సందేశాత్మక చిత్రాలు కరువయ్యాయి | dasari narayana rao in sri kalahasthi | Sakshi
Sakshi News home page

సందేశాత్మక చిత్రాలు కరువయ్యాయి

Published Sun, May 17 2015 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

dasari narayana rao in sri kalahasthi

ముక్కంటి సేవలో దాసరి
శ్రీకాళహస్తి : సందేశాత్మక చిత్రాలు కరువయ్యాయని  దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. శనివారం ఆయన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆల యానికి  విచ్చేశారు. ఈవో బి.రామిరెడ్డి స్వాగతం పలికారు. రూ. 2500 టికెట్ ద్వారా దాసరి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం  గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వచనం పొందారు. 

ఈవో రామిరెడ్డి దుశ్శాలువాతో సత్కరించి స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన  జ్ఞానప్రసూనాంబ అతిథి భవనంలో వి లేకరులతో మాట్లాడారు. నేడు ప్రతి చిత్రం కమర్షియల్‌పైనే నడుస్తోందన్నారు. నటులు, దర్శకులు, నిర్మాతలు సంప్రదాయబద్ధంగా ఉండడంతో పాటు ఒక చక్కటి సందేశాన్ని ప్రజలకు అందించే చిత్రాలను నిర్మించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement