Veera Shankar
-
Directors Day 2024: డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్ కమిటీలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారు’’ అన్నారు. -
ఆసక్తికరంగా ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి’ ట్రైలర్
రవితేజ నున్నా, నేహ జురెల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి.వెంకట శివ సాయి పిల్మ్స్ పతాకంపై మణికొండ రంజిత్ సమర్పణలో సత్యరాజ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. ముత్యాల రామదాసు,నున్నా కుమారి గారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ విడుదల చేశారు. లవ్, కామెడీ, సస్పెన్స్ వంటి అంశాలతో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పల్లెటూరు నేపథ్యంలో సాగే హాస్య సన్నివేశాలతో వినోదభరితంగా ట్రైలర్ ప్రారంభమైంది. నాయికా నాయకుల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు మెప్పించాయి. సాఫీగా సాగిపోతున్న ట్రైలర్ కథానాయిక హత్యతో ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్‌ని ముగించారు. -
టీఎఫ్‌డీఏ నూతన అధ్యక్షుడిగా వీరశంకర్
తెలుగు సినీ దర్శకుల సంఘం (టీఎఫ్‌డీఏ) సంఘం నూతన అధ్యక్షుడిగా దర్శకుడు బి. వీరశంకర శ్రీనివాస్ (వీరశంకర్) గెలుపొందారు. 2024–2026 సంవత్సరాలకు గాను ఆదివారం హైదరాబాద్‌లో టీఎఫ్‌డీఏ ఎన్నికలు జరిగాయి. దర్శకుల సంఘంలో దాదాపు 2000 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బి. వీరశంకర శ్రీనివాస్, వి. సముద్రరావు, జి. రామ్‌ప్రసాద్, ఏఎస్ రవికుమార్ చౌదరి, పానుగంటి రాజారెడ్డి పోటీ చేశారు. ఈ పోటీలో 536 ఓట్లతో వీరశంకర్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నీలం సాయిరాజేశ్, ఎమ్వీఎన్ రెడ్డి (వశిష్ఠ), జనరల్ సెక్రటరీగా సీహెచ్ సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా వద్దానం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీఎస్ ప్రియదర్శి, డి. వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ట్రెజరర్‌గా పీవీ రామారావు గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ. కృష్ణమోహన్, అల్లా భక్స్, రాజా వన్నెంరెడ్డి, శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి, కూరపాటి రామారావు, లక్ష్మణరావు చాపర్ల, ప్రవీణ మడిపల్లి, రమణ మొగిలి, కొండా విజయ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు దర్శకుల సంఘం స్థాయిని నెక్ట్స్ లెవల్‌కి తీసుకుని వెళ్లేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. ఇప్పుడు ఉన్న టీఎఫ్డీఏను ‘టీఎఫ్‌డీఏ 2.ఓ’ అన్నట్లుగా వర్క్ చేస్తాం. హైదరాబాద్‌కు ఎవరైనా పర్యాటకులు వస్తే టీఎఫ్‌డీఏ బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలన్నట్లుగా చేస్తాం. మంచి ఆలోచనలుంటే ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది’’ అన్నారు. -
సినీ దర్శకుల సంఘం ఎలక్షన్స్: గెలించింది ఎవరంటే?
తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరశంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా డైరెక్టర్ వీర శంకర్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్స్ గా వశిష్ఠ, సాయి రాజేష్.. జనరల్ సెక్రటరీలుగా మద్దినేని రమేష్ , సుబ్బారెడ్డి.. ట్రెజరర్ గా పి.వి. రమణరావు విజయం సాధించారు. కాగా ఆదివారం ఉదయం తెలుగు సినీ దర్శకుల సంఘం ఎన్నికలు జరిగాయి. వీర శంకర్, సముద్ర ప్యానెల్ బరిలోకి దిగాయి. దర్శకుల సంఘంలో 1500 మంది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగ్గా సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించారు. వీర శంకర్ విజయం సాధించినట్లు ప్రకటించారు. మొత్తం 1113 ఓట్లు పోలవగా ఇందులో వీరశంకర్‌కు 536 రాగా సముద్రకు 304 వచ్చాయి. చదవండి: ఓటీటీలో గుంటూరు కారం.. ఆ విషయంలో మాత్రం ఆడియన్స్ డిసప్పాయింట్! -
రావణలంకలో పాటలు
క్రిష్ బండిపల్లి హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘రావణలంక’. బి.ఎన్.ఎస్ రాజు దర్శకత్వం వహించారు. కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో అశ్విత, త్రిష కథానాయికలుగా నటించారు. ఉజ్జల్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను డైరెక్టర్ వీరశంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత క్రిష్ బండిపల్లి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాను ఎందుకు నువ్వే నిర్మిస్తున్నావని కొందరు స్నేహితులు అడిగారు. వేరే నిర్మాతల దగ్గరికి వెళితే బడ్జెట్ సమస్యలు వస్తాయని నేనే నిర్మించానని చెప్పాను. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. ‘‘యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. హిమాలయాల్లో కొన్ని అద్భుతమైన సన్నివేశాలు తీశాం. బ్యాంకాక్, వైజాగ్‌లోనూ చిత్రీకరణ జరిపాం. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను తీశారు’’ అన్నారు బి.ఎన్.ఎస్ రాజు. -
ప్రముఖ దర్శకుడి ఇంట్లో విషాదం
సాక్షి, తణుకు: ప్రముఖ దర్శకుడు వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ(83) మంగళవారం ఉదయం కన్నుమూశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలో ఉన్న చివటం గ్రామంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కేన్సర్‌తో ఆయన బాధ పడుతున్నారు. సత్యనారాయణకు ముగ్గురు కుమారులు వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్ ఉన్నారు. (టాలీవుడ్లో మరో విషాదం) తన తండ్రి గురించి వీరశంకర్ మాట్లాడుతూ.. ‘మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో కేన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం’ అన్నారు. వీరశంకర్ తండ్రి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. శ్రీకాంత్ హీరోగా నటించిన ‘హల్ ఐ లవ్ యూ’ సినిమాతో వీరశంకర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగుతో పాటు కన్నడ సినిమాలకు దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్ సినిమా తీశారు. ప్రేమకోసం, విజయరామరాజు, యువరాజ్యం, మన కుర్రాళ్లే తదితర సినిమాలను ఆయన తెరకెక్కించారు. (నటుడు శ్రీకాంత్‌కు పితృవియోగం) -
సరికొత్త పాత్రలో రాజమౌళి
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి నటుడిగా అవతారం ఎత్తుతున్నారా ? అది అతిథి పాత్రలో అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర పరిశ్రమ వర్గాలు. ప్రముఖ దర్శకుడు వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'మన కుర్రాళ్లే'. ఆ చిత్రంలో రాజమౌళి అతిథి పాత్రలో నటించనున్నారని సమాచారం. ఆ చిత్రంలో రాజమౌళి నటిస్తున్న పాత్ర ఆ చిత్రానికి అత్యంత కీలకమైందని ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. మన కుర్రోళ్లు చిత్రం అరవింద్ కృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే తన దర్శకత్వంలో మహా బిజీగా ఉన్న రాజమళి... అతిథి పాత్రలో నటించడం ద్వారా మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ప్రతి ప్రయత్నం కొత్తగానే...
‘‘సగటు ప్రేక్షకునికి చేరువయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించాను. సందేశంతో కూడిన సమస్యాత్మక కథాంశమిది’’ అని దర్శకుడు వీరశంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో అరవింద్ కృష్ణ, రాజ్కల్యాణ్, రచన మల్హోత్రా, శ్రుతీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మన కుర్రాళ్లే’. బీవీఎస్ శ్రీనివాస్, హరూన్ హెచ్.ఎస్ ఈ చిత్రానికి నిర్మాతలు. రాజ్, గురుకిరణ్, జి.కె, మనోమూర్తి, శివ కాకాని, మోహన్ జోహ్న, బీమ్స్, పవన్‌కుమార్, సాయిరామ్ మద్దూరి కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని దర్శకుడు మారుతి, పాటల సీడీని నటుడు కృష్ణుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ,‘‘సమాజంలో ఎదురవుతున్న సంఘటనలు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ఇది. ఎందుకంటే... కథకు తగ్గట్టు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు. నేటి సమాజంలో ఇలాంటి సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, వీరశంకర్ చేసే ప్రతి ప్రయత్నం కొత్తగానే ఉంటుందనీ అతిథిగా విచ్చేసిన దర్శకుడు శివనాగేశ్వరరావు చెప్పారు. యువతకు వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందించే సినిమా ఇదని మారుతి అన్నారు. యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు రామ్‌ప్రసాద్, దేవీప్రసాద్, వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, విమర్శకులు మహేశ్ కత్తి, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మన కుర్రాళ్లే మూవీ స్టిల్స్