శ్రీకాళహస్తి నుంచి యాత్ర ప్రారంభం. మిట్టకండ్రిగ, చెర్లోపల్లె, ఇసుకగుంట వరకు రోడ్‌షో. చల్లపాళెం, మేర్లపాక ఎస్సీ కాలనీ మీదుగా ఏర్పేడు వరకు రోడ్‌షో.
సాక్షి, చిత్తూరు: వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాల్గో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర పదో రోజైన బుధవారం శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్, జిల్లా కన్వీనర్ కె.నారాయణస్వామి తెలిపారు.
శ్రీకాళహస్తి నుంచి యాత్ర ప్రారంభం.
మిట్టకండ్రిగ, చెర్లోపల్లె, ఇసుకగుంట వరకు రోడ్‌షో.
చల్లపాళెం, మేర్లపాక ఎస్సీ కాలనీ మీదుగా ఏర్పేడు వరకు రోడ్‌షో.
ఏర్పేడులో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన మ హానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
సీతారాంపేట మీదుగా అంజిమేడు చేరుకుంటారు. అక్కడ మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
గోపాలపురం, మల్లవరం, గుత్తివారిపల్లె, రేణిగుంట సర్కిల్, రేణిగుంట పట్టణం వరకు రోడ్‌షో.
రేణిగుంటలో వైఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
కేఎల్‌ఎం హాస్పిటల్ సర్కిల్ జీవగ్రాం వద్ద మోజెస్ భగవాన్ దాస్ కుటుంబాన్ని ఓదారుస్తారు.
చంద్రగిరి నియోజకవర్గంలో దామినేడు నుంచి తిరుచానూరు మీదుగా అవిలాల క్రాస్ వరకు రోడ్‌షో.
అవిలాలలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ఎంఆర్‌పల్లె పోలీసు స్టేషన్ మీదుగా వైకుంఠపురం ఆర్చి, తుమ్మల గుంట మీదుగా రోడ్‌షో.
చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంట్లో రాత్రి బస.