Directors Day 2024: డైరెక్టర్స్‌ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం | Directors Day 2024: TFDA celebrates the director day on the birth anniversary of Dasari Narayanarao | Sakshi

Directors Day 2024: డైరెక్టర్స్‌ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం

Apr 11 2024 12:42 AM | Updated on Apr 11 2024 12:42 AM

Directors Day 2024: TFDA celebrates the director day on the birth anniversary of Dasari Narayanarao - Sakshi

– దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్‌

దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్‌ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్‌ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం.

ఈ ఈవెంట్‌ ద్వారా ఫండ్‌ రైజ్‌ చేసి డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్‌ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్‌ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్‌ కమిటీలో డైరెక్టర్స్‌ అనిల్‌ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్‌ కేవీ, విజయ్‌ కనకమేడల ఉంటారు’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement