విలేజ్‌లో మిస్టరీ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ | Raju Gari Ammayi Naidu Gari Abbayi Movie Released In OTT, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

విలేజ్‌లో మిస్టరీ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్‌

Published Tue, Feb 11 2025 8:37 AM | Last Updated on Tue, Feb 11 2025 9:56 AM

Raju Gari Ammayi Naidu Gari Abbayi Movie OTT Streaming Now

రవితేజ నున్నా, నేహ జురెల్‌ హీరో హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’. గతేడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం సుమారు పది నెలల తర్వాత సడెన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. మణికొండ రంజిత్‌ సమర్పణలో సత్యరాజు  దర్శకత్వంలో ముత్యాల రామదాసు, నున్నా కుమారి నిర్మించిన ఈ చిత్రం ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కించారు.

మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో వచ్చిన  ‘రాజుగారి అమ్మాయి.. నాయుడుగారి అబ్బాయి’ సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. హీరోయిన్‌ హత్యతో సినిమా కథ మొదలౌతుంది. ఆపై ఒక్కసారిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఆమెను కథానాయకుడే చంపాడని, పోలీసులు అతని కోసం వెతుకుతుంటారు. అసలు రాజు గారి అమ్మాయి ఎలా చనిపోయింది? నాయుడు గారి అబ్బాయే ఆమెను హత్య చేశాడా? హత్యకు కారణమేంటి? అనే ఇంపాక్ట్‌తో కథ ఉంటుంది. ల‌వ్ స్టోరీకి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల‌ను జోడించారు. కానీ, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

చిన్న సినిమాగా విడుదలైన రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి  టైటిల్‌ను షార్ట్ కట్‌లో రానా పేరుతో ప్ర‌మోట్ చేశారు. ఐఎమ్‌డీబీలో  8.5 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చాలామంది కొత్తవారే నటించారు. కానీ, నటన పరంగా వారికి మంచి మార్కులే పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement