కుక్కలగుంట ఎస్టీకాలనీలో విషాదం నెలకొంది. కఠినంగా శిక్షించాలి బాలికపై అత్యాచారం హత్యకు పాల్పడిన గిరిని కఠినంగా శిక్షించాలని ఎస్టీ కాలనీ వాసులు కోరుతున్నారు. ఇతను గతంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారు తెలిపారు. గిరి మొదటి భార్య భర్త వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. అతను రెండో పెళ్లి చేసుకోగా, ఆమె కూడా ఇతని వేధింపులు తట్టుకోలేక ఇంట్లోనించి పారిపోయిందన్నారు. నేర చరిత్ర ఉన్న గిరిని కఠినంగా శిక్షించాలని గ్రావుస్తులు కోరారు. ఆరునెలల్లో నాలుగో ఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలో ఆరునెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది నాల్గవసారి. ఐదు నెలల క్రితం శ్రీకాళహస్తి వుండలం భీవువరంలో ఎనిమిదేళ్ల బాలిక పంటపొలాల్లో లైంగికదాడికి గురైన విషయుం తెలిసిందే. ఆ బాలిక అనారోగ్యంతో ఇప్పటికీ అవస్థలు పడుతోంది. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై తరగతిగదిలోనే కిందిస్థారుు ఉద్యోగి అత్యాచారానికి ఒడిగట్టాడు. మూడు నెలల క్రితం వుండలంలోని ఎగువవీధి గ్రావుంలో ఆడుకుంటూ దాహంతో మంచినీళ్లు తాగేందుకు స్నేహితురాలి ఇంట్లోకి వెళ్లిన చిన్నారిపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన అప్పట్లో సంచలనలం రేపింది. ప్రస్తుతం ఏర్పేడు మండలంలో ఆరేళ్ల సుజాత అత్యాచారం, హత్యకు గురికావడం ఈ ప్రాంతవాసులను మరింత ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి నేరాలపై పోలీసులు అధి కారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.